అక్షరాలు నేర్చుకోవడానికి మా అమ్మాయి కంప్యూటర్ ఉపయోగిస్తుంది

 

 

స్నేహా జైయిన్ ఒక మల్టీ టాస్కింగ్ అమ్మ బ్లాగర్ మరియు ఆమె https://blogsikka.com పై బ్లాగింగ్ చేస్తుంటారు. ఆమె 12 సంవత్సరాల నుంచి మైక్రోబ్లాగిస్ట్గా ఉన్నారు, ఆమె దీనిపై పరిశోధన చేశారు. ఆమె ఒక అంకితభావం కలిగిన టెక్ లవర్, ఆమె 18 సంవత్సరాల నుంచి కంప్యూటర్ని ఉపయోగిస్తోంది.

1) ‘‘చదువు కోసం కంప్యూటర్’’ అనే భావనను మీరు ఎలా అర్ధం చేసుకుంటారు?

కొత్త విషయాలను నేర్చుకోవడానికి కంప్యూటర్ ఒక అద్భుమైన మరియు ఇంటరాక్టివ్ మార్గం అని నేను చెప్పగలను. ఇది మనం వేగంగా అభివృద్ధి చెందడానికి మరియు చిన్నవయస్సులోనే అనేక విషయాలను నేర్చుకోవడానికి దోహదపడుతుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కంప్యూటర్ని ఎల్లప్పుడూ పరిమిత గంటలపాటు ఉపయోగించాలని సిఫారసు చేయబడుతోంది.

2) ఒక పేరెంట్‌గా, విద్య యొక్క భవిష్యత్తు మీకు ఎలా కనిపిస్తుంది?

ఎల్లప్పుడూ నాణానికి రెండు పక్కలుంటాయి. పిల్లలు నేర్చుకునే విధానంలో తేడా వస్తుంది, ఇంటరాక్టివ్ మరియు వర్చువల్ లెర్నింగ్ పెరుగుతుంది, అయితే నేటి తరం ఎంత వేగంగా ఉంది అంటే, వారు ప్రతిదీ కూడా చాలా వేగంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నారు, కేవలం కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వారా మాత్రమే దీనిని సాధించగలరు.

3) మీ చిన్నపిల్లల చదువు కొరకు మీరు కంప్యూటర్ని ఎలా ఉపయోగిస్తారు?

నా కుమార్తె అక్షరాలు, కొత్త రైమ్‌లు, జంతువులు, రంగులు మరియు ఇంకా చాలా వాటి గురించి నేర్చుకోవడానికి కంప్యూటర్ని ఉపయోగిస్తుంది.

కంప్యూటర్ లేని శకంతో పోలిస్తే ఎడ్యుకేషన్ మరింత సులభతరం అయిందని నేను భావిస్తున్నాను. నేను నా కుమార్తెకు క్రాఫ్ట్ గురించి బోధించడానికి లైవ్ వీడియోలను ఉపయోగిస్తాను, అలానే జీవిత సూత్రాలు మరియు సిద్ధాంతాల గురించి బోధించడానికి వీడియోలు మరియు యానిమేషన్లను ఉపయోగిస్తాను. కొన్ని సమయాల్లొ ఆమె కంప్యూటర్‌కు ఎడిక్ట్ అవుతుందని నాకు తెలుసు, అయితే దానికి నేను ఒక లిమిట్‌ని ఏర్పాటు చేశాను. తద్వారా కంప్యూటర్ని ఎక్కువగా కాకుండా సమర్ధవంతంగా ఉపయోగించేలా చూస్తాను. ప్రాథమికంగా, ఇంటి వద్ద విధిగా కంప్యూటర్ ఉండాలి, ఎందుకంటే, పెయింట్ మరియు డిక్షనరీ వంటి వాటిని ఉపయోగించి నా కుమార్తెకు బోధిస్తాను, తద్వారా ఆమె పెయింట్‌లో బొమ్మలు గీస్తుంది అలానే డిక్షనరీ నుంచి పదాలను నేర్చుకుంటుంది. ఇది మాత్రమే కాకుండా,ఆమె కోసం నేను వర్క్షీట్లు తయారు చేసేందుకు మరియు, హోమ్‌వర్క్ కింద వచ్చే స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి సాయపడుతుంది. కలరింగ్ చేయడానికి వివిధ రకాల ఖాళీ స్కెచ్లను ఆమెకు ఇవ్వడానికి నాకు కంప్యూటర్ సహాయపడుతెందిజ ఆమెకు ఎలా డ్రా చేయాలి, క్రాఫ్టింగ్ మరియు వస్తువుల డిజైన్ గురించి తెలుసు. ఇది మాత్రమే కాకుండా, నేను నా కంప్యూటర్‌పై అనేక ఎడ్యుకేషనల్ వీడియోలు కూడా ప్లే చేస్తాను, తద్వారా వాస్తవ విజువలైజేషన్‌తో ఆమె కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోగలుగుతోంది.