8 టీచర్లు తప్పక చూడాల్సిన TED Talks

 

క్షణం తీరిక లేకుండా గడిపే టీచర్ తమ తరగతి గదిని స్ఫూర్తిదాయకంగా మలచేందుకు ఒక 15 నిమిషాలు కేటాయించండి. మరియు ఆ విధంగా మలచేందుకు చేయాల్సిందల్లా ప్రపంచ ప్రముఖ వక్త ద్వారా TED Talk వినడమే!

1. టీచర్లకు నిజమైన అభిప్రాయం అవసరం

ఈ పది నిమిషాల సంభాషణలో అనేక విజయ గాథలను ప్రస్తావించడంద్వారా నూతన మరియు అనుభవ టీచర్లు ఇరువురికీ అభిప్రాయ సేకరణ యొక్క ప్రాధాన్యతను బిల్ గేట్స్ తెలియజెబుతారు. [1]

2. సైన్స్ టీచర్లూ సరదాగా చేయండి

విద్యార్థులు సైన్స్ పీరియడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా సైన్స్ టీచర్ మరియు యూ ట్యూబర్ టైలర్ డివిట్ ఏ విధంగా సులభశైలిలో కాన్సెప్ట్లను, కథలను చెప్పవచ్చునో వివరిస్తారు. [2]

3. అద్భుతాన్ని సృష్టించడమెలాగో టీచర్లకు నేర్పుట

టీచర్లకు కొద్దిగా కొత్తగానే ఉండొచ్చుగానీ, విద్యావేత్త క్రిస్టోఫర్ ఎండిన్ చాలా విలువైన విషయాన్ని చెప్పారు. టీచర్లు తరగతి గదిని ఉల్లాసభరితంగా ఉంచాలంటే సమాజంలోని అన్ని తరహాల ప్రజలను చూసి నేర్చుకోవాలి అన్నారు క్రిస్టోఫర్ ఎండిన్. [3]

4. ప్రతి ఒక్క పిల్లవాడికి ఛాంపియన్ అవసరం

తరగతి గదిలో ఉత్సాహం మరియు అభ్యాసం కొరకు విద్యార్థుల ప్రేరణ స్థాయిని వ్యక్తిగత సంబంధాలు ఏ విధంగా భిన్నమైన ప్రపంచానికి ద్వారాలు తెరుస్తారనే విషయాన్ని 40 సంవత్సరాలుగా టీచర్ గా పనిచేసిన రీటా పియర్సన్ మాట్లాడారు. [4]

5. విద్యాభ్యాసంలో నూతనత్వంకోసం వీడియో వినియోగం

విద్యా వాణిజ్యవేత్తగా మారిన హెడ్జ్ ఫండ్ విశ్లేషకుడు సాల్ ఖాన్ వీడియో పాఠాలను ఇంటిలో చూడమని మరియు హోమ్ వర్క్ని తరగతి గదిలో టీచర్ల సాయంతో చేయమని విద్యార్థులకు ఒక చిన్న అభ్యాసాన్నిచ్చారు. [5]

6. తరగతి గదిలో చురుకైన అభ్యాసానికి మూడు సూత్రాలు

తరగతి గదిలో చురుకుదనం పుట్టించడానికి పాఠ్యాంశాన్ని చక్కగా గుర్తుంచుకోవడానికి విద్యార్థులతో ప్రశ్నలు అడిగించడమే టీచర్ల యొక్క ఉపకరణంగా రసాయన టీచర్ రామ్ఈసే ముసల్లమ్ తెలిపారు. [6]

7. కంప్యూటర్ల ద్వారా లెక్కలు నేర్పడం

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా లెక్కలను నేర్పడం ద్వారా నిజ జీవితపు సమస్యలతో ముడిపెట్టగల థియరీని సాధిస్తారని, ఇది వారి భవిష్యత్తుకి ఎంతగానో ఉపకరిస్తుందని గణితవేత్త కాన్రాడ్ వొల్ఫ్రమ్ విప్లవాత్మక ఆలోచనను ప్రతిపాదించారు. [7]

8. తరగతి గదిలో సులభంగా చేయగల DIY ప్రాజెక్టులు

సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు సృజనాత్మక చర్యలద్వారా థియరీని గుర్తెరగడానికి, దానిలో సరదాగా గడపడానికి వీలుగా సాంకేతికవేత్త ఫాన్ క్యూ చౌకైన మరియు సులభమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. [8]

ఉచిత బోధనా ఉపకరణాలను గ్రహించడానికి పిసితో – మీరంతా సంసిద్ధులే!