చదువు కొరకు పిసి: ఫస్ట్ టైమ్ టీచర్ల కొరకు ఆవశ్యకతలు

 

ముందుగా, మీ మొదటి టీచర్ ఉద్యోగానికి కంగ్రాచ్యులేషన్స్ మీరు అసిస్టెంట్ టీచర్ గా ఉండవచ్చు, ఇది మీ సీనియర్ కు ప్రత్యామ్నాయంగా లేదా షాడోగా ఉండటం జరగవచ్చు- ఇది మీ టీచింగ్ కెరీర్ కు ఆసక్తికరంగా ఉంటుంది. స్టేషనరీ, టెక్ట్స్ బుక్ లు మరియు కోర్సు మెటీరియల్ తోపాటుగా, పిసి కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇదుగో ఇందుకే:

1. లెసన్ ప్లాన్ ప్రో కావడానికి

ముందుగా ప్లానింగ్ చేయడం మరియు క్లాసులో చోటుచేసుకునే విషయాల గురించిసిద్ధం కావడం వల్ల, మంచి టీచర్ ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాయి. మీకు ఒక నిర్వచిత ప్లాన్ ఉన్ననప్పుడు, పురోగతిని తేలికగా ట్రాక్ చేయవచ్చు మరియు సంబంధిత వనరులను సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఎడ్యుకేషన్ వరల్డ్ మరియు టీచర్ వంటి వెబ్ సైట్ లు లెసన్ ప్లానింగ్ కొరకు టెంప్లెట్ లు మరియు ఐడియాలకు గొప్ప వనరులు.

2. క్లాస్ కొరకు ఐస్ బ్రేకర్ లను సిద్ధం చేసుకోవడం

కేవలం టీచర్ మాత్రమే మాట్లాడే క్లాస్ రూమ్ భావన ఇప్పుడు ఎంతో పాతదైపోయింది. మీ విద్యార్థుల్లో ఎంత ఎక్కువ ఉత్సాహపరిస్తే, అంత ఎక్కువగా మీరు చెప్పే విషయాలను వారు గుర్తుంచుకోగలుగుతారు- ఇది రెండు మార్గాల్లో సంభాషణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. విద్యార్థులు ఎదురుచూస్తే పాఠాలకు సంబంధించిన ఐస్ బేకర్ లతో సంభాషణ ప్రారంభించాల్సి ఉంటుంది.

3. విద్యార్థులు నిజంగా చూసే హోమ్ వర్క్ ఇవ్వండి.

ప్రాజెక్ట్ లు, గ్రూపు అసైన్ మెంట్ లు, సైన్సు ప్రయోగాలు మరియు ఫీల్డ్ ట్రిప్పుల్లో సాధారణంగా ఉండేవి ఏమిటి?
అవి అన్నీ కూడా ప్రాక్టికల్ హోం వర్క్ ఐడియాలు. అన్ని వయస్సులకు చెందిన విద్యార్థులు వాటి పట్ల ఆసక్తిని కనపరుస్తారు మరియు దానికి బదులుగా సబ్జెక్ట్ విషయాలను కూడా మరింత మెరుగ్గా అర్ధం చేసుకుంటారు.

4. మీ విద్యార్థులను ఆన్ లైన్ లో మదింపు చేయడం

పరీక్షలు ఎప్పుడూ పెన్ను మరియు పేపర్ ద్వారా నిర్వహించబడతాయి. దీనికి దాని స్వంత ప్రయోజనాలున్నాయి మరియు ఇది ఒక నిబంధనగా కొనసాగుతుంది. అయితే, గూగుల్ క్లాస్ రూమ్ వంటి టూల్స్ సాయంతో పిల్లలను మదింపు చేయడానికి కంప్యూటర్ సహాయపడుతుంది. అదనపు అభ్యసన వనరులతో మీరు విద్యార్థికి వెంటనే ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు, అలానే టెస్టింగ్ అవధిని కూడా మీరు పెంచవచ్చు.

5. తాజా టీచింగ్ ట్రెండింగ్ లను గురించి తెలుసుకుంటూ ఉండండి.

టీచర్స్ ఆఫ్ ఇండియా, ఎడ్యుటోపియా కమ్యూనిటీ మరియు మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ వంటి కమ్యూనిటీలు సహాయపడతాయి, ఇవి పాత మరియు కొత్త టీచర్లను అనుసంధానం చేసి, వారి ఆలోచనలు, సలహా మరియు సపోర్ట్ ని పంచుకోవడానికి దోహదపడుతుంది. రోజుకు కొన్నినిమిషాలపాటు చదవడం ద్వారా కూడా బోధనా ప్రపంచంలో ఏమి జరుగుతుందనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు.

విద్యార్థికి అభ్యసనకు మధ్య సంబంధాన్ని పెంపొందించడం కొరకు పెట్టే అత్యుత్తమ చర్యలే మంచి మరియు గొప్ప టీచర్ మధ్య తేడాను చూపుతాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పిసి ద్వరా కూడా దీనిని మీరు చేయవచ్చు.