పిసి-ఎనేబుల్డ్ అభ్యాసం భారతదేశం యొక్క విద్యారంగ గతిని మారుస్తుంది

రాబోయే సంవత్సరాలలో పిసి అభ్యాసం విద్యకు మూలంగా ఉండబోతుండగా, విద్య రంగం  క్రమబద్ధమైన సంస్కరణకు లోనవుతున్న సమయంలో మనము జీవిస్తున్నాము.

పిసి విద్య తో భారతదేశానికి దీర్ఘకాలిక చరిత్ర ఉంది, దేశంలో మొట్టమొదటి సారిగా 1963 లో కంప్యూటర్ సైన్స్ విద్య ప్రవేశపెట్టబడింది.1 అప్పటి నుండి, హై-స్పీడ్ ఇంటర్నెట్  యొక్క విస్తృత పంపిణీ కారణంగా దేశవ్యాప్తంగా ఆన్ లైన్ అభ్యాసం అనుసరించబడినది, జనవరి 2020 నాటికి బారతదేశంలో సుమారు 688 మిలియన్ క్రియాశీల డిజిటల్ వాడకందారులు ఉన్నారు.2 

నేడు, ఈ-లెర్నింగ్ కి భారతదేశం రెండవ అతి పెద్ద మార్కెట్, 2021 నాటికి 9.5 మిలియన్ వాడకందారులు మరియు USD 1.96 బిలియన్ విలువ కలిగి ఉంటుందని అంచనా.3

పిసి-ఎనేబుల్డ్ విద్య అంటే ఏమిటి?

ఆడియో మరియు విజువల్ మాధ్యమాల ద్వారా నిమగ్నం చేయడం వలన భావనలను గ్రహించడానికి మరియు గుర్తుంచుకోవడానికి పిసి విద్య విద్యార్థులకు సహాయపడుతుంది, ఇది పురాతన రోట్ అభ్యాస పద్ధతికి పూర్తిగా భిన్నము. విద్య మరియు సమాచారాన్ని అందించే ఈ అభ్యాస విధానము విద్యార్థులకు అంశాలను కేవలము జ్ఞాపకం ఉంచుకోవడంలో కాకుండా అర్ధం చేసుకోవడంలో సహాయపడతాయి.

 

అదనంగా, పిసిలు విద్యార్ధులకు క్రింది వాటికి వీలు కల్పిస్తాయి-

  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్ లు  మరియు విద్యార్థులతో సంభాషించటం
  • ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన మరియు వినూత్నమైన మార్గాలను కనుగొనడం
  • ఆడియో, విజువల్, టెక్స్ట్ లేదా గ్రాఫిక్ ఏదైనా వారికి మెరుగ్గా సరిపోయే ఫార్మాట్ లో  నేర్చుకోవడం
  • ప్రాజెక్టులపై పని చేస్తున్నప్పుడు తోటివారికి సహకరిస్తూ మరియు ఆలోచనలను పంచుకుంటు నేర్చుకోవడం
  • వారికి తగిన సమయంలో, వారి ఇంటి నుండే సౌకర్యంగా నేర్చుకుంటారు
  • మార్కులను సంపాదించడానికి ఒక భావనను గుర్తుంచుకోవడానికి ప్రతిగా, సందేహాలను అక్కడికక్కడే పరిష్కరించుకుంటారు
  • దేశవ్యాప్త రాజకీయ, సాంఘిక మరియు ఆర్ధిక సమాచారం గురించి తాజాగా ఉండటం

 

పిసి-ఎనేబుల్డ్ అభ్యాసం విషయానికి వస్తే, ఒక దేశంగా, మనము అతి వేగంగా అభివృద్ధి సాధించాము, అయినా మనము సాధించాల్సినది ఎంతో ఉంది. 2019 సంవత్సరం రెండవ త్రైమాసికంలో 3.4 మిలియన్ల పిసి యూనిట్ ల  రవాణా చేయబడగా, దేశంలో మొత్తం పిసి వ్యాప్తి 10% కంటే తక్కువ ఉంది.4


మా పరిష్కారం?

 

డెల్ ఆరంభ్ –  ఇది మెరుగైన అభ్యాసం కొరకు పిసి ని మెరుగ్గా ఎలా ఉపయోగించాలి అనే అవగాహనను అందించడం ద్వారా,  తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు పిల్లలు డిజిటల్ ఇండియాకు పరివర్తనం చెందటానికి సహాయపడటానికి, ఒక పాన్-ఇండియా పిసి ఫర్ ఎడ్యుకేషన్ చొరవ.

మా డెల్ ఛాంప్స్ స్కూల్ కాంటాక్ట్ కార్యక్రమం ద్వారా, వారి ఆలోచనా విధానంలో సృజనాత్మకత, విమర్శనాత్మక భావన మరియు క్లిష్టమైన సమస్య-పరిష్కారాలను పదును పెట్టడానికి, మేము ఇప్పటికే 1.5 మిలియన్ విద్యార్థులను నిమగ్నం చేశాము.

4,793 పాఠశాలలు లబ్ధి పొందాయి, 91,351 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు మరియు ప్రమాణీకరించబడ్డారు, మరియు 1,29,362 మంది తల్లులు శిక్షణ పొందారు, దేశంలో భవిష్యత్ విద్యారంగం కొరకు సిద్ధంగా ఉండటానికి పిసి వ్యాప్తిని పెంచే దిశగా మేము కృషి చేస్తున్నాము.