కార్యక్రమం యొక్క ప్రభావం

భారతదేశంలో పిసి వ్యాప్తి సమస్యను అధిగమించడానికి మరియు పరిష్కరించడానికి మేము డెల్ ఆరంభ్ ను ప్రారంభించాము. ఆరంభ్, సాంకేతికను ఉపయోగించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పిల్లలకు అభ్యాసాన్ని మరియు సామర్ద్యాన్ని పెంచడానికి రూపొందించబడిన విద్యకు పిసి అనే పాన్ ఇండియా కార్యక్రమము. భారతదేశం అంతటా పిసిలకు సంబంధించిన అవగాహన, వినియోగం మరియు కంప్యూటర్ విద్యలో విప్లవాత్మక మార్పులను తేవడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.         

 

 

ప్రభావాన్ని కొలవడం

కాంతర్ నివేదిక ద్వారా, ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులలో అధిక ఔచిత్యం మరియు పిసి పట్ల కోరికను పెంచుతుందా లేదా అని మేము తెలుసుకున్నాము. మేము శిక్షణకు హాజరైన ఒక టెస్ట్ గ్రూప్ తో  మరియు హాజరుకాని కంట్రోల్ గ్రూప్ తో నిర్మాణాత్మక ఇంటర్వ్యూలను నిర్వహించాము.

100% ఉపాధ్యాయులు స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్నారు, మరియు 66% పాఠశాలలు స్మార్ట్ క్లాస్ సౌకర్యం మరియు సగటున 15 పిసిలను కలిగి ఉండడంతో మేము అనువర్తన వారీగా వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.     

 

 

శిక్షణ

10 మంది ఉపాధ్యాయులలో 8 మంది విషయం సరళంగా, నిర్మాణాత్మకంగా, సమర్థవంతంగా మరియు స్పష్టంగా ఉన్నట్లు కనుగొన్నారు. 10 మందిలో 8 మంది ఉపాధ్యాయులు ఆన్ లైన్ శిక్షణతో సౌకర్యంగా ఉండడంతో శిక్షణ యొక్క తరచుదనము ప్రతి 3 నెలల వరకూ వెళ్లాలని వారు కోరుకున్నారు.

 

 

దృక్కోణంలో మార్పు 

పిసిల పట్ల వైఖరి గణనీయంగా మెరుగుపడింది, ఉపాధ్యాయులు ఇప్పుడు కంప్యూటర్లు మరియు స్మార్ట్ బోర్డులను స్వీయ-అభ్యాసం మరియు తరగతి పాఠాలను సిద్ధం చెయ్యడం కోసం ఉపయోగిస్తున్నారు.

శిక్షణ పొందిన ఉపాధ్యాయులలో 92% మంది, పిసిలు విద్యలో సానుకూల పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులలో 68% కంప్యూటర్లను ఉపయోగించే నైపుణ్యం కలిగి ఉన్నారు. నియంత్రణ సమూహంలో 83% మంది పిసిలు సంబంధితంగా ఉన్నట్లు కనుగొన్నారు.           

 

 

శిక్షణ యొక్క ప్రభావం

ఉపాధ్యాయులు ఇప్పుడు అధ్యయన సామగ్రిని రూపొందించడానికి, ఉదాహరణలు మరియు ఎవి ల ద్వారా భావనలను సమర్థవంతంగా అందించడానికి మరియు రిమోట్ సహకారం కోసం విద్యార్థులతో సంభాషించడానికి  పిసిలను స్వతంత్రంగా ఉపయోగించుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నారు, ఇది చిన్న నగరాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులలో పెరిగింది.

విషయ పాఠ్య ప్రణాళికలను రూపొందించడం, అసైన్మెంట్లను ఇవ్వడం, విద్యార్థులతో సంభాషించడం మరియు స్మార్ట్ బోర్డులను ఉపయోగించడం వంటి వైవిధ్య విషయాలకు పిసి ఉపయోగించబడుతున్నది. ప్రారంభంలో ప్రతికూల వైఖరి ఉన్న ఉపాధ్యాయులు కూడా కంప్యూటర్  ఉపయోగించడంలో మరింత నైపుణ్యం పొందారు.

 

 

పిసి ప్రాధాన్యత గల భవిష్యత్తు

ఉపాధ్యాయులు స్మార్ట్ క్లాసుల సమయంలో తమకు 100% హాజరు ఉందని నమ్మడంతో, వారు పిసిని స్వతంత్రంగా ఉపయోగించడం ప్రారంభించారు (37%).

విద్యా పరిశ్రమలో సమగ్ర మార్పుతో, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రధానోపాధ్యాయుల నుండి విస్తృత ఆమోదంతో, రాబోయే రోజుల్లో గొప్ప మార్పు కోసం మేము ఆసక్తిగా చూస్తున్నాము .