చదువు కొరకు పిసి: టెక్నాలజీ కంటే మెరుగ్గా జాగ్రఫీని బోధించండి

 

చరిత్రను బోధించడం అనేది నిజంగా, క్లిష్టమైన సవాలే, శాస్త్రీయ భావనలు మరియు గణిత ఆల్గారిథమ్‌లను సరైన టూల్స్ ఉపయోగించి బోధించవచ్చు, అయితే తేలికగా గుర్తుంచుకొని పిల్లలు నిమగ్నం అయ్యేవిధంగా చరిత్రను మీరు ఏవిధంగా బోధించగలరు?

సంప్రదాయబద్ధంగా, చరిత్ర అనేది తేదీలు మరియు కీలక అంశాలను గుర్తుంచుకునే ప్రకియ, అయితే ఇది ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది. సరైన టూల్స్ మరియు టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా, చరిత్ర అనేది విద్యార్థులకు ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్టుగా నిలుస్తుంది, క్లాసురూమ్‌లో వారి ఊహాత్మక మరియు నిమగ్నతను పెంపొందిస్తుంది.

చరిత్రను మరింత మెరుగ్గా బోధించడానికి ఈ టూల్స్ మరియు వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చు.

 

1. బ్యాటిల్ ఇట్ అవుట్- వీడియోలను ఉపయోగించి చరిత్రను తిరిగి సృష్టించడం

ఒక పుస్తకం నుంచి చదవడం కంటే చూడటం మరియు చేయడం ద్వారా పిల్లలు మరింత నేర్చుకోగలరు. చరిత్ర తరగతిలో, యుద్ధాల గురించి కేవలం చదవడానికి బదులుగా, వాటిని విద్యార్థులు ఫిల్మ్ మీద తిరిగి సృష్టించగలుగుతారు. యుద్ధాల యొక్క విభిన్న భాగాలను హైలైట్ చేస్తూ,విద్యార్థులు వీడియోపై డైరెక్టర్ కామెంటెరీని జోడించవచ్చు, టీచర్ డివిడిచి ఎంచుకొని, దానిని తరువాత సంవత్సరంలో చూపించవచ్చు. విద్యార్థులు ప్రతి సంవత్సరం కొత్త యుద్ధం లేదా చరిత్రాత్మక ఘటనలను కూడా ఫిల్మ్ చేయవచ్చు.

 

2. ‘‘ఫ్రెండింగ్’’ గాంధీ

టీచర్‌లు చరిత్రలో ముఖ్యమైన వ్యక్తుల యొక్క ప్రొఫైల్స్ సృష్టించడం కొరకు ఫేస్‌బుక్‌ని ఉపయోగించవచ్చు, వీటిని ప్రెండ్ చేసుకోమని విద్యార్థులకు చెప్పవచ్చు. పిల్లలు చరిత్రలో నిలిచిన వ్యక్తుల గురించి కేవలం చదివే వారి గురించి బోర్‌గా భావిస్తారు. అయితే, ఈ వ్యక్తులతో వర్చువల్ ఇంటరాక్షన్ వల్ల, వారు మరింత వాస్తవికంగా అనుభూతి చెందుతారు మరియు పిల్లలు చరిత్ర ఘటనలకు సంబంధించిన నేపథ్యాన్ని తెలుసుకోగలుగుతారు.

జాతిపితో స్నేహితులుగా ఉండటాన్ని ఊహించుకోండి.

 

3. వీకీ క్లాస్‌రూమ్‌లు

మీరు అత్యాధునిక మరియు తేలికగా ఉపయోగించే వాతావరణంలో చరిత్రను నేర్చుకునేవిధంగా మీ విద్యార్థులను చేయవచ్చు. చరిత్ర ఘటనకు సంబంధించిన ఒక వీకీని రూపొందించమని మీ విద్యార్థులను అడగవచ్చు. విద్యార్థులు విడిగా లేదా కొంతమంది గ్రూపు విద్యార్థులు ఘటన యొక్క ఒక భాగానికి సంబంధించిన సారాంశాన్ని రూపొందిస్తారు, ఉదాహరణకు, రెండో ప్రపంచయుద్ధం సమయంలో హవాయి మీద జపాన్ దాడిచ అదేవిధంగా మరో గ్రూపు మరో అంశంపై పనిచేస్తుంది. మరియు పూర్తి అవలోకనం కొరకు మీరు విభిన్న భాగాలకు మారినప్పుడు, మీ విద్యార్థులు వాస్తవానికి చాలా విషయాలను గుర్తుంచుకోవడాన్న మీరు చూడవచ్చు.

 

4. నేషనల్ జియోగ్రాఫిక్ ద్వారా ఇంటరాక్టివ్ మ్యాప్‌లు

ఇంటరాక్టివ్ మ్యాప్ అనేది వెబ్ ఆధారిత మ్యాప్, దీనిపై క్లిక్ చేయగల ప్లేస్ మార్కర్‌లు ఉంటాయి. క్లిక్ చేయబడినప్పుడు, ఈ మార్కర్‌లు టెక్ట్స్, పిక్చర్‌లు, వీడియోలు అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించిన బాహ్య సైట్‌లకు లింక్‌లను కూడా అందిస్తుంది. నిర్ధిష్ట నగరం లేదా దేశం ఆధారంగా చరిత్ర ఘటనలను బోధించిన తరువాత ఇంటరాక్టివ్ మ్యాప్ సృష్టించమని టీచర్లు విద్యార్థులను అడగవచ్చు. ఇది ఒక సరళమైన కార్యక్రమం, ఇది విద్యార్థులు పాఠాన్ని మరింత మెరుగ్గా మరియు ఘటనలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

 

విద్యావేత్తలు అభ్యాసకులు విభిన్నరకాలుగా బోధించడానికి మరియు విద్యార్థులు నేర్చుకున్న విషయాలను మదింపు చేయడానికి అనేక మార్గాలను టెక్నాలజీ అందిస్తుంది. చరిత్రను బోధించడానికి ఈ విధానాలను ఉపయోగించండి మరియు ఇది త్వరలోనే మీ యొక్క ఫేవరేట్ సబ్జెక్ట్ అవుతుంది. #DellAarambh ఉపయోగించి ట్వీట్ చేయండి మరియు మీ అనుభవం గురించి మాకు చెప్పండి!