వర్ధమాన అభ్యాసకుల సమూహాన్ని అభివృద్ధి చేయడం కొరకు స్క్రీన్ ద్వారా చేరుకోవడం

గత కొన్ని సంవత్సరాల నుండి, పిల్లలు అందరూ ఆన్ లైన్ అభ్యాస వేదికలకు అలవాటు పడ్డారు. ఇది,  ప్రతి ఒక్కరిని మహమ్మారి నుండి సురక్షితంగా ఉంచడానికి మనకు ఉన్న ఒకే మార్గం అయినప్పటికీ, ఆన్ లైన్ అభ్యాసం ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య దీర్ఘ అంతరాన్ని సృష్టించింది. ఇది అభ్యాస ప్రక్రియను గణనీయంగా ప్రభావితం చేసింది. రిమోట్ అభ్యాసంలో దూరాన్ని తగ్గించడానికి సరళమైన మార్గాలు క్రింద ఇవ్వబడ్డాయి:

ఇంటరాక్టివ్ అభ్యాసం: ప్రతి ఒక్కరు మ్యూట్ లో ఉండి, కెమెరాలు ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు విధ్యార్థుల ధ్యాస తేలికగా మరలుతుంది. సెషన్ ను ఉత్సాహంగా చేయడానికి పిల్లలు ఏకాగ్రత చూపేలా చేయడం ముఖ్యం. అందువలన, ఆడియో మరియు వీడియోలను ఆన్ చేసి ఉంచేలా పిల్లలను ప్రోత్సహించండీ.

సరదా కార్యకలాపాలు: తోటి విద్యార్థులు లేకపోవడం అనేది అభ్యాసం పై ఆసక్తి లేకుండా చేస్తుంది. భౌతికంగా లేకపోవడం యొక్క నష్టాన్ని పూరించడానికి, సరదా కార్యకలాపాలను చేపట్టండి. ఉదాహరణకు, వివిధ రకాల మొక్కల గురించి మాట్లాడేటప్పుడు తోటలో ఉండి బోధించండి

పరీక్షిస్తూ ఉండండి: చిన్నవి, అనుకోకుండా పెట్టే పరీక్షలు పిల్లలు పాఠాల పట్ల మరింత శ్రద్ధ చూపేలా చేస్తాయి. వారానికి ఒకసారి ఒక ఎం సి క్యూ లేదా విభిన్న అంశాల పై చిన్న ప్రెజెంటేషన్ వంటివి నేర్చుకోవడాన్ని మరింత ఆహ్లాదంగా మరియు ప్రభావవంతంగా చేస్తాయి. అంతే కాకుండా, విద్యార్థులు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి.

ప్రశంసించండి & బహుమతి ఇవ్వండి: కష్టపడినందుకు ప్రశంసలు మరియు బహుమతులు ఇవ్వడం, మరింత మెరుగుపడటానికి పిల్లలకు ప్రేరణను ఇస్తుంది. చిన్న బహుమతులు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. సరైన సమాధానం చెప్పినపుడు ప్రశంసించడం వలన వారు శ్రద్ధగా వింటారు. ఇది ఇతర విద్యార్థులు కూడా కష్టపడి చదివేలా ప్రోత్సహిస్తుంది.

ఇవే కాకుండా, ఉపాధ్యాయులు ఆన్ లైన్ అభ్యాసం సరదాగా ఉండేలా చేయడానికి, గ్రూపులుగా విభజించి, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను, ప్రశ్న/జవాబుల సెషన్స్ ను నిర్వహించవచ్చు అలాగే గెస్ట్ ఉపాధ్యాయులను కూడా ఆహ్వానించవచ్చు.