నేడు కంప్యూటర్లు అభ్యసనలో అంతర్భాగం అయ్యాయి

 

పర్మీందర్ శర్మ రచయిత, బ్లాగర్ మరియు బ్యాంకర్, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1) ‘‘చదువు కోసం కంప్యూటర్’’ అనే భావనపై మీ అభిప్రాయం ఏమిటి?

చదువులో కంప్యూటర్ పాత్రను మనం ఏమాత్రం నిరాకరించలేుం. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అనేక మార్గాలను తెరవడమే కాకుండా, డిజిటల్ ప్రపంచంలో నుసంధానం కావడానికి సహాయపడుతుంది.

కంప్యూటర్ ద్వారా అసైన్మెంట్లు చేయడం లేదా స్మార్ట్ క్లాస్‌ల లేదా హోం వర్క్ యాప్‌లు ఇలాంటి వాటి ద్వారా నేడు కంప్యూటర్లు కేవలం మరో అకడమిక్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా అభ్యసనలో అంతర్భాగం అయ్యాయి.

2) ఒక పేరెంట్‌గా, మీ బిడ్డ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నట్లుగా ధృవీకరించుకోవడానికి మీరుర ఏమి చేస్తారు?

పిల్లల అన్ని ప్రాథమిక అవసరాలను సమకూర్చడం తల్లిదండ్రుల బాధ్యత, అయితే ప్రపంచాన్ని అదేవిధంగా దాని సవాళ్లను ఎదుర్కొనే విధంగా మీ బిడ్డను సిద్ధం చేయడం అనేది వారి ప్రాథమిక బాధ్యత. బిడ్డ భవిష్యత్తు సిద్ధం చేయడంలో నేడు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల వారికి టెక్నాలజీకి అందిపుచ్చుకునేందుకు అవకాశాలు కల్పించడం కీలకం.

‘‘ పిల్లలను గాడ్జెట్ల నుంచి దూరంగా ఉంచాలని మనం మాట్లాడేటప్పుడు, టెక్నాలజీని దూరంగా చేయడం గురించి కాకుండా టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవడం గురించి మాట్లాడాలనే విషయాన్ని మర్చిపోవద్దు. ”

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిణామాల గురించి బిడ్డ ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, పాఠాల్లో అంత మెరుగ్గా రాణించగలుగుతాడు.

3) మీ చిన్నారులను ఆన్లైన్లో ఎలా సురక్షితంగా ఉంచగలం?

నిజ ప్రపంచంలోనే, సైబర్ వరల్డ్‌లో కూడా అనేకప్రమదాలు ఉంటాయి, భౌతికంగా కనిపించే ప్రమాదాల వలే కాకుండా ఇటువంటి బెదిరింపులు ఉంటాయి. బిడ్డకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేయడంతోపాటుగా, వారిని సురక్షితంగా ఉంచడం కూడా ఎంతోముఖ్యమైనది.

‘‘ రోడ్డు దాటేటప్పుడు బిడ్డకు చెప్పే జాగ్రత్త వంటిదే ఇది కూడా. మనం వారికి ట్రాఫిక్ నిబంధనలు అన్నింటి గురించి బోధిస్తుంటాం, జీబ్రా క్రాసింగ్ వద్దనే దాటాలని, ఫుట్‌పాత్‌లు ఉపయోగించాలని చెబుతాం, అలానే వాటిని పాటించేలా ప్రోత్సహిస్తూ ఉంటాం.’’

పిల్లలు తమ సైబర్ హక్కుల గురించి తెలుసుకోవడం కొరకు సైబర్‌క్రైమ్‌కు సంబంధించిన కథలను వారితో విధిగా పంచుకోవాలి. ఈ రిస్క్‌ని కవర్ చేయడంకొరకు, వారి సైబర్ కార్యకలాపాలను మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి మరియు దీని కొరకు అందించబడే తగిన పరిష్కారాలను ఇన్స్టాల్ చేయాలి.

4) ముగించడానికిముందు, మీ తాజా పుస్తకం గురించి చెప్పండి

నా తాజా పుస్తకం - మంకీయింగ్ టూ పేరెటింగ్ అనే పుస్తకం, సంబంధాలు మరియు కుటుంబ విలువలను పునరుద్ధాటిస్తుంది. ఇది మీ పట్ల, మీ జీవితభాగస్వామి, మీ అత్తమామలు మరియు టీచర్లకు సంపూర్ణ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పేరెంటింగ్ సంబంధించిన ఒక సంపూర్ణ భావన కలిగిస్తుంది. అకడమిక్ సమస్యలు, వేధింపులు, కుయుక్తులు, హైపర్ యాక్టివిటీ వంటి వివిధ రోజువారీ సమస్యలకు సంబంధించి తల్లిదండ్రులకు పరిష్కారాలను అందిస్తుంది.