పిసి ప్రొ శృంఖల: ఈ #ప్రపంచ విద్యార్థి దినోత్సవం సందర్భంగా సమాచారచౌర్యాన్ని అరికట్టే దిశగా అడుగు ముందుకువేద్దాం

 

మీ పాఠశాలలో Gen Z లేదా మిలీనియల్ అనే ఆకర్షణ కంపించాలంటే  మీ దగ్గర మంచి  కంప్యూటర్లు వుండాలి. మీదగ్గర  మంచి, దృఢమైన నిర్మాణంకలిగిన పిసి వుందంటే, (మీరు సరైనదాన్ని ఎంపిక చేసుకున్నారా లేదా అన్న విషయం నిర్ధారించుకోవాలి) ఇక  సమాచారమంతా  మీ చేతివేళ్లకు అందుబాటులో వున్నట్లే,  అయితే నాణానికి మరోవైపు మీ సమాచారం చౌర్యం  చేసే అవకాశం కూడా వుంటుంది. అయితే దీన్ని  ప్రోత్సహించడం చాలా అనైతికమైన చర్య:

భావ దోపిడీ: మీరు ఇతరుల  ఆలోచనలను మరియు పనిని దొంగిలించడం అంటే,  తప్పనిసరిగా అది విద్యార్థి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లవుతుంది.

తోటివారి దగ్గర  గౌరవం కోల్పోవలసి వస్తుంది: మీరు మరొక విద్యార్థి యొక్క అనుమతి లేకుండా అతడి / ఆమె  హోంవర్క్ ను కాపీ చేయటానికి  పూనుకున్నట్లయితే,  మీరు వారితో  సమాధానాలు పంచుకునే సమయంలో ప్రమాదానికి గురికావచ్చు. వాస్తవానికి  నిజం బయటకు వచ్చినప్పటికీ మీ ఇద్దరిలో అది ఎవరి పని అన్నవిషయం   ఉపాధ్యాయుడికి తెలియదు అయితే, మీ తోటి విధ్యార్తి అది తనది అని నిరూపించినట్లయితే,  మిమ్మల్ని స్కూల్లో అందరూ ‘మోసగాడు’ అనే ముద్ర వేయడం జరుగుతుంది.

దానివల్ల చదువు యొక్క లక్ష్యమే దెబ్బతింటుంది: మీ ఆలోచనా విధానాన్ని, మీ తార్కిక జ్ఞానాన్ని, మీ చదువులో వున్న నాణ్యతను గుర్తించడం కొరకే పాఠశాలలో  పరీక్షలు వ్రాయించడం  మరియు అసెస్మెంట్లు నిర్వహించడం  జరుగుతుంది. మీరు గనుక సమాచార చౌర్యానికి పాల్పడుతున్నట్లయితే, ఈ లక్ష్యం పూర్తిగా దెబ్బ తింటుంది.

ఒక పిసిని ఉపయోగించి సమాచార చౌర్యాన్ని అరికట్టడం ఎలా?

ఉద్దేశించబడిన  అర్థాన్ని గ్రహించండి: విక్కీపెడియా, గూగుల్ స్కూల్ వంటి మూలాల నుండి సమాచారం బైటికి తీసినపుడు ఆ సమాచారాన్ని యధాతధంగా కాపీ పేస్ట్ చేయకుండా అందులోని సందర్భాన్ని మరియు అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆ సమాచారాన్ని చదివి పూర్తిగా అవగాహన చేసుకొని, మీ సొంత మాటల్లో దాన్ని తిరిగి  పొందుపరచాలి.  

దాన్ని కోట్ చేయండి: మీరు ఉపయోగిస్తున్న సమాచారం మరో మూలం నుండి సేకరించినట్లుగా తెలియడం కోసం దాన్ని కొటేషన్ల రూపంలో వ్రాయండి. ఆవిధం కొటేషన్లుగా వ్రాసే సమయంలో ఆ పదాలు మరియు వాక్యాలను  యధాతధంగా ఉపయోగించ వలసి వుంటుంది.

సరిగ్గా ఉదాహరించండి: మూలం నుండి సేకరించినా ఏదైనా పదం లేదా వాక్యాన్ని నేరుగా  ఉపయోగించినపుడు దానిని ఎక్కడినుంచి సేకరించారో సరిగా ఉదహరించాల్సిన అవసరం ఉంటుంది. సేకరించిన విషయాలను మీరు పరీక్షించి, సమీక్షించి వ్రాసినపుడు వారిని మూలం గురించి ఉదాహరించవలసిన అవసరం లేదు. అదేవిధంగా, జరిగిన సంఘటనలు, అందరికీ తెలిసిన అంశాలను గురించి వ్రాస్తున్నపుడు మూలం గురించి ఉదాహరించవలసిన అవసరం లేదు.

గమనిక: Ctrl+Shift+Plus ను మీ షార్ట్ కట్ గా ఉపయోగించండి

రెఫరెన్స్: సమాచార చౌర్యాన్ని అరికట్టే మరో ప్రధానమైన మార్గం రెఫరెన్స్ లు ఇవ్వడం. మీ వ్యాసం చివర్లో ఒక పేజీ కేటాయించి మీరు సేకరించిన సమాచారానికి సంబంధించిన రెఫరెన్సులు అందులో పేర్కొనండి.

సమాచారచౌర్యం జరగకుండా మీకు సహకరించే పిసి వనరులు

  1. https://www.duplichecker.com/
  2. https://www.grammarly.com/plagiarism-checker
  3. https://www.quetext.com/

ఇది మొదలుపెట్టే సమయంలో మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ, దాన్ని అనుసరిచడం వల్ల భవిష్యత్తులో  మీరు సూపర్ ప్రాడక్టివ్ స్టూడెంట్ గా మారడానికి ఇది ఉపకరిస్తుంది. సొ, సమాచారచౌర్యానికి స్వస్తి పలికి నవీన కల్పనాశక్తికి  స్వాగతం పలకండి!