సాంకేతికత, ఉపాధ్యాయుల బోధన పద్ధతులను ఉన్నతీకరించిన ఏడు మార్గాలు

గత రెండు సంవత్సరాలు, అభ్యాస ప్రదేశంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు సంభాషించే పద్ధతిని చాలా గొప్పగా మెరుగుపరచాయి. రిమోట్ వాతావరణంలో ప్రభావవంతమైన అభ్యాసాన్ని అందించడానికి ఉపాధ్యాయులు చేపట్టిన కీలకమైన అనుసరణలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

1. విద్యా వనరులు ఉపయోగం: డిజిటల్ వనరులుగా ఉపయోగించబడే అకాడమీలు మరియు పోర్టల్స్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రజాదరణ పొందినవి స్కాలస్టిక్, బైజూస్ మరియు వేదాంతు.

2. మిశ్రమ అభ్యాస పద్ధతి: ముందుగా రికార్డ్ చేయబడిన పాఠాలు, స్పైడర్ వెబ్ చర్చలు, థింక్-పెయిర్-షేర్ కార్యకలాపాలు మొదలైన ఆన్ లైన్ సాధనాలతో పాటు సమకాలిక మరియు అసమకాలిక వ్యూహాలు రెండిటినీ ఉపయోగించడం

3. ఆన్ లైన్ ఫారంలు: గూగుల్ క్లాస్ రూమ్ వంటి వేదికలు ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల మధ్య నిరంతరంగా ఫైల్స్ పంచుకోవడానికి వీలు కల్పిస్తాయి మరియు గూగుల్ డాక్స్ వంటి ఇతర సాధనాలు విశ్వసించగలిగిన ఉపాధ్యాయుల-నుండి-విద్యార్ధులకు ఫీడ్ బ్యాక్ ని ప్రోత్సహిస్తాయి. 

4. డిజిటల్ సాధనాలు: నియర్ పాడ్ వంటి సహకార బోర్డులు, విద్యార్ధులు ఒక అంశం మీద ఆలోచనలు పంచుకునే వీలు కల్పించడానికి సహకరిస్తాయి. ఉపాధ్యాయులు, చర్చలో ఎవరు పాల్గొంటున్నారు అని గమనించవచ్చు మరియు డిస్కషన్ బోర్డుకి ఏది జోడించవచ్చు, ఏది జోడించకూడదో ఆమోదించవచ్చు.

5. పుస్తకాలకి ప్రత్యామ్నాయం: కాగితం ఆధారిత వనరులకి ప్రత్యామ్నాయాలైన ఇ-వర్క్ షీట్స్ , ఇ-షెడ్యూళ్స్ మొదలైన ప్రత్యామ్నాయాల ఉపయోగాన్ని ప్రోత్సహించాలి, ఇవి ఒక విధంగా, అందుబాటులో ఉన్న పరిమిత సహజ వనరుల గురించి పిల్లలకు బాగా అవగాహన కల్పిస్తుంది. ఇది పి సి అభ్యాసంపై దృష్టిని తెస్తుంది.

6. ప్రపంచం గురించి నేర్చుకోవడం: కర్రిక్యులంలో సామాజిక మాధ్యమం మరియు సమకాలీన అంశాలను చేర్చడం మరియు ఇంటర్నెట్ మరియు వెబ్ ని సురక్షితంగా ఎలా బ్రౌజ్ చేయాలి అని విద్యార్ధులకు అవగాహన కలిగించడం.

7. సంపూర్ణ అభ్యాసం: ఆసక్తి ఉన్న అన్నీ అంశాలలో అభివృద్ధిని ప్రోత్సహించేలా మరియు మెరుగుపరచగలిగేలా ఉపాధ్యాయుల కొరకు నిరంతర ఫీడ్ బ్యాక్ ని అందించే సంపూర్ణ అభ్యాస వాతావరణం.

ఇప్పుడు ఉపాధ్యాయులు విస్తృత పరిధి మరియు కొత్తవి మరియు మెరుగైన అభ్యాస పద్ధతులను గ్రహించే వైఖరి కలిగి ఉన్న నూతన విద్యావేత్తలు. ఉత్తమ బోధన అవకాశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులను సాధికారులను చేయడానికి డెల్ పి సి అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మరింత తెలుసుకునేందుకు ఇక్కడ నొక్కండి.