చదువు కొరకు పిసి: టెక్నాలజీ కంటే మెరుగ్గా బయాలజీని బోధించండి.

 

బయాలజీ అనేది సైన్సు కరిక్యులంలో అత్యావశక అంశం, దీనిలో జెనిటిక్స్, పర్యావరణం మరియు ఆరోగ్యం వంటి అనేక అంశాలుంటాయి. ఈ సబ్జెక్ట్ లో ప్రతి విద్యార్థిలోనూ ఆసక్తి కలిగించడానికి అలానే, మెడిసిన్, సైంటిఫిక్ రీసెర్చ్, న్యూట్రిషన్ మరియు ఫిట్ నెస్ వంటి రంగాల్లోనే అనేక కెరీర్  లకు అవసరమైన పునాదిని వేస్తుంది. మరింత ఎక్కువ విషయాలు చెప్పాల్సిన సబ్జెక్ట్ లో, కంటెంట్ డ్రైగా డటం మరియు లెక్చర్ స్టైల్ బోధనా విధానం వల్ల విద్యార్థులు తరచుగా తమ ఆసక్తిని కోల్పోతారు.

టీచర్ గా, తరగతి గదిలో విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించం కొరకు మీరు చాలా చేయవచ్చు. బోధించే సమయంలో ఇటువంటి టూల్స్ మరియు డిజిటల్ వనరులను అమలు చేయడం ద్వారా విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి మరియు వారిని తరగతి గదిలో నిమగ్నం చేయడానికి దోహదపడుతుంది.[1]

1.ఇంటరాక్టివ్ బయాలజీ

ఇంటరాక్టివ్ బయాలజీ అనేది ఇతర టీచింగ్ వనరుల్లాంటిది కాదు. వెబ్ సైట్ లపై వీడియోలను చూడటం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో చెప్పిన విషయాలకు దృశ్యీకరణ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. ప్రతి వీడియో కూడా సంబంధిత రీడింగ్ మెటీరియల్ కు ఒక సంక్షిప్తమైన లింకులతో లభిస్తుంది మరియుదీనిలో అత్యుత్తమైన విషయం ఏమిటంటే, ప్రతి వీడియో కూడా బయాలజీ రంగంలో పరిశోధకుడు అయిన లెస్లీ సామ్యూల్ ద్వారా బోధించబడ్డ అసలైన పాఠాలు కావడం విశేషం.

2. సెరన్ డిప్ స్టూడియో

గేమ్స్ అనేవి వినోదంతోపాటుగా మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి అద్భుతమైన మార్గాలు. క్లాసురూమ్ కు ఇవి తీసుకొచ్చే పోటీ స్వభావం ఆసక్తిని సృష్టించడానికి సహాయపడతాయి. సెరన్ డిప్ స్టూడియో లో కవర్ చేయబడే ప్రతి టాపిక్ కు కూడా ఒక గేమ్ ఉంటుంది, దీనిలో విద్యార్థులు సంప్రదాయ పరీక్షలు వలే కాకుండా వెంటనే తాము నేర్చుకున్న విషయాలను టెస్ట్ చేసుకోవచ్చు. అన్నింటిని మించి, వెబ్ సైట్ లో మరింత సమర్థవంతంగా బోధించడం కొరకు బోధనా సూచనలు, ప్రిపరేటరీ మరియు ఫాలోప్ యాక్టివిటీలుంటాయి.

3. బయాలజీ కార్నర్

క్లాసులో చిన్న గ్రూపు యాక్టివిటీ అయినా, సంక్లిష్ట భావనలకు అప్లై అయ్యే పరీక్ష అయినా లేదా హోమ్ వర్క్ యాక్టివిటీ అయినా, విద్యార్థులు బయాలజీ సబ్జెక్ట్ ని అంటిపెట్టుకొని ఉండటం కొరకు స్థిరంగా వర్క్ షీట్ లను అందిస్తూ ఉండాలి. అనాటమీ నుంచి పర్యావరణం వరకు వివిధ రకాల టాపిక్ లపై అనేక వర్క్ షీటు వనరులను బయాలజీ కార్నర్ అందిస్తుంది. వెబ్ సైట్ లో "ఉపయోగకరమైన సైన్స్ విధానాలు" అనే విభాగం ఉంది, ఇది లెసన్ ప్లాన్ లతోపాటుగా దశలవారీగా ప్రయోగ మార్గదర్శకాలను అందిస్తుంది.

ఉపాధ్యాయులు తరగతి గదిని మరింత ఉత్సాహంగా మార్చడానికి ఈ టూల్స్ ఉపయోగపడతాయి. సరైన ఉద్దీపనం మరియు సమాచారాన్ని సాధించనప్పుడు, విద్యార్థులు తాము కేవలం వినియోగదారుల వలే సమాచారాన్ని వినకుండా అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్పంచుకుంటున్నట్లుగా భావిస్తారు.

బయాలజీ మీ విద్యార్థుల యొక్క ఫేవరేట్ సబ్జెక్ట్ గా కూడా మారవచ్చు!