ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా పిల్లలు మరింత నేర్చుకుంటారు.

చదువు నిరంతరం మారుతోంది. పిల్లలకు అభ్యసన మరింత వినోదాత్మకంగా ఉండేందుకు, వారి నిమగ్నతను పెంచేందుకు మరియు అభ్యసనను మరింత ఆసక్తికరంగా రూపొందించడం కొరకు విద్యావేత్తలు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. తరగతి గదిలోనూ అదేవిధంగా తరగతి గది వెలుపల కూడా అత్యంత ప్రభావం చూపించే అభ్యసన విధానాల్లో ఒకటి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ లేదా పారస్పరిక అభ్యసనం. 

ఇంటరాక్టివ్ లెర్నింగ్, విద్యకు సంబంధించి వాస్తవిక దృక్పథాన్ని కలిగిస్తుంది. ఇది సమగ్రత మరియు అర్థం చేసుకోవడం యొక్క ప్రక్రియ, అలానే విద్యార్థి కేవలం కంటెంట్‌పై ఆధారపడకుండా దానిలోనికి నిమగ్నం కావడానికి అవసరమైన అనువర్తత మరియు తెలివితేటల్ని అందిస్తుంది. విద్యార్థులకు అసాధారణమైన అభ్యసన అనుభవాన్ని అందించడం కొరకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోర్సు మెటీరియల్‌లో టెక్నాలజీని సమ్మిళితం చేస్తుంది.

పిల్లలు మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి ఈ విధంగా సహాయపడుతుంది 

1. క్లిష్టమైన ఆలోచన మరియు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

చాలా క్రియాత్మకమైన వాతావరణంలో పెరిగిన విద్యార్థులను నిమగ్నం చేయడానికి అదనంగా, ఇంటరాక్టివ్ లెర్నింగ్ పిల్లల్లోని క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి, ఇది ఎనలిటిక్ విశ్లేషణ యొక్క అభివృద్ధికి ప్రధానాంశాలుగా నిలుస్తాయి. [1]

చాలామంది విద్యార్థులకు గణితం అంటే ఆసక్తి ఉండదు. ఇంటరాక్టివ్ గేమ్స్ సాయంతో అటువంటి సమస్యను పరిష్కరించవచ్చు, ఇవి వారిలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.

2. వర్చువల్ రోల్‌ప్లేలు నిజజీవిత సమస్యలను ఎదుర్కొనడానికి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి.

విద్యార్థులను రోల్‌ప్లేలు మరియు ఇంటరాక్టివ్ గేమ్స్‌లో నిమగ్నం చేయడం ద్వారా, వారిలో సహసంబంధాలు, నాయకత్వం, బృందంగా ఆడటం మరియు సహకార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి మరియు వాస్తవిక ప్రపంచ సమస్యలను వారికి అవగతం అయ్యేలా చేస్తాయి. ‘స్టార్ట్ క్రాఫ్ట్’ వంటి కొన్ని ఆన్‌లైన్ వ్యూహాత్మక గేమ్‌లు వ్యూహాత్మక గేమ్‌ ప్లాన్‌లను రూపొందించి అమలు చేయడాన్ని యూజర్‌లకు బోధిస్తాయి కనుక ఇవి నిజజీవిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాల్ని మెరుగుపరుస్తాయి. 

హార్వార్డ్ స్కూలు ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ఫిజిక్స్ మరియు అప్లైడ్ ఫిజిక్స్ యొక్క ప్రొఫెసర్ అయిన ఎరిక్ మజూర్ అభిప్రాయం ప్రకారం, ఇంటరాక్టివ్ లెర్నింగ్, పిల్లలు గ్రూపుల్లో ఉన్నప్పుడు ఎలా సహాయసహకారాలు అందించుకోవాలి మరియు విజయవంతంగా పనిచేయాలనే దానిని బోధిస్తుంది. పనిప్రాంతాల్లో టీమ్ ఆధారిత నిర్మాణం ఎక్కువైన తరుణంలో ఈ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది. 

3. ఇది వారి చేతిలో ఉన్న పని పట్ల ఏకాగ్రతను మరియు అంకితభావాన్ని పెంపొందిస్తుంది.
ఇంటరాక్టివ్ లెర్నింగ్, అన్ని అభ్యసన రూపాల్లోకెల్లా విద్యార్థులను సమర్థవంతంగా నిమగ్నం చేసే రూపం. ఎందుకంటే పిల్లలు పాఠంలోనికి మునిగిపోతారు, ఇది వారి ఏకాగ్రతను పెంపొందించడంతోపాటుగా చేతిలో ఉన్న పని పట్ల అంకితం అవుతారు. ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని ఫ్లాష్ గేమ్‌లు పిల్లల యొక్క ఏకాగ్రతను పెంపొందిస్తాయి. చాలామందిలో ఎడిహెచ్‌డి పరిష్కారంగా కూడా పేర్కొంటారు.

4. విద్యార్థులు సృజనాత్మకమైన మరియు కొత్త పరిష్కారాల కొరకు వెతికేలా చేస్తుంది 

ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ‘‘ రెండు రెళ్లు నాలుగు’’ అనే బోధించే సాధారణ అభ్యసన శైలి కాదు. ఇది పాఠ్యపుస్తకాల పరిధిని దాటి, సంప్రదాయ బట్టీ విధానానికి చెల్లుచీటి చెబుతుంది. ఇది పిల్లలకు అవసరమైన సంబంధిత ఉపకరణాలను అందించడమే కాకుండా సృజనాత్మక పరిష్కారాలను సృష్టించే స్వేచ్ఛను అందిస్తుంది. సమస్యలు మరియు అభ్యసన మెటీరియల్‌లోనికి విద్యార్థులు మారే అవకాశాలను కల్పించడం ద్వారా, తెలివిగా మరియు సమర్థవంతంగా ఎలా ఆలోచించవచ్చో విద్యార్థులకు బోధిస్తుంది. [2] 

ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు నేర్చుకునేటప్పుడు, వారు కాన్సెప్ట్‌లను మరింత మెరుగ్గా నేర్చుకుంటారు మరియు వారి తమ రోజువారీ జీవితంలో మరింత మెరుగ్గా అనువర్తించగలుగుతారు. విద్యార్థి కంటెంట్‌ని వినియోగించడం నుంచి సృష్టించే దశకు ఎదుగుతాడు, ఇది ఇంటరాక్టివ్ లెర్నింగ్ యొక్క మరో ముఖ్యమైన కోణంగా చెప్పవచ్చు, నేటి సాంకేతిక యుగంలో కీలకమైన తేడా చూపించే కీలకమైన లక్షణం ఇది.

విద్యార్థులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్‌కు పరిచయం చేయడానికి పిసి అనేది ఒక గొప్ప ఉపకరణం, ఇది ఎంతో కీలకమైన ప్రాథమిక భావనలను విద్యార్థులకు విడమరిచి అందిస్తుంది.  తమ పిల్లల యొక్క అభ్యసన మరియు అభివృద్ధిలో పిసి యొక్క పాత్రను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం ప్రారంభించారు మరియు తమ ఇండ్లలోనికి వాటికి స్వాగతం పలుకుతున్నారు. విద్య కోసం ఉపకరణాలను ఉపయోగించినప్పుడు, పిల్లలు అభ్యసనను ఆస్వాదించడానికి, వారిని మరింత స్మార్ట్‌గా, క్రియేటివ్‌గా మరియు చురుగ్గా రూపొందించడానికి పిసి సహాయపడుతుంది. 

శుభమ్ నాసిక్‌కు చెందిన ఒక ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థి, తన కంప్యూటర్ కారణంగా అతడు తన విద్యాపరమైన భావనలను ఎంతో స్పష్టంగా నేర్చుకుంటున్నాడు. పిసి అభ్యసనను మరింత వినోదాత్మకంగా మారుస్తుంది, దీనికి శుభమ్ ఒక రుజువు.

తమ భావనలను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి పిల్లల కొరకు అనేక ఇంటరాక్టివ్ లెర్నింగ్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అటువంటి ఒక ఉదాహరణ http://interactivesites.weebly.com/ ఇది కొత్త భావనలను నేర్చుకోవడమే కాకుండా పాతవాటిని పునశ్చరణ చేసుకోవడానికి దోహదపడుతుంది.