మెరుగైన స్కూలు ప్రజంటేషన్‌లు ఏవిధంగా చేయాలి

 

క్లాసులో ప్రజంటేషన్ లు ఇవ్వడం అనేది కాస్తంత భయం కలిగించవచ్చు, అయితే అంతగా భయపడాల్సిన విషయం కాదు. సరైన ప్లానింగ్ మరియు ప్రిపరేషన్ తోపాటు మంచి కంప్యూటర్, ఎంతో మార్పును చూపిస్తాయి. ఒకవేళ మీరు స్కూలు ప్రజంటేషన్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైనట్లయితే, దీనికి సంబంధించి మేం ఇదిగో ఇలా సహాయపడగలం.
ఈ సరళమైన చిట్కాల ద్వారా, ప్రజంటేషన్ ని మొత్తం క్లాస్ ఆస్వాదించేలా చేయవచ్చు.

1. ఎల్లప్పుడూ నిర్ధిష్టంగా ఉండండి.

మీ ప్రజంటేషన్ ప్రారంభించడానికి ముందు, ‘‘నేను కేవలం మూడు విషయాలు మాత్రమే గుర్తుంచుకోగలిగితే, నేను వేటిని గుర్తుంచుకోవాలి?’’ అని ప్రశ్నించుకోండి.

దీనివల్ల అంతగా పెద్దగా ఉపయోగం లేని విషయాలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. మీ టీచర్ కవర్ చేయాలని కోరుకునే అన్ని విషయాలతో కూడిన ఒక చెక్ లిస్ట్ రూపొందించుకోండి, అలానే జాబితాలో పొసగని అంశాలను తొలగించండి.

2. చిత్రాలతో పాటుగా చెప్పండి.

90% సమాచారాన్ని మనం చిత్రాల ద్వారా తీసుకుంటాం. ఫోటోగ్రాఫ్ లు, డయాగ్రమ్ లు, ఛార్టులు,మ్యాప్ లు మరియు డ్రాయింగ్ లు వంటి విజువల్స్ – అన్ని కూడా ఒక విషయాన్ని నిర్ధిష్టంగా చెప్పడానికి మరియు మీ ప్రజంటేషన్ ని ఇతరులు ఆసక్తి చూడటానికి సహాయపడతాయి. మీరు చెప్పాలని అనుకునే పాయింట్ కు మీ విజువల్స్ మద్దతు ఇచ్చేవిధంగా చూసుకోండి మరియు మీ స్లైడ్ లు మరింత క్లీన్ గా మరియు ఖచ్చితంగా ఉండేందుకు ప్రతి స్లైడ్ కు ఒక ఫోటోని మించి ఉపయోగించవద్దు.

3. టెంప్లెట్ లతో ప్రయోగం

మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, గూగుల్ స్లైడ్ లు, ప్రిజీ మరియు ఇతర పిసి ప్రజంటేషన్ టూల్స్ లో మీరు ఎంచుకోవడం కొరకు అనేక కస్టమైజబుల్ టెంప్లెట్ లు ఉంటాయి. ఫాంట్ లు, స్లైడ్ అనువాదాలు, యానిమేషన్ సౌండ్ లు, మరియు మొత్తం బ్యాక్ డ్రాప్ కు హెడ్డర్ ల ఎంపిక, ఇలా ప్రతిదీ కూడా మిగిలిన వాటి కంటే మరింత మెరుగ్గా కనిపించడానికి మార్చవచ్చు.

4. ప్రాక్టీస్ చేయడం వల్ల ఫరెక్ట్ గా మారవచ్చు.

ప్రజంటేషన్ లు సంభాషణల రూపంలో ఉండటం మరింత ఉత్తమం. రెండువైపులా ఉండే డైలాగ్ ల వల్ల మీరు (లేదా మీ గ్రూపు) మరింత గుర్తుంచుకోవచ్చు మరియు చర్చకు దారితీస్తుంది. ఇటువంటి చర్యలను టీచర్లు ప్రశంసిస్తారు. మీలో పబ్లిక్ స్పీకింగ్ ఆత్మస్థైర్యాన్ని రూపొందించుకోవడం కొరకు మీ ప్రజంటేషన్ ని మీ తల్లిదండ్రులు మరియు స్నేహితుల ముందు ప్రాక్టీస్ చేయండి, అలానే మీ ప్రజంటేషన్ ఆకట్టుకునేవిధంగా ఉండటం కొరకు వారి ఫీడ్ బ్యాక్ ని ఉపయోగించండి. ప్రతి ప్రాక్టీస్ రన్ ద్వారా, మీ పాయింట్ ని మరింత స్పష్టంగా మరియు వేగంగా ప్రజంట్ చేయడానికి దోహదపడుతుంది.

వీటన్నింటితోపాటుగా, సరైన సమాచారం, డిజైన్ తోపాటుగా కొంత ప్రజంటేషన్ ప్రాక్టీస్ ద్వారా స్కూలులో మరింత మెరుగైన ప్రజంటేషన్ లు చేయడానికి దోహదపడుతుంది.

ఈ ఆర్టికల్ మీకు మరింత సహాయకారిగా ఉందా? స్కూలు కొరకు మరింత సహాయకారిగా చిట్కాల కొరకు, మీరు మీ ప్రాజెక్ట్ లపై 10/10ని ఎలా పొందాలో చదవవచ్చు.