మీ సెలవులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి

 

సెలవులు సరదాగా మరియు స్వేచ్ఛను అనుభవించే రోజులు -అయితే ఈ సరదాను మీరు కేవలం ప్లేగ్రౌండ్ లేదా ప్లేస్టేషన్‌కు పరిమితం చేయాల్సిన అవసరం లేదు! మీ పిసిపై లభ్యం అయ్యే అత్యధిక వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ప్రొయాక్టివ్‌గా ఉండండి మరియు చాలా వినోదాత్మకంగా ఆటలో చాలా ముందు ఉండండి.

1. యూట్యూబ్ యొక్క పవర్‌ని తెలుసుకోండి

ఒక ఛానల్ ఏర్పాటు చేయడం ద్వారా మీ టాలెంట్ ప్రపంచానికి చూపించడానికి మరియు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఇతర యూట్యూబ్‌లను అనుసరించే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సైషో వంటి ఛానల్స్ సాయంతో మీరు ఇంటి వద్ద సైంటిఫిక్ ప్రయోగాలు సైతం చేయవచ్చు. ఇంటి వద్ద ఐస్ క్రీమ్‌లు ఎలా తయారు చేయాలి లేదా ఆడుకోవడానికి ప్లఫ్పీలు ఎలా తయారు చేయవచ్చు వంటి విషయాలను కూడా వీటి ద్వారా తెలసుకోవచ్చు.

2. ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం

మీ కంప్యూటర్‌పై ఉండే అడోబ్ ఫోటోషాప్, పవర్‌పాయింట్, ఎక్సెల్ వంటి సాఫ్ట్వేర్లను అన్వేషించండి, లేదా Codeacademy వంటి వెబ్సైట్లపై కోడ్లనే నేర్చుకోండి, దీనిలో జావాస్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్ ఇంకా ప్రారంభికులకు ఎంతో స్నేహపూర్వకంగా ఉండే కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ నైపుణ్యాలను నేర్చుకోవడం ఎంతో సరదాగా ఉండటమే కాకుండా, మీ కెరీర్‌తో తరువాత విలువైనవిగా కూడా ఉంటాయి.

3. చదవండి మరియు పరిశోధించండి

మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి మరింత నాలెడ్జ్‌ని పొందాలని మీరు కోరుకుంటున్నారా? మీ వేసవి సెలవులను మరింత ఆహ్లాదకరంగా గడపడం కొరకు వీకిపీడియా, ఖురా, నేషనల్ జియోగ్రాఫిక్ కిడ్స్ మరియు హౌ స్టఫ్ వర్క్స్ వంటి ఫ్లాట్‌ఫారాలను అన్వేషించండి. ఈ వెబ్‌సైట్‌ల్లో సైన్సు, హిస్టరీ, ఆర్ట్స్, కల్చర్ మరియు ఇంకా ఎన్నింటికి సంబంధించిన విస్త్రత సమాచారాన్ని పొందవచ్చు.

4. మీ ‘‘భాష’’పై పని చేయడం

మీరు www.vocabulary.com ద్వారా మీ పదజాలాన్ని విస్తరించుకోండి లేదా మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేందుకు కొత్త భాషను నేర్చుకోండి. కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మేధోపరమైన నైపుణ్యాలు మెరుగవుతాయని, మొత్తం మీద అకడమిక్ పనితీరు మెరుగుపడటంతోపాటుగా మైండ్ చురుగ్గా మారుతుందని అధ్యయనాలు సూచించబడ్డాయి. ఇంటరాక్టివ్ ఫార్మెట్లో నేర్చుకోవడానికి www.duolingo.comని తనిఖీ చేయండి.

5. ఈ లెర్నింగ్ ప్రయత్నించడం

వేసవి సెలవులు రాగానే మీరు బ్రేక్ తీసుకోవాలని భావిస్తారు. మీ కంప్యూటర్‌పై ఈ లెర్నింగ్ కోర్సు చేస్తూ రోజుకు ఒక గంట గడపడం ద్వారా మీరు మీ క్లాసులో మిగిలిన వారికంటే ఎంతో ముందు ఉండవచ్చు. ప్రాథమికాంశాలను బాగా తెలుసుకోవడం వల్ల మీ బిడ్డ క్లాసులో సంక్లిష్టమైన విషయాలను చాలా తేలికగా తెలుసుకునే అవకాశం ఉంది- తేడాను చూడటానికి ప్రయత్నించండి.

సెలవులు అనేవి మీ స్వంత ప్రదేశంలో కొత్త నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయడానికి మరియు కొత్త అకడమిక్ సంవత్సరం ప్రారంభం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి. మీ స్కూలు తిరిగి తెరిచిన తరువాత, వినోదాత్మకంగా ఉండే ఆఫ్టర్ స్కూలు క్లబ్‌ల్లో చేరడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.