పరీక్షల సమయంలో మీరు తక్కువ ఒత్తిడిని ఎలా అనుభూతి చెందాలి.

 

మీరు పరీక్షల గురించి ఒత్తిడికి గురైనప్పుడు, మీకు పరీక్షలకు సంబంధించిన ఆందోళన పెరుగుతుంది. ఇది మీ ఫలితాలపై ప్రభావం చూపించడానికి ముందే, పరీక్షల్లో మరింత మెరుగ్గా స్కోర్ చేయడానకి మరియు అభ్యసన ప్రక్రియను మరింత ఆస్వాదించడం కొరకు నో స్ట్రెస్ ఎక్స్ ప్రెస్ ని పొందండి. ఒక కంప్యూటర్ మీకు ఇలా సహాయపడగలదు:

1. ప్రతిదీ టైమింగ్ లో ఉంటుంది

పరీక్షలకు ముందు రోజు సందేహాలు రావడం కంటే అసహ్యకరమైనది మరొకటి ఉండదు, మీ మొదటి పరీక్షకు కనీసం ఒక్కరోజు ముందు చదవడం ప్రారంభించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రశ్నాపత్రాలను పరిష్కరించడంతోసహా, మీరు ఎన్నిఎక్కువ రివిజన్ సెషన్ ల్లో మీరు పాల్గొంటే, అంత ఎక్కువగా పరీక్షల సమయంలో మీకు మరింత ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

2. ప్లానింగ్ యొక్క శక్తి

ప్లానర్ కావడం అనేది ప్రతి ఒక్కరికి సహజంగా రాదు మరియు మొదటగా ఇది చాలా భయం కలిగిస్తుంది. అయితే, గూగుల్ క్యాలెండర్ వంటి టూల్స్ తో, స్పష్టమైన డైరెక్షన్, అలానే ఒక ఛాప్టర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, కఠినమైన సబ్జెక్ట్ లకు ప్రాధాన్యత కల్పిండచం మరియు బ్రేక్ లు తీసుకోవడం వంటివి సాధ్యం అవుతాయి.

3. బ్రేక్ లు తీసుకోవడం ఎంతో మంచిది

ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఉదయం అంత చదవడం గురించి ఆలోచించండి. తదుపరి చదవడానికి మీరు బాగా అలసిపోతారు, బోర్ కొడుతుంది లేదా రెండూ జరుగుతాయి. అటువంటి పరిస్థితిని పరిహరించడం కొరకు, విడతలవారీగా చదవడాన్ని పరిగణించండి, మీరు ఒక గంటపాటు చదవడంపై ఏకాగ్రత నిలపవచ్చు మరియు సుమారు పదిహేను నిమిషాలపాటు గేమ్స్ ఆడవచ్చు.

4. బయటకు మాట్లాడటం

సమస్యను పంచుకోవడం ద్వారా సమస్య సగం పరిష్కారం అవుతుంది. క్లాస్ మేట్ లతో సంభాషించడానికి మరియు సీనియర్ లతో డౌట్ లు క్లియర్ చేసుకోవడానికి మరియు ఒత్తిడిపూర్వక ఆలోచనల నుంచి బయటపడటం కొరకు పిల్లలు సోషల్ మీడియా నెట్ వర్క్ లపై తమ స్వంత గ్రూపు ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వీకీస్పేస్ క్లాస్ రూమ్ (టీచర్లు మరియు విద్యార్థులు తమ స్వంత కంటెంట్ జోడించే సైట్)లో చేరవచ్చు.

5. ఒక స్పష్టమైన మెండ్ ని ఫోకస్డ్ మైండ్ కు సమానం

మనకు ఒత్తిడి ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తాం మరియు మనంతట మనం గందరగోళానికి గురవుతాం. మైండ్ మ్యాపింగ్ ఒకరి ఆలోచనలను క్రమబద్ధంగా ఉంచడానికి దోహదపడుతుంది మరియు వారి ఆలోచనలను వినియోగించుకోవడానికి, అలానే సంక్లిష్టమైన సబ్జెక్ట్ ని చిన్నగా మరియు అర్ధం చేసుకునే విభాగాలుగా విభజించబడటానికి దోహదపడుతుంది.


పరీక్షల కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, కంప్యూటర్ సంవత్సరం అంతటా కూడా సహాయపడుతుంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ దగ్గర నుంచి వ్యాసం రాయడం వరకు, కంప్యూటర్ మీ ప్రపంచానికి గవాక్షం, దీని ద్వారా అభ్యసన మరింత వినోదాత్మకంగా మరియు ఆసక్తికరంగా మలుస్తుంది, మీ ప్రాజెక్ట్ లపై మీరు 10/10 మార్కులు సాధించడానికి ఇది సహాయపడుతుంది.