ఆర్ట్ అంటే ఇష్టమా? ఈ అద్భుతమైన పిసి వనరులను చెక్ చేయండి!

 

“ప్రతి చిన్నారి కూడా ఒక కళాకారుడే. వారు పెద్దవారైన తరువాత కూడా ఒక కళాకారుడిగా ఎలా ఉండాలనేదే సమస్య.’’

- ప్లాబో పికాసో 

 

ఆర్ట్ ప్రాజెక్ట్ లు మీ సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తిని రూపొందించే ఒక అద్భుతమైన మార్గం. అత్యుత్తమ డిజిటల్ ఆర్ట్ టూల్ ఎంచుకోవడంలో మీకు సాయపడటానికి,కంప్యూటర్ పై మీరు గమనించగల అద్భుతమైన డ్రాయింగ్ కార్యక్రమాల జాబితా ఇదిగో.

సరంజామా అంతా సిద్ధం చేసుకొని మీ అత్యుత్తమ డిజిట్ ఆర్ట్ వర్క్ కు సిద్ధం అవ్వండి.

 

ఆటో డెస్క్ స్కెచ్ బుక్

చాలాకాలం నుంచి ఆటో డెస్క్ స్కెచ్ బుక్ కంప్యూటర్ పై అత్యుత్తమ డ్రాయింగ్ ప్రోగ్రామ్ ల్లో ఒకటిగా ఉంది. మీ కళారూపాన్ని వాస్తవంగా సృష్టించేటప్పుడు సలహా ఇచ్చే యూజర్ ఇంటర్ ఫేస్ స్కెచర్ బుక్ అత్యుత్తమ ఫీచర్లుల్లో ఒకటి.

 

క్రిటా

ఆర్ట్ అంటే ఇష్టమా? ఒక డిజైనర్ కు అవసరమైన అన్ని ప్రొఫెషనల్ టూల్స్ కలిగిన అత్యుత్తమ డ్రాయింగ్ ప్రోగ్రామ్ ల్లో ఒకటైన క్రిటా సాయంతో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

 

ఇంక్ స్కేప్

ఇంక్ స్కేప్ క్రియేటర్ ల కొరకు అత్యంత శక్తివంతమైన డ్రాయింగ్ ప్రోగ్రామ్. ఒకవేళ మీరు ఒక ఊహాత్మక కళాఖండాన్ని సృష్టించాలని భావించినట్లయితే, అప్పుడు లింక్ స్కేప్ మీకు అవసరమైన మరియు ఉపయోగకరమైన ఉపకరణం. ఈ టూల్ ఆబ్జెక్ట్ సృష్టించడం, ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్, కలర్ సెలక్టార్, నోడ్ ఎడిటింగ్ మరియు ఇంకా ఎన్నో ఫీచర్లను అందిస్తుంది.

 

పెయింట్ 3డి

మీరు ప్రారంభ దశలో ఉండి డిజిటల్ డ్రాయింగ్ ని ఎంచుకోవాలని భావించినట్లయితే, అప్పుడు విండోస్ పరికరాలపై ముందస్తుగా ఇన్ స్టాల్ చేయబడి ఉండే మైక్రోసాఫ్ట్ పెయింట్ 3డి అద్భుతమైన ఆప్షన్. ఇది విభిన్న రకాలైన బ్రష్ లు మరియు టూల్స్ ని అందిస్తుంది, మీలోని సృజనాత్మకత అన్వేషించడానికి మరియు దానిని బయటకు తీయడానికి మీకు సాయపడుతుంది. 

 

ఫైర్ ఆల్పాకా

ఈ టూల్ లైట్ టూల్ మరియు బేసిక్ ఫీచర్ల యొక్క ఖచ్చితమైన కాంబినేషన్. ఇది 10 భాషల్లో లభ్యమవుతుంది, ఇంకా విండోస్ కు అనుకూలమైనది. ఇది ఎంతో సరళమైన టూల్, దీనితో మీరు ఇలస్ట్రేషన్ ని చాలా తేలికగా గీయవచ్చు, ఆర్ట్ కు సంబంధించిన మీ ప్రారంభ స్థాయి అవగాహనను పెంపొందిస్తుంది.

 

సృజనాత్మక మరియు ఉత్పాదక కళారూపాన్ని సృష్టించడమే కాకుండా, ఒక ఉత్పాదకత విద్యార్ధికి మొత్తం మీద ఇది ఎంతో అత్యావశ్యకమైనది. మీ స్కూలు చదువులు, అసైన్ మెంట్ లు, ఎక్స్ ట్రా కరిక్యులం యాక్టివిటీస్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా, మీ వద్ద సరైన టూల్స్ ఉన్నట్లయితే, ఇది ప్రొడక్టివ్ గా ఉండటం సరళతరమైనది.