పిసి సాయంతో మీ పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించడమెలా?

 

మరో వారంలోనే పరీక్షలు. టైమ్ టేబుల్ కూడా వచ్చేసింది. మీ చిన్నారిని ఒక చోట స్థిరంగా కూర్చోబెట్టి ఎలా చదివించాలా అని ఆందోళన పడుతుంటారు. సాయపడడానికి పిసి అయితే ఉందిగానీ, మీ చిన్నారిని చదివించేలా చేయగలదా?

1. ప్రత్యేకమైన అంశాన్ని చదవించడమెలాగో ఎంచుకోండి.

పిల్లలు తాము చదువుకోవడానికిగాను ఎంపిక అవకాశం ఉన్నదంటే చాలా సంబరపడతారు. ఈ రకమైన ఎంపికవల్ల పిల్లలు తమ సొంత శైలిలో చదువుకోవడానికి మరియు చదువుపట్ల బాధ్యతగా మసలుకోవడానికి వీలవుతుంది. వీడియోలు, ఆటలు, క్విజ్లు, మేధో మధనం- వంటివన్నీ పిసి సాయంతో మీ పిల్లలు సాధించగలరు. [1]

2. తాము ఏ దశలో ఉన్నదీ వాళ్లనే తెలుసుకోనివ్వండి

సక్రమంగా చేయడానికి మించిన ప్రేరణ మరేమీ అక్కరలేదు. తాము ఏ దశలో ఉన్నామనేది మీ పిల్లలు గ్రహించడానికి అధ్యయన పత్రాలను పూర్తి చేయడం, వర్క్ షీట్లను నింపడం, క్విజ్లను స్వీకరించడం మరియు ఆన్లైన్ పరీక్షలు వంటివి సాయపడతాయి. అసలైన పరీక్షకు మీ పిల్లలను ఆత్మ విశ్వాసంగా తీర్చిదిద్దడానికి మరియు తెలివితేటల్లో ఎక్కడైనా వెనకబడి ఉంటే గ్రహించడానికి దోహదపడతుంది. [2]

3. ఒక పిసి విరామం తీసుకోండి!

పోర్షన్ ఎంత విస్తృతంగా ఉన్నా ఇబ్బంది లేదు, కావలసిందల్లా మీ పిల్లల ఏకాగ్రత స్థాయిని మెరుగుపరచడమే. ఇందుకోసం చదువుకి మరియు వినోదానికి నడుమ సమతుల్యత ఉండేలా ఆటాడుకోనివ్వండి. పిల్లలు తాము చదువుకోవలసిన టైమ్ టేబుల్ని మనసులో ఉంచుకుని చాప్టర్ని పూర్తి చేయడం, ట్యూషన్లకు వెళ్లడం మరియు ఆటలు వంటివన్నీ ఒక పద్ధతిగా పాటించేలా చూసుకోండి. [3]

4. కలల డెస్క్

పిల్లల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి కలలకొక వేదిక (డెస్క్)ని సృష్టించండి. వారి అభిమాన ఆటబొమ్మ, సూపర్ హీరో యాక్షన్ బొమ్మలు, పోస్టర్లు, లేదా పిసిపై వారికి నచ్చిన స్క్రీన్ సేవర్ వంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద మార్పుని తీసుకొస్తాయి. ఇవన్నీ స్కూలు మాదిరిగా కాకుండా తమకంటూ ఓ సొంత డెస్క్ అనుకుంటారు. మీ పిల్లల డెస్క్ చిందరవందరగా కాక పిసిని AIO (అన్నిటి సమాహారం)గా మీరుకూడా భావిస్తారు.

ఏదేమైనా, చదువు సాగించాలన్నదే ఏకైక మార్గం. పిల్లలను నిజంగా ప్రేరేపితం చేసేవి ఏమిటన్నదీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. అవి ఏమైనా కావచ్చు- నూరు శాతం మార్కులు, క్లాసులో ప్రథమ శ్రేణి, పెద్దయ్యాక ఏమి సాధించాలనుకుంటున్నారు, పాఠ్యాంశంపై ఏదేమైనా, చదువు సాగించాలన్నదే ఏకైక మార్గం. పిల్లలను నిజంగా ప్రేరేపితం చేసేవి ఏమిటన్నదీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. అవి ఏమైనా కావచ్చు- నూరు శాతం మార్కులు, క్లాసులో ప్రథమ శ్రేణి, పెద్దయ్యాక ఏమి సాధించాలనుకుంటున్నారు, పాఠ్యాంశంపై నిజమైన ప్రేమ, పాఠ్యేతర కార్యకలాపాలు, వంటివి ఏమైనా కావచ్చు.

మీ పిల్లల విజయానికి పిసిని ప్రేరేపిత ఉపకరణం కానివ్వండి.