భారతదేశంలో అత్యుత్తమ ఈ-టీచర్ గురించి మరింత తెలుసుకోండి

 

 

మిస్, రష్మీ కఠారియా, 2007లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ద్వారా నేషనల్ బెస్ట్ ఈ టీచర్ అవార్డును అందుకున్నారు , ఒక సాధారణ టీచర్ నుంచి దేశంలోనే అత్యుత్తమ ఈ టీచర్‌గా ఎలా మారుతాయనే విషయానికి సంబంధించిన తన అనుభవాన్ని పంచుకున్నారు.

2000 సంవత్సరంలో, ఆమె తన స్కూలులో ఒక గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు, కాంక్రీట్ ఆబ్జెక్ట్‌లను ఉపయోగించి గణిత భావనలతో దృశ్యీకరించడానికి మరియు ప్రయోగాలు చేయడానికి విద్యార్థులకు దోహదపడింది. ల్యాబ్‌కు అనుబంధంగా టీచర్లు మరియు ఇతర టీచర్ల కొరకు ఒక బ్లాగ్‌కు ఏర్పాటు చేసి, దానిలో 500లకు పైగా వనరులు, ప్రాజెక్ట్ ఐడియాలు మరియు ఇంకా ఎన్నింటినో పొందుపరిచారు. విద్యార్థికి ఎంతో స్నేహపూరితంగా ఉండేవిధంగా ఇంటర్నెట్‌లో లభ్యం అయ్యే ఆమె కంటెంట్‌కుగాను, ఆమె 2010లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి నేషనల్ ఐసిటి అవార్డును గెలుచుకున్నారు.

మిస్. కటారియాతో జరిపిన సంభాషణను దిగువన చదవండి!

 

క్లాస్‌రూమ్‌లో మీరు ఎంతకాలం నుంచి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు?

నేను గడిచిన 12 సంవత్సరాల నుంచి టీచింగ్‌లో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాను. నేను మొదట బ్లాగ్‌లతో ప్రారంభించాను, మరియు నా బ్లాగ్ యొక్క లింక్‌ని నా విద్యార్థులతో పంచుకుంటూ ఉండేదానిని. టాపిక్‌లు సంబంధించిన నా రీసెర్చ్ మొత్తం కూడా ఆన్‌లైన్‌లో ఉంచబడేది, తద్వారా పిల్లలు ఆ టాపిక్‌లకు సంబంధించిన సమాచారాన్ని తేలికగా పొందేవారు. నేను వీకీ క్లాస్ రూమ్ కూడా ప్రారంభించాను మరియు విద్యార్థులు మరియు ఇతర ఫ్యాకల్టీ నుంచి నాకు చక్కటి ఫీడ్‌బ్యాక్ లభించింది.

 

మీరు ఉపయోగకరం అని భావించిన కొన్ని టెక్ టూల్స్‌కు మీరు ఉదాహరణలు ఇవ్వగలరా?

గణితం బోధించడం కొరకు నేను టెక్ టూల్స్ ఉపయోగించడం ప్రారంభించాను. జామెంట్రీ మరియు ఆల్జీబ్రా బోధించడం కొరకు నేను జియోజీబ్రాను ఉపయోగించాను, క్లాసుల్లో కవర్ చేయాల్సిన అన్ని అంశాలు కూడా టూల్‌లో ఉన్నాయి. లెక్చర్‌ల్లో గ్రాఫ్‌లు గీయడానికి చాలా సమయం పడుతుంది కనుక, నేను గ్రాఫ్‌లు గీయడానికి ఇతర టూల్స్ కూడా ఉపయోగించాను.

కొంత కాలం గడిచిన తరువాత, పిల్లలు చదువుకునేందుకు సహాయకారిగా ఉండే వనరులు అందించినట్లయితే గొప్పగా ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను, అందువల్ల నేను వనరులను సృష్టించడం ప్రారంభించాను.  Rashmikathuria.webs.com మీరు చెక్ చేయవచ్చు. నేను సృష్టించిన టీచింగ్ వనరులు అన్నింటినీ మీరు ఇక్కడ చూడవచ్చు.

 

ఏ అంశంలో మీకు టెక్నాలజీ గొప్పగా మీకు సహాయపడింది?

టెస్ట్‌ల యొక్క మదింపుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది మరియు క్లాసులో టీచ్ చేయాల్సిన టాపిక్‌లకు సంబంధించి రీసెర్చ్ చేయడానికి అతి తక్కువ సమయం ఉండేది. అందువల్ల MCQ టెస్ట్‌లను డిజైన్ చేయడం కొరకు నేను గూగుల్ ఫారాలను ఉపయోగించడం ప్రారంభించాను, మరియు అవి MCQలు కావడం వల్ల, విద్యార్థులు సబ్మిట్ చేసిన వెంటనే గూగుల్ ఫారాలు ఆటోమేటిక్‌గా వాటిని మదింపు చేసేవి. నా విద్యార్థులు ఏవిధంగా పురోగతి సాధిస్తున్నారనే దానిపై తక్షణం ఫీడ్‌బ్యాక్ పొందడానికి ఇది సహాయపడింది, ఇది నా యొక్క చాలా సమయాన్ని ఆదా చేసింది, దీని వల్ల నాకు టీచింగ్‌పై మరింత దృష్టి సారించడానికి దోహదపడింది.

 

క్లాస్‌రూమ్ ఎడ్యుకేషన్‌లో మీ లేటెస్ట్ టెక్ ప్రయోగం ఏమిటి?

నా పాఠాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి మరియు నా విద్యార్థులో కనెక్ట్ కావడానికి టెక్నాలజీ నాకు సహాయపడింది. విభిన్న క్లాసుల కొరకు నేను వాట్స్‌అప్ గ్రూపులను ప్రారంభించాను, అందువల్ల క్లాసులో జరుగుతున్న వాటి గురించి అప్‌డేట్ చేయడానికి అదేవిధంగా సామాజిక ఫ్లాట్‌ఫారంపై వారితో అనుసంధానం కావడానికి దోహదపడింది. ప్రతి క్లాసు కూడా తమ క్వైరీలను పోస్ట్ చేయడం కొరకు ఒక ప్రత్యేక గూగుల్ డాక్యుమెంట్ ఉంది, ఇది నా సందేహాలను రియల్ టైమ్‌లో క్లియర్ చేయడానికి మరియు తరువాత క్లాస్ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకపోయింది.

 

కొత్తతరం టీచర్ల కొరకు ఏవైనా చిట్కాలు/సూచనలున్నాయా?

క్లాసురూమ్‌లో టెక్నాలజీని అమలు చేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజకరంగా ఉంటుంది మరియు మనందరం ఉపయోగించుకోగల పెద్ద వర్చువల్ క్లాస్‌రూమ్ రూపొందించడానికి తక్కువ సమయం పడుతుంది.