కంప్యూటర్ ల్యాబ్లో పిల్లలకోసం సురక్షితమైన ఇంటర్నెట్ రూపొందించడమెలా?

ఇంటర్‌నెట్ అనేది మిమ్మల్ని విద్యావంతులను చేయడానికి మరియు సమాచారం తెలియజేయడానికి ఉద్దేశించిన శక్తివంతమైన ఉపకరణం. ప్రతి ఒక్క ఊహాత్మక అంశంపైనా సమాచారాన్ని, వివరాలను భద్రపరచుకున్న గని. అదే సమయంలో, విద్యార్థులకు అభ్యంతరకర సమాచారాన్నికూడా తేలికగా అందజేయగలదు. కాబట్టి, అటువంటి వ్యర్థ సమాచారాన్ని స్కూలులో విద్యార్థులు పొందడానికి వీల్లేకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. [1]

మీరు చేయాల్సిందేమిటో ఇక్కడ చూడండి :

  1. అభ్యంతరమైన అడల్ట్ కంటెంట్ గల వెబ్‌సైట్లు యాక్సెస్ కాకుండా నిరోధించండి.

    గన్, డ్రగ్ కల్చర్‌ని ప్రమోట్ చేసేలా గ్రాఫిక్ సమాచారంతో కూడిన వెబ్‌సైట్లు, గ్యాంబ్లింగ్ సైట్లు లెక్కకు మించి ఉంటాయి. వాటితోపాటు మరియు పిల్లలు చూడదగని సమాచారాన్ని కలిగిన వెబ్‌సైట్లు ఉంటాయి. పిల్లలు అనుకోకుండా అడల్ట్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. (సాధారణంగా అమాయకంగా ఫొటోలపై లేదా లింకులపై క్లిక్ చేస్తుంటారు). కాస్త వయసొచ్చిన పిల్లలు వాటిని చూస్తుండవచ్చు. కాబట్టి, స్కూలులోని కంప్యూటర్లలో అడల్ట్ వెబ్‌సైట్లను నిరోధించాలి.

 

  1. డౌన్‌లోడ్‌లను నివారించడానికిగాను థర్డ్ పార్టీ ఫైల్ షేరింగ్‌ని అనుమతించే విపిఎన్‌లను బ్లాక్ చేయాలి.  

    విపిఎన్ (వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) అనేది భద్రతా ఆంక్షలను బైపాస్ చేస్తుంది. ఇదొక సొరంగ మార్గంలా పనిచేస్తుంది. ఇంటర్‌నెట్‌లో అభ్యంతరకర విభాగాలను విద్యార్థులు యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా లేదా అశ్లీల సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయకుండా నెట్ నానీ, నార్టన్ ఫ్యామిలీ లేదా కె9 వెబ్ ప్రొటెక్షన్ వంటి స్దాఫ్ట్‌వేర్‌లను వాడుకోవాలి.
  2. ఫైల్ యాక్సెస్ నియంత్రించడానికిగాను యాక్సెస్ ఫిల్టర్ల వినియోగం

    యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ (ఏసిఎల్) అనేది సిస్టంలో ఏమి చెయ్యవచ్చు లేదా ఏమి చేయరాదు అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థులు ఇంటర్‌నెట్ నుంచి ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకుండా ఎసిఎల్ నిరోధిస్తుంది. ఫైల్ యాక్సెస్ ఫిల్టర్లు కలిగిన ఎసిఎల్‌ని వివిధ ఆన్‌లైన్ సేవలద్వారా పొందవచ్చు. ఈ ఫిల్టర్లను మీరు ఎంచుకున్న ఫైళ్లకు అప్లయి చేసి డౌన్‌లోడ్‌ని నిరోధించవచ్చు. ఇతర ఫైళ్లు యధాతధంగా అందుబాటులో ఉంటాయి. [2]

స్కూలు నాలుగు గోడల నడుమ విద్యార్థులకు సానుకూలమైన సైట్లు ఏవి అనేది టీచర్లు మరియు స్కూలు యాజమాన్యం నిర్ణయించుకోవడం అతి ముఖ్యం. అందుకనుగుణంగానే చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌నెట్ యాక్సెస్‌ని నిరోధించే సమయంలో ఇతర ఉపయుక్తమైన సమాచారానికి ఆటంకం కలగకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయంలో సేవలందిచడానికి మెక్ఆఫీ ఇంటెగ్రేటెడ్ సర్వీసులతో కూడిన చాలా ఏఐఓ డెస్క్‌టాప్‌లు ఉన్నాయి. ఈ ఫ్రేమ్‌వర్క్‌ని వాడుకోవడంద్వారా స్కూలులో ఇంటర్‌నెట్ వినియోగం విద్యార్థులకు ఉపయుక్తమైనదిగా తీర్చిదిద్దుదాం.