పిల్లలకు సహాయపడే సాంకేతికతల గురించి తల్లిదండ్రులు విధిగా తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను.

 

 

ఏక్తా షా, ఇద్దరు పిల్లల తల్లి, Life of a Mother. ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

1) చదువు కొరకు కంప్యూటర్ - భారతీయ విద్యార్ధులు దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని పొందగలరు?

చదువు కొరకు కంప్యూటర్ ఒక లైఫ్లైన్గా మారింది. ఇటీవల కాలంలో జ్ఞానాన్ని అందించడంలో సాంకేతికత యొక్క పాత్రకు సంబంధించిన గణనీయమైన మార్పులను నేను గమనించాను. విద్యపై ప్రభావం చూపించే టీచర్ల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం, ఆన్లైన్ టీచింగ్ ఇప్పుడు ఒక సరికొత్త స్థాయికి చేరుకుంది. ఆడియో-విజువల్ ద్వారా కాన్సెప్ట్లను నేర్చుకోవడం అనేది, తేలికగా గుర్తు పెట్టుకోవడంతోపాటుగా మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది.

ఎడ్యుకేషనల్ వీడియోలతో నా పిల్లలకు బోధించినప్పుడు నేను ఈ మార్పును చూశాను. బోధించేందుకు ఇది సులభమైన మరియు సరదా మార్గంగా మారింది.

2)మిమ్మల్ని మీరు ఒక డిజిటల్ పేరెంటింగ్ ప్రోగా భావిస్తారా?

అవును, నేను ఒకటి డిజిటల్ పేరెంటింగ్ ప్రోని, దీని నుంచి నేను తప్పించుకోలేను. పిల్లలకు సహాయపడే సాంకేతికతల గురించి తల్లిదండ్రులు విధిగా తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎలాంటి సందేహం లేదు, సాంకేతిక మన జీవితాలను ఎంతో సులభతరం చేసింది అయితే దీని యొక్క మరో వైపును పూర్తిగా విస్మరించలేం. నాకు వాస్తవాలు తెలిసినప్పుడు మాత్రమే నా పిల్లలను హెచ్చరించగలను. ఇంటర్నెట్ని తెలివిగా ఎలా ఉపయగోంచాలని మీకు తెలియనంత వరకు ఇంటర్నెట్ సురక్షితమైనది కాదు. తమ పిల్లలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి ముందు తల్లిదండ్రులు తమ పిల్లలకు విధిగా గైడ్ చేయాలి.

3) మీ చిన్నారులకు అభ్యసన వినోదాత్మకంగా ఉండటం కొరకు మీరు ఏమి చేస్తారు?

నిజాయితీగా చెప్పాలంటే, కొన్నిసార్లు వారికి నాకంటే ఎక్కువగా తెలుసు, అయితే వారికి నేను ఖచ్చితంగా క్లుప్తంగా సమాధానం చెప్పను. చాలావరకు, నేను నా అనుభవాన్ని ఒక కథవలే జోడించి, వారికి మరింత ఆసక్తికరంగా చెబుతాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేర్చుకోవడం లేదా వారు చూడాలని కోరుకునే దాని కొరకు కొరకు చిన్న స్క్రీన్ ఉపయోగించడాన్ని నేను పరిహరిస్తాను. నేను డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ని సరైన దూరంలో ఉంచి, సరైన భాగంలో చూసేలా చేస్తాను.

4) "లైఫ్ ఆఫ్ ఎ మదర్" బ్లాగ్ వివిధ రకాలైన అంశాలను సృజిస్తుంది- ప్రతి తల్లిదండ్రులు విధిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి?

ఫర్ఫెక్ట్ అనే పదం చాలా ప్రమాదకరమైనది మరియు జీవితంలో అవసరం లేని ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి పిల్లవాడు సామర్ధ్యంపరంగా విభిన్నంగా ఉంటాడు, పరిపూర్ణత మరియు లోపాల మిశ్రమంగా ఉంటాడు. వారిని మనం పోల్చరాదు. ఆమోదించడం అనేది కీలకం, మీ స్వంత ఆకాక్షలకు అనుగుణంగా వారిని మలచవద్దు. పిల్లలు ఎలాంటి భయం లేకుండా ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకునేందుకు సౌకర్యవంతంగా ఉండాలి. తప్పులు చేయడం అనేది జీవితంలో భాగం అని మరియు సానుకూల కోణంలో ముందుకు సాగడం ముఖ్యం అని వారు తెలుసుకోవాలి.