రాబోయే విజయవంతమైన టర్మ్‌కు సిద్ధం కావడానికి ఆన్‌లైన్ అభ్యాస చిట్కాలు

ప్రపంచం ఆన్ లైన్ అభ్యాసంతో వ్యవహరించడం కొనసాగిస్తుండగా, విద్యార్థులు తమ ఖాళీ సమయం మరియు చదువుల సమయం మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. తరగతి గది మరియు ఇంటి వాతావరణాలు ఓవర్లాప్ కావడం విద్యార్థులకు సవాలుగా ఉంటుంది ఎందుకంటే ఇంటిని తరగతి గదిగా మారినప్పుడు సోమరితనం ఏర్పడటానికి ఎక్కువ సమయం పట్టదు. తరగతిలో మీ అత్యుత్తమ ప్రదర్శనను నిర్ధారించడానికీ మీరు ఉపయోగించవలసిన వ్యూహాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అవరోధాలను తగ్గించండి:

చక్కని అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పుడు, అవరోధాలను తగ్గించారని మరియు మీ ఆటలను దూరంగా పెట్టారని నిర్ధారించుకోండి. ఉపాధ్యాయుడు చెపుతున్న దానిపై శ్రద్ధ వహించండి మరియు మీ వీడియోని ఆన్ చేసి ఉంచండి. మీ సహ విద్యార్థులను కూడా ఇలా చేయమని ప్రోత్సహించడం, సౌకర్యవంతమైన అభ్యాస వాతావరణంలో ఒకరితో ఒకరు సంభాషించడానికి సహాయపడుతుంది.

ప్రశ్నలను రాసుకోండి:

మీరు అడగాల్సిన ప్రశ్నలను రాసుకోండి మరియు క్లాస్ పూర్తయిన తరువాత సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మీ ఉపాధ్యాయునికి ఇమెయిల్ చేయండి. క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ తయారు చేయడం వల్ల మీరు లెక్చర్ మొత్తం మీద శ్రద్ధ వహించవచ్చు.

నిమగ్నం అవ్వండి:

తరగతిలోకి మీ ఇన్పుట్లను జోడించడానికి సిగ్గుపడవద్దు. నిమగ్నం చేసే మరియు ఇంటరాక్టివ్ సెషన్స్ తరగతిని సరదాగా మరియు ఫలవంతంగా చేస్తాయి మరియు మీకు ఆసక్తిగా ఉంటాయి. మంచాన్ని వదిలేయండి, ఎందుకంటే అది మిమ్మల్ని విరామం తీసుకునేలా ఆలోచింప చేస్తుంది. ఆన్ లైన్ క్లాస్ సమయంలో మంచం మీద కాకుండా,  స్టడీ టేబుల్ దగ్గర నిలువు స్థితిలో కూర్చుని ఉండటం మిమ్మల్ని మొత్తం లెక్చర్ అంతా క్రియాశీలకంగా మరియు ఉత్పాదకంగా ఉంచుతుంది.

మొబైల్ ఫోన్ వదిలేయండి:

మొబైల్ ఫోన్స్ విరామం కొరకు ఉపయోగించే పరికరాలు మరియు ఆన్ లైన్ క్లాసుల సమయంలో మీరు ఫోన్ ఉపయోగిస్తుంటే, సోమరితనానికి లోనవడం చాలా సులభం PC లేదా laptop లో తరగతులకు హాజరు అవ్వండి, తద్వారా మీరు పెన్ను మరియు కాగితం కోసం వెతకకుండా దానిలోనే నోట్స్ రాసుకోవడం కొనసాగించవచ్చు. డెల్ తో ఇంటి నుండే అభ్యసించే అనుకూలతను(flexibility of learning) ఆనందించండి.

సమర్ధవంతమైన తరగతి వాతావరణం కొరకు ఈ పద్ధతులను అమలు చేయండి. ఇల్లు మరియు తరగతి మధ్య స్పష్టమైన విభజన మీరు సమర్ధవంతంగా విశ్రమించడానికి సహాయపడుతుంది:

https://www.dellaarambh.com/webinars/