STEAM ఎడ్యుకేషన్: ప్రతి టీచర్ తప్పకుండా తెలుసుకోవాల్సింది

 

ప్రపంచపు భవిష్యత్తు మీ క్లాసురూములో ఉంటుంది. భవిష్యత్తులో నేడు ఉన్నదానికంటే మరింత అత్యధిక సాంకేతికత ఉండవచ్చు. ఒక విద్యావేత్తగా, ఇటువంటి సాంకేతికతను మీ విద్యార్ధులకు అందించకుండా మీరు నిరాకరించలేరు. అటువంటి సమయాల్లో మీకు STEAM ఎడ్యుకేషన్ ఎంతగానో సహాయపడుతుంది.

STEAM ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?

STEAM ఎడ్యుకేషన్లో ఈ దిగువ విషయాలుంటాయి:

1) సైన్సు
2) టెక్నాలజీ
3) ఇంజినీరింగ్
4) ఆర్ట్
5) గణితం

ఈ సబ్జెక్ట్లు అనేక కెరీర్లతోపాటుగా ఇంకా మనుగడలో లేని వాటికి సైతం, కీలకమైన పునాదిని ఏర్పరుస్తాయి.
ప్రతి సబ్జెక్ట్లోని కీలకమైన భావనలను అర్ధం చేసుకోవడం మరియు ప్రతి ఒక్కదాని మధ్య ఉండే సంబంధాన్ని అర్ధం చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అత్యంత అవసరమైన క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలు మెరుగుపడటం కొరకు రీసెర్చ్, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ ఆధారిత అసైన్మెంట్ల కొరకు కంప్యూటర్ ఉపయోగం దోహదపడుతుంది.

STEAM ఎడ్యుకేషన్ ఎందుకు ముఖ్యమైనది?

విద్యార్ధి ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాని పరిష్కరాన్ని స్వయంగా ఆలోచించాల్సి ఉంటుంది. STEAM సబ్జెక్ట్లు విద్యార్ధులకు ఆలోచించే స్వభావాన్ని అందిస్తాయి, తద్వారా వారు క్రిటికల్ థింకింగ్ ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.

STEAM ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

ఈ సబ్జెక్ట్లు లేదా సబ్జెక్ల్లో భాగంగా ఉండే ప్రాథమిక భావనలు దేశంలోని అన్ని బోర్డుల్లో చిన్నవయస్సు నుంచి బోధించడం ప్రారంభిస్తారు. వీటి తీవ్రత ఎంతగా ఉండాలనే దానిపై పని చేయాల్సి అవసరం ఉంటుంది. మరిన్ని ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ లేదా చిన్నారి మెదడును పదును పెట్టేవిధంగా ఉండే హోమ్వర్క్ లేదా తరచుగా ఫీల్డ్ ట్రిప్పులు అనేవి STEAMలో భాగంగా టాయి- చిన్నపాటి అడుగులు సైతం మీ విద్యార్ధులు ఎంతో దూరం వెళ్లేందుకు దోహదపడతాయి.

STEAM ఎడ్యుకేషన్ని రెగ్యులర్గా మీ క్లాసులో భాగంగా చేసుకోవడానికి దోహదపడే ఐదు విషయాలు ఇవిగో:

1) మీ పిల్లలకు ఆసక్తి కలిగిన విషయాల గురించి మరింత అన్వేషించడంకొరకు మీ విద్యార్ధులకు స్థాలాన్ని స్కూలులో సృష్టించడం కొరకు మార్కర్ స్పేస్ ఏర్పాటు చేయండి.
2) పెద్దగా ఫ్యాన్సీ మెటీరియల్ అవసరం లేని అవుట్ ఆఫ్ బాక్స్ లేదా మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్లు ఉన్న హోమ్వర్క్ని అసైన్ చేయండి.
3) స్కూలు వద్ద మీ విద్యార్ధులు కంప్యూటర్లు యాక్సెస్ చేసుకునేలా చూడండి, అలానే దీర్ఘకాలిక ప్రయోజనం అందించే విధంగా తమ పిల్లల కోసం ఒక కంప్యూటర్పై పెట్టుబడి పెట్టించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించండి.
4) STEAM సబ్జెక్టుల గురించి మరింత ఆసక్తికరంగా మాట్లాడేందుకు దోహదపడే యాక్టివిటీస్తో క్లాసురూమ్లు సంభాషణాత్మకంగా మార్చండి.
5) అలాననే గ్రూపు వర్క్ ఇవ్వండి, దీని వల్ల చిన్నపిల్లలు సులభంగా చర్చల్లో మరియు డిబేట్లో పాల్గొంటారు, ఇది పిల్లవాడిలో సబ్జెక్ట్ గురించి ఆసక్తిని పెంపొందిస్తుంది.

హ్యాపీ టీచింగ్!