మీ పిల్లవాడు ఈ-అభ్యాసానికి మారడానికి మీరు ఎలా సహాయపడగలరు

 

బోధనలో ప్రస్తుతం వస్తున్న పరివర్తనతో, తల్లిదండ్రులు ఈ-అభ్యాసాన్ని అంగీకరించాలి. విద్య మరియు ఇంటరాక్టివ్ పిసి అభ్యాసం ద్వారా మీ పిల్లల ఎదుగుదలలో క్రియాశీలకంగా నిమగ్నం కావడానికి ఇదే మీకు సమయము.

 

మీ పిల్లలకు ఆన్ లైన్ తరగతులు సమర్ధవంతంగా ఉండేలా ఎలా చేయాలో మీరు నేర్చుకునే ముందు, ఈ-అభ్యాసం గురించి ఉన్న కొన్ని అపోహలను మేము తొలగించాలనుకుంటున్నాము.

 

-ఇది ఒక సమర్ధవంతమైన బోధనా పద్ధతి కాదు

విద్యార్ధులకు విజ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి సాంకేతికత మాధ్యమంగా పని చేస్తుంది. ఉపాధ్యాయుల నైపుణ్యం మారదు.

 

-ఇది ప్రభావవంతంగా ఉండదు

విద్యార్థులతో మరింత నిమగ్నం కావడానికి ఉపాధ్యాయులకు మరెన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి, ఫలితంగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 

-ఇది ఇంటరాక్టివ్ గా ఉండదు

విశ్లేషణలు, ఆన్ లైన్ క్విజ్ లు, పోల్స్, ఆడియోలు మరియు వీడియోల ద్వారా, వ్యక్తిగతంగా నేర్చుకోవడం అంత ఎక్కువగా కాకపోయినా, ఇవి కూడా ఆకర్షణీయంగా మరియు ఇంటరాక్టివ్ గా ఉంటాయి.

 

అభ్యాస ప్రక్రియలో ఉన్న ఖాళీలను పూరించడానికి మరియు మీ పిల్లల విద్యా విషయంలో క్రియాశీలంగా నిమగ్నం కావడానికి తల్లిదండ్రులుగా మీరు చేయగలిగినది ఇది:

  • కనీస అవరోధాలతో ప్రత్యేక అధ్యయన ప్రాంతాన్ని ఏర్పాటుచేయడంలో మీ పిల్లలకి సహాయపడండి
  • పాఠశాల సమయంలో మీ పిల్లవాడు పాటించిన అదే సమయాలను పాటిస్తున్నాడని నిర్ధారణ చేసుకోండి
  • విరామాల సమయంలో వారితో గడపగలిగేలా మీ షెడ్యూల్ ని కలిగి ఉండండి
  • అసైన్మెంట్లు మరియు హోంవర్కుల ప్రింట్ అవుట్లు తీయడం ద్వారా వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి
  • మీ పిల్లవాడు అసైన్మెంట్లు పూర్తి చేస్తున్నాడని నిర్ధారించడానికి ఇతర తల్లిదండ్రులు మరియు అధ్యాపకులతో సమన్వయం చేసుకోండి

 

విద్య కొరకు డెల్ ద్వారా, ఇంటిలో తగిన ఆన్ లైన్ అభ్యాసం వాతావరణాన్ని కల్పించడంలో సహాయపడటానికి మేము వెబినార్లను ప్రారంభించాము. ఆన్ లైన్ అభ్యాసం, సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంచుకోవడం, అభ్యాస అవకాశాన్ని సృష్టించడం, ఉపాధ్యాయులు మరియు పాఠశాలలతో భాగస్వామ్యము, మరియు ఇంటిలో అభ్యాసాన్ని మెరుగుపరచడంలో మీ పాత్ర గురించి మీరు నేర్చుకోవచ్చు.

 

విద్య యొక్క కొత్త తరంగాలను మనము కలిగి స్వీకరిద్దాము, మరియు అభ్యాసం యొక్క భవిష్యత్తును సంతోషంగా అంగీకరిద్దాము. ఇది ఇక్కడ క్లిక్ చేయడం

అంత సులభము.

(https://www.dellaarambh.com/webinars/)