విద్యా బోధనకు పిసి: సాంకేతిక సాయంతో లెక్కలు నేర్పండి

మేథమెటిక్స్ బోధించడం చాలా క్లిష్టతరమైంది. లెక్కలను సమర్థవంతంగా, పిల్లలకు ఆసక్తి పుట్టించేలా నేర్పించడానికి ప్రతి ఒక్క టీచరుకి పలు అవకాశాలు కల్పించాలి.

పిల్లలు ఒక్కొక్క క్లాస్ దాటుతున్నకొద్దీ సబ్జెక్టులు తలచుకుని బెదరడం సహజం. క్లాస్‌రూములో నిర్లిప్తత తగ్గించడానికి, ముఖ్యంగా లెక్కలపట్ల నిరాసక్తత పోగొట్టడానికి టెక్నాలజీని చొప్పించాలి. టీచర్లకు, విద్యార్థులకు నడుమ సంబంధాలను నెలకొల్పడానికి మరియు లెక్కలపట్ల ఆసక్తి కలగడానికి వీలు కలుగుతుంది.

మరి, లెక్కలను చక్కగా బోధించడానికి అనువైన వెబ్‌సైట్లు, ఉపకరణాలు ఏమిటి?

Mathpickle.com

టీచర్లకు ఇదొక ప్రాక్టికల్ వనరు. విద్యార్థులు క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఈ వెబ్‌సైటులో కనబడే పజిళ్లు, గేములు దోహదపడతాయి. గ్రేడ్ వారీగా, సబ్జెక్ట్‌వారీగా ఉండే ప్రతి పజిల్ కనీసం 45-60 నిమిషాల వ్యవధితో ఉంటాయి.

ఉదాహరణకు, విద్యార్థులు తాము చేసిన గుణకారాలను మరలా చూసుకోవడానికి అంతగా ఇష్టపడరు. వారితో ఇంటరాక్ట్ కావడంద్వారా పునశ్చరణ చేసుకునేలా ప్రోత్సహించవచ్చు. మేత్‌పికిల్ డాట్ కమ్‌లోని రౌండ్ టేబుల్ అనే ఫన్ గేమ్ ఇందుకు సాయపడుతంది.

PatrickJMT


ప్యాట్రిక్ జె్ఎమ్‌టి వారి ఉచిత మ్యాథ్ వీడియోలు యూట్యూబ్‌లో చాలా పాపులర్. దాదాపు 1,50,000 మంది ఆదరించి, సభ్యులుగా ఉన్నారు. దీనిని నిర్వహించే ప్యాట్రిక్ జె్ఎమ్‌టి ఒక కమ్యూనిటీ కాలేజీలో మేథమెటిక్స్ ప్రొఫెసర్. వీక్షకులు స్కూలులో తమ గ్రేడ్‌లను మెరుగుపరచుకోవడానికి వీలుగా ప్రతి ఒక్కరూ తమ పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్యాట్రిక్ జె్ఎమ్‌టి ఉచిత మ్యాథ్ చానల్ అసంఖ్యాకమైన ప్లేలిస్టులను కలిగి ఉంది. వీటిలో బేసిక్ లెక్కల మొదలు అడ్వాన్స్‌డ్ లాగరిథమ్‌ల వరకు విస్తృత స్థాయిలో వీడియోలుంటాయి. టీచర్లు వీటిద్వారా సులభతరమైన, సానుకూలమైన మార్గాల్లో సంక్లిష్ట సమస్యలను సునాయాసంగా పరిష్కరించవచ్చు.

Math-salamanders.comకిండర్‌గార్టెన్ మరియు ప్రైమరీ స్కూల్ లెక్కల టీచర్లయిన మ్యాథ్ సలా,ఏండర్‌లు మీ సహాయానికి సిద్ధంగా ఉన్నారు.

చిన్నారులకు పరీక్షలు నిర్వహించడం చాలా సున్నితమైన సమస్య. కిండర్‌గార్టెన్ మొదలు గ్రేడ్-5 వరకు ప్రతి ఒక్క మ్యాథ్ టాపిక్‌లో చిక్కుముడులను విప్పదీసేలా మ్యాథ్ సలమేండర్స్ ప్రశ్నలను సులభతరం చేశారు. మేధో మ్యాథమేటిక్స్‌పై టెస్టులుకూడా అందజేస్తుంది. దీనివల్ల చిన్నారులు తమ పాఠ్యాంశాలకు మించి నేర్చుకోవడానికి, సాధన చేయడానికి వీలు కలుగుతుంది. కష్టసాధ్యమైన అంశాలపై వివిధ స్థాయిల పరిష్కారాలున్నందువలన తమ క్లాస్ టెస్టులను రూపొందించడానికి టీచర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ఇక్కడ మ్యాథ్ సలమేండర్స్ రూపొందించిన మేథో మ్యాథ్ షీట్ చూడవచ్చు.

Desmosడెస్మోస్ అతి వేగవంతమైన ఆన్‌లైన్ కాలిక్యులేటర్ కావడంతో ఎలాంటి ఊహాత్మకమైన గ్రాఫ్‌నైనా క్షణాల్లో రెడీ చేయగలదు. వినియోగించేవారు తమకు అనువుగా స్లైడర్లను జత చేసుకోవచ్చు. డేటా టేబుల్ వగైరాలను గీసుకోవచ్చు. జామెట్రీ, సమీకరణాలు వంటి క్లిష్టమైన అంశాలను బోధించేటప్పుడు విద్యార్థులను ఆసక్తిగా మలచడం కష్టం. ఆ పనిని డెస్మోస్ చేసి పెడుతుంది. పాఠ్య పుస్తకాలకు మించి మిమ్మల్ని తీసుకెళ్తుంది. క్లాస్‌రూములో పిల్లల దృష్టి మరలకుండా తాజా సమాచారాన్ని అందించడానికి ఈ టూల్ మీకు సాయపడుతుంది.   

లెక్కలను ఆసక్తికరంగానే కాక ఇంటరాక్టివ్‌గా మలచడానికి, పిల్లలు చొరవగా పాల్గొనేలా చేయడానికి ఈ సరళతరమైన ఉపకరణాలను వినియోగించండి. పరీక్షలో పిల్లలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేలా వాళ్లను చాలెంజ్ చెయ్యండి. లెక్కలు నేర్వడానికి ఇంతకంటే సరళ విధానం మరొకటి ఉండదు.