బట్టీ పట్టడం వర్సెస్ పిసి ఆధారిత అభ్యసనం

 

బట్టీ పట్టడం అంటే ఏమిటి?

సమాచారాన్ని అర్థం చేసుకోకుండా వల్లే వేయడం ద్వారా నేర్చుకునే లేదా గుర్తుంచుకునే విధానమే బట్టీ పట్టడం. అక్షరాలు, నెంబర్లు మరియు ఎక్కాల పట్టికలు వంటివి వల్లె వేయడం ద్వారా గుర్తించుకోవడాన్ని బట్టీపట్టడానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. మీ బిడ్డ ప్రాథమిక పాఠశాలలో ఉండేటప్పుడు, సబ్జెక్ట్ మెటీరియల్ని మరింత లోతుగా నేర్చుకోవడం వల్ల ఒక బలమైన పునాది ఏర్పడుతుంది.

పిసి ఆధారిత అభ్యసనం అంటే ఏమిటి?

స్కూళ్లలో బోధించడానికి ఇది సరికొత్తవిధానం, పిసి ఆధారిత అభ్యసన అనేది ఒక ఇంటరాక్టివ్ మరియు అభ్యసనకు సంబంధించి ఇంద్రియ అనుభూతిని ఇస్తుంది, తద్వారా విద్యార్ధులు చదువుకునేటప్పుడు చాలా అలర్ట్గా ఉండగలుగుతారు. క్లాసులో బోధించిన థియరీ ఎక్కువ కాలం గుర్తుండటం కొరకు కేవలం పైపైన చదవకుండా క్లాసులో బోధించిన థియరీని అర్ధం చేసుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. వర్చువల్ ఫీల్ట్ ట్రిప్పులు, క్విజ్లు, వీడియోలు, ప్రజంటేషన్లు వంటివి దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

మీ బిడ్డ బాగోగులు కొరకు మీరు సరైన అభ్యసన విధానాన్ని ఎంచుకోవడానికి సహాయపడే సమగ్రమైన గైడ్ ఇది.

అయితే, మీ బిడ్డ కొరకు ఏది మెరుగైనది?

బట్టీపట్టడాన్ని మనం పూర్తిగా విస్మరించలేం- ఇది మన విద్యావ్యవస్థలో పూర్తిగా పాతుకుపోయింది. దీర్ఘకాలిక మరియు నిరంతర ప్రాతిపదికన ప్రయోజనాలను పొందడం కొరకు మీ బిడ్డ రోజువారీ అధ్యయన ప్రణాళికలో PC-ఆధారిత అభ్యసన జోడించడం ద్వారా మీరు సహాయపడవచ్చు.