హైబ్రిడ్ Vs బ్లెండెడ్ లెర్నింగ్

కొన్ని సంవత్సరాల క్రితం, అభ్యాసం తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ 2020 నుండి, మహమ్మారి కారణంగా అభ్యాసం వర్చువల్ తరగతులకు మారింది. లాక్ డౌన్ సడలింపు మరియు క్రియాశీల కేసుల సంఖ్యలో తగ్గుదలతో, హైబ్రిడ్ అభ్యాసం మరియు బ్లెండెడ్ అభ్యాస నమూనాలతో సాధారణ పద్ధతులకు తిరిగి వెళ్లడానికి మనము ప్రయత్నించాము

హైబ్రిడ్ అభ్యాసం మరియు బ్లెండెడ్ అభ్యాసాలను తరచుగా ఒకదానినొకటిగా పొరపాటుపడతాము. రెండిటిలోనూ ఆన్లైన్ మరియు ఇన్-పర్సన్ తరగతులు వంటి ఒకే అంశాలు ఉన్నప్పటికీ, ఇవి ఒకదానికొకటి చాలా భిన్నమైనవి. రెండిటి మధ్య మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో సహాయపడే కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  •  కొంతమంది విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరయ్యి, ఇతరులు చదువు కొరకు పి సిలను ఉపయోగించడం హైబ్రిడ్ అభ్యాసం. ఆన్లైన్ అభ్యాసకులు మరియు తరగతిలోని అభ్యాసకులకు ఒకేసారి బోధించడానికి, ఉపాధ్యాయులు లేదా శిక్షకులు వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు.
  • విద్యార్థులకు బోధించడానికి శిక్షకులు లేదా ఉపాధ్యాయులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ వనరులను ఉపయోగించడం బ్లెండెడ్ అభ్యాసం. కొన్ని కార్యకలాపాలు పి సి అభ్యాసం ద్వారా మరి కొన్ని ఇన్-పర్సన్ తరగతి ద్వారా చేయబడతాయి.
  • హైబ్రిడ్ అభ్యాసంలో, పి సి ఆధారిత అభ్యాసం మరియు ఇన్-పర్సన్ అభ్యాసాల మధ్య ఎంచుకోవడం విద్యార్థుల పై ఆధారపడి ఉంటుంది.
  • మరొక వైపు, బ్లెండెడ్ అభ్యాసంలో ఆన్లైన్ మరియు ఇన్-పర్సన్ కార్యకలాపాలు ఉపాధ్యాయునిచే నిర్ణయించబడతాయి.
  • హైబ్రిడ్ అభ్యాసంలో ఇన్-పర్సన్ మరియు ఆన్లైన్ అభ్యాసకులు  వేరు వేరు వ్యక్తులు
  • బ్లెండెడ్ అభ్యాసంలో ఇన్-పర్సన్ మరియు ఆన్లైన్ తరగతులు రెండిటికి అదే విద్యార్థులు హాజరవుతారు.

రెండు రకాల అభ్యాస నమూనాలు పి సి ఆధారిత అభ్యాసం మరియు ఇన్-పర్సన్ అభ్యాసాలను ఉపయోగించినప్పటికీ, రెండూ భిన్నమైన అభ్యాస నమూనాలు. ఇప్పుడు ఉన్నటువంటి సమయాలలో, రెండు అభ్యాస నమూనాలు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులిద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.