కంప్యూటర్ ఉపయోగించి మీ బిడ్డ కొత్త భాష నేర్చుకోవడానికి మీరు ఎలా సహాయపడగలరు

 

స్కూలులో తప్పనిసరి కావొచ్చు, అయితే మీ బిడ్డ రెండో భాషను నేర్చుకోవడం ప్రారంభించడం వల్ల కొత్త ప్రపంచంలోని ప్రవేశించడానికి బాటలు వేస్తుంది. ఇంటి వద్ద మాట్లాడని భాషను నేర్చుకోవడంతో సహా, విభిన్న రకాల సవాళ్లన ఎదుర్కొనే సామర్ధ్యాన్ని మీ బిడ్డ సంపాదించుకోగలుగుతాడు.

మీ బిడ్డ కొరకు ఇంటి వద్ద కంప్యూటర్తో ఒక భాషను ఎంచుకోవడం చాలా తేలిక. వాస్తవానికి ఇది ఒక మేరకు, వేగంగా కూడా ఉంటుంది. అభ్యసన వనరులు 24/7 లభ్యం అవుతాయి కనుక, మీ బిడ్డ తనకు నచ్చిన వేగంతో ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రాథమికాంశాలను నేర్చుకోవచ్చు- స్కూలు మరియు ట్యూషన్ల కంటే అత్యంత వేగంగా ఉంటుంది, ఎందుకంటే కొత్తవిషయాలను ఇంటరాక్టివ్ మరియు ఆస్వాదించే రీతిలో నేర్చుకోవడం ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది.

ఒక కంప్యూటర్ ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి:

 

1) గ్రామర్ ఎంచుకోండి

మీ బిడ్డ భాషా అభ్యసన యాత్రలో గ్రామర్ అనేది పిల్లలు గ్రామర్ మొదటి అడుగు. Mylangauge అనేది మన దేశంలో బోధించబడే దిగువ ప్రాంతీయ భాషల కొరకు విజువల్ మరియు ఆడియో వనరులను అందించే ఒక గొప్ప ప్రదేశం.

1. గుజరాతీ
2. కన్నడం
3. తెలుగు
4. బెంగాలీ
5. హిందీ
6. మలయాళం
7. మరాఠీ
8. పంజాబీ
9. తమిళం

అనేక బోర్డులు, మౌఖిక లేదా స్పీకింగ్ టెస్ట్లను చేర్చాయి. మీబిడ్డ గ్రామర్, మరియు ప్రాథమిక పదాలు మరియు పదబంధాలు తెలుసుకున్న తరువాత, సహనంగా ఒక సంభాషణ ప్రారంభించవచ్చు.

 

2) సజీవం రూపంలో భాషను గమనించడం

భాష మాట్లాడటం, భాషతో మరింత వ్యక్తిగత అనుసంధానం కావడం ద్వారా సగం పని పూర్తవుతుంది, YouTube, Voot, Hotstar, Netflix వంటి ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్ఫారాల్లో మీ బిడ్డ ఉచ్ఛారణ, భాషా నిర్ధిష్ట వ్యవహారాలు మరియు కొత్త పదాలు- వినోదం మరియు మీ బిడ్డకు అదే సమయంలో అవగాహన సైతం కలిగించే వయస్సుకు తగ్గ వీడియోలను సబ్టైటిల్స్తోపాటుగా చూడవచ్చు. “పరిచయ” కారకం అనేది దీర్ఘకాలంలో తిరిగి గుర్తు చేసుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది.

 

3) ఫ్లాష్కార్డులతో ప్రాణ స్నేహితులు అవ్వండి

పదజాలం నేర్చుకోవడానికి రుజువు చేయబడ్డ ఒక మార్గం. భాషను నేర్చుకోవడానికి ఫ్లాష్కార్డులు ఒక వినోదాత్మక మరియు పోటీ మార్గం. 101 Languages మన ప్రధాన ప్రాంతీయ భాషల్లో లభ్యం అవుతున్న అద్భుతమైన కంప్యూటర్ వనరు.

1. హిందీ
2. బెంగాలీ
3. తెలుగు
4. తమిళం
5. మరాఠీ
6. గుజరాతీ

అన్ని బోర్డుల్లో సెకండ్ లేదా థర్డ్ ల్యాంగేజ్ అయినప్పటికీ, అన్ని రకాల ఆవశ్యకతలకు ఈ వెబ్సైట్ గొప్పగా సహాయపడుతుంది.

 

రాబోయే సంవత్సరాల్లో మీ బిడ్డ విద్యా విజాలను సాధించడం కొరకు మార్గాలను రూపొందించడం కొరకు డిజిటల్ పేరెంట్గా మారడం అనేది అత్యుత్తమ భాగం!