ప్రతిరోజూ తరగతి గదిలో సృజనాత్మకతను చొప్పించగల మార్గాలు ఇవిగో.

 

ఎక్కువ సమయంపాటు విద్యార్ధి తరగతి గదిపై దృష్టి నిలిపేలా చేయడం అనేది టీచర్లు ఎదుర్కొనే అత్యంత పెద్ద సవాలు.
అలానే తరగతి గది విడిచిపెట్టిన తరువాత కూడా విద్యార్ధులకు బాగా గుర్తుండిపోయేలా కాన్సెప్ట్‌ను వివరించడంకూడా క్లిష్టమైన పనే. క్లాస్‌రూమ్‌లు ఉత్సాహాన్ని మరియు ఊహాశక్తిని రగిలించే ప్రదేశంగా మార్చడం ద్వారా ఈ అడ్డంకిని అధిగమించడానికి కంప్యూటర్లు సహాయపడగలవు.

ఇదిగో ఈ విధంగా ప్రతిరోజూ మీరు మీ క్లాస్ రూమ్‌కు ‘సృజనాత్మకత’ను తీసుకొని రావొచ్చు:

1. వర్చువల్ రియాలిటీ

వర్చువల్ రియాల్టీ విద్యార్థుల ఒక సరికొత్త ఇంటరాక్టివ్ ప్రపంచాన్ని అందిస్తుంది. ఇది ఒకప్పుడు కలగా ఉన్నప్పటికీ, Google Cardboard, Poly మరియు Blocks వంటి తేలికగా యాక్సెస్ చేసుకునే టూల్స్‌తో ఇది మరింత తేలికగా సాకారం అవుతోంది, ఇవి ఇంటరాక్టివ్ అభ్యసనకు కొత్త అర్ధాన్ని ఇస్తాయి. మీ పాఠాల్లో వర్చువల్ ఫీల్డ్ ట్రిప్పులు అమలు చేయడం అనేది క్లాస్‌రూమ్‌లో విఆర్ అనువర్తనానికి ఒక చక్కటి ఉదాహరణ. కేవలం కొన్ని క్లిక్‌లతోనే మీ విద్యార్ధులు తరగతి గదిలోనే ఆర్కిటిక్ ప్రాంతం లేదా ఏడారులు ఇలా ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని ఎంత సౌకర్యవంతంగా తరగతి గదిలోనే చూడగలుగుతారు.

2. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ

వర్చువల్ రియాల్టీకి దగ్గరగా ఉండే ఆగ్యుమెంటెడ్ రియాల్టీ వాస్తవ ప్రపంచం యొక్క విద్యార్ధి వీక్షణను పెంపొందిస్తుంది. మీ తరగతి గది కొరకు మీరు ఆప్టిమైజ్ చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి, అందులో ఒకటి స్కావెంజర్ హంట్. QR కోడ్లను మీ స్కూలు చుట్టుపక్కల ఉంచండి మరియు విద్యార్ధులు వాటిని కనుగొనడానికి టెక్ట్స్ లేదా ఇమేజ్‌ల రూపంలో క్లూలు ఇవ్వండి. ఈ అద్భుతమైన టెక్నాలజీ విద్యార్ధులను బందీ చేస్తుంది, అభ్యసన గురించి మరింత ఉత్సాహం చూపేందుకు మరియు ఎలాంటి సరిహద్దులు లేని ఒక తరగతి గదిని రూపొందించేందుకు దోహదపడుతుంది.

3. కోడింగ్

అన్ని సాంకేతిక విషయాలకు ప్రజాదరణ పెరుగుతుండటంతో, కంప్యూటర్ సైన్స్ యొక్క నాలెడ్జ్ ఒక అత్యావశ్యక విషయంగా మారింది. కోడింగ్ అనేది అనేక టెక్నాలజీలకు బిల్డింగ్ బ్లాక్ వంటిది. కోడింగ్ ఎలా చేయాలని విద్యార్ధులకు బోధించడం ద్వారా, వారు అనంత అవకాశాలకు ద్వారాలు తెరవగలుగుతారు. www.code.org లేదా www.codecademy.com వంటి వెబ్సైట్లపై ఏడాది పొడవునా వనరులు లభిసత్యి మరియు మీ విద్యార్థులకు గొప్ప ఫౌండేషన్‌ని ఏర్పరుస్తాయి. JavaScript మరియు C++ అని ప్రారంభీకులకు స్నేహపూర్వకంగా ఉండేు లాంగ్వేజ్‌లు, విద్యార్ధులు వీటిని తేలికగా ప్రారంభించవచ్చు.

కొత్త తరంగా సాంకేతికతను అన్వేషించడం ద్వారా అది సంచలనాత్మక ఆలోచనల కోసం దారితీస్తుంది. కంప్యూటర్ ఆధారిత టూల్స్ లేదా టెక్నిక్లను స్వీకరించడం ద్వారా, తరగతిలో ఒక సృజనాత్మకతను తీసుకొచ్చే దిశగా ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు పడుతుంది. అన్నింటిని మించి, డిజిటల్ అభ్యసనకు సంబంధించిన సంస్కృతి రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది మరియు మీ విద్యార్ధులను అనేక విధాలుగా స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.