చదువు కొరకు పిసి: టెక్నాలజీ కంటే మెరుగ్గా ఫిజిక్స్ బోధించండి

ఫిజిక్స్ ఆన్ లైన్ కొరకు వెతకండి.

"ఫిజిక్స్ ప్రశ్నలు" అనేది ఆన్ లైన్ అత్యధికంగా వెతకబడేది అనేది, కాన్సెప్ట్ ల గురించి అర్థం చేసుకోవడానికి మరియు వాటిని లోతుగా అన్వేషించడానికి ఉండే డిమాండ్ ని తెలియజేస్తోంది. పిసిని ఉపయోగించి ఫిజిక్స్ ని మరింత మెరుగ్గా బోధించడానికి టీచర్ గా మీరు ఏమి చేస్తారు?

1. ద ఫిజిక్స్ క్లాస్ రూమ్ 

లెసన్ ప్లాన్, సిమ్యులేషన్ లు, యాక్టివిటీ ఐడియాలు, తదుపరి రీడింగ్, వర్క్ షీట్లు మరియు క్విజ్ తో కూడిన టూల్ కిట్ ఉన్న ఫిజిక్స్ క్లాస్ లో ఫిజిక్స్ టీచర్ కు తప్పనిసరిగా అవసరం అవుతాయి. యాక్సెస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వనరులతో ప్రతి పాఠానికి సంబంధించిన నిర్ధిష్ట ప్లాన్ వల్ల మీ సమయం ఆదా అవుతుంది మరియు క్లాసు రూమ్ లో విద్యార్థులను నిమగ్నం చేయడానికి దోహదపడుతుంది. మీ కావాల్సిందల్లా ఒక్క పిసి

2. PHET సిమ్యులేషన్ లు

సిమ్యులేషన్ లు అనేవి క్లాసులో ప్రజంట్ చేయడానికి ఉత్తమమైనవి ఎందుకంటే తమ నిజజీవితంలో ఎదుర్కొనే సిద్ధాంతాలను వారు చూసి,రోజువారీ విషయాలకు వాటిని అనువర్తించగలుగుతారు. PHETలో అన్ని వయస్సులవారి అవసరాలను తీర్చడం కొరకు వివిధ రకాల అంశాలు మరియు అభ్యసన స్థాయిల్లో సిమ్యులేషన్ లు ఉన్నాయి. అన్నింటిని మించి, క్లాస్ రూమ్ లో ఉపయోగించడం కొరకు డౌన్ లోడ్ చేసుకోవడానికి లభించే ఆన్ లైన్ సిమ్యులేషన్ లు పాఠం సమయంలో లోడింగ్ సమయాన్ని తగ్గిస్తుంది మరియు బోధించేటప్పుడు మళ్లీమళ్లీ ఉపయోగించుకోవచ్చు.

3. ఫిజిక్స్ సెంట్రల్

ఏదైనా కొత్త విషయం మరియు జీవితం ఎదుర్కొనే సంక్లిష్ట విధానాలకు సంబంధించి నేర్చుకోవడానికి కథలు అనేవి అత్యంత ఆహ్లాదకరమైన మార్గాలు. సూపర్ హీరో కామిక్స్ అయినప్పుడు వారు మరింత మెరుగ్గా ఉంటారు. ఫిజిక్స్ సెంటర్ యొక్క క్వెస్ట్ సీరిస్ అనేది టీచర్ లకు ఎంతో అభిమానపాత్రమైనది, ఎందుకంటే ఇది సిద్ధాంతపరమైన నాలెడ్జ్ ని వినోదాత్మక రూపంలో అందిస్తుంది, తద్వారా సిద్ధాంతాలను విద్యార్థులు దీర్ఘకాలం గుర్తుంచుకునేందుకు దోహదపడుతుంది.

4. నాసా స్పేస్ ప్లేస్

పెద్దైన తరువాత వారు ఏమి కావాలని అనుకుంటున్నారని విద్యార్థులను అడగండి. ఆస్ట్రోనాట్ అవ్వాలనేది చాలా సాధారణంగా వినిపిస్తుంది. అంతరిక్షానికి సంబంధించిన అన్ని విషయాలు గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది, అలానే ఇటీవల కాలంలో ఇస్రో సాధించిన విజయాలతో, దీని గురించి మరింత మాట్లాడుకోవడం జరుగుతోంది. మరోవిధంగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉండే సిద్ధాంతాలను ఎంతో సరళమైన రీతిలో వీడియోలు మరియు ప్రయోగాలు నాసా యొక్క స్పేస్ ప్లేస్ లో ఉంటాయి.

ఆసక్తి కలిగిన విద్యార్థుల కొరకు ఫిజిక్స్ ఎంతో అవకాశం ఉన్న మరియు ఇంకా మరిన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించే సబ్జెక్ట్. టీచర్ గా, మీరు లెసన్ ప్లాన్ రీసెర్చ్ నుంచి క్లాసులో వాస్తవంగా బోధించే థియరీ వరకు అన్నింటి విషయాల కొరకు పిసిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. [1] పిసి సహాయంతో స్కూళ్లో ఫిజిక్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి ఇది ఒక ఆరంభంగా భావించవచ్చు!