విద్యార్థులు తమ కెమెరాలను ఆన్ చేసేలా ప్రోత్సహించడానికి వ్యూహాలు

గడిచిన రెండు సంవత్సరాలు, సంప్రదాయ అభ్యాస పద్ధతులను అన్నిటినీ తిరిగి నిర్వచించాయి. ఆన్ లైన్ తరగతులతో,  రోజులో ఎక్కువ సేపు పిల్లలు ల్యాప్ టాప్ కు అతుక్కుపోవడం వలన అలసటకు గురికావడం సాధారణంగా జరుగుతోంది. తమ తోటి విద్యార్థులతో సరదాగా గడపడాన్ని కోల్పోతున్నామన్న భావనకి ఇది తోడవుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు, ఆన్ లైన్ తరగతులను మరింత సరదాగా మార్చేందుకు ఉపాధ్యాయులు సామాజిక-భావోద్వేగ అభ్యాస పద్ధతులను ఉపయోగించవచ్చు మరియు తమ కెమెరాలను ఆన్ చేయడం మరియు క్రింది వాటిని సాధన చేయమని ప్రోత్సహించడం ద్వారా తమ విద్యార్థులలో కమ్యూనిటీ భావనను తిరిగి పరిచయం చేయవచ్చు:

రోల్ ప్లేయింగ్ సాధన చేయడం: సాహిత్య తరగతులలో రోల్ ప్లేయింగ్, ఉత్సాహాన్ని పెంచడానికి ఒక గొప్ప మార్గము. విద్యార్థులకు భాగాలను కేటాయించి, మీరు నాటకం లేదా పాఠాన్ని చదువుతున్నప్పుడు వారు ఆ పాత్రలలో నటించేలా చేయవచ్చు.

సమయాన్ని కథలు చెప్పడానికి ఉపయోగించడం: తరగతి ముగింపు సమయాన్ని కథలు చెప్పడానికి కేటాయించడం ద్వారా బ్రేక్ తీసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించండి. ముగింపులో నీతి ఉండే ఒక సరదా కథ, మీ చిన్నారి విద్యార్థుల రోజుని ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. విద్యార్థులను కెమెరాలను ఆన్ చేయమని కోరి, ప్రతి తరగతి ముగిసే సమయానికి, ఒక కథ చెప్పమని అడగండి. కాలక్రమేణా ధైర్యం పెరగడానికి మరియు అందరిలో మాట్లాడగలిగే నైపుణ్యాలు మెరుగుపడటానికి ఇది సహాయపడుతుంది.

సృజనాత్మక ప్రెజెంటేషన్: పాఠశాల పని కాకుండా ఇతర అంశాలపై ప్రెజెంటేషన్స్ , విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా ప్రోత్సహిస్తాయి. మనది అనే భావనను తిరిగి తరగతిలోకి తీసుకురావడానికి కలిసి పని చేసి గ్రూప్ ప్రాజెక్టులను కూడా వారు ప్రెజెంట్ చేయవచ్చు.

అంతే కాకుండా, రోజూవారీ కార్యకలాపాల గురించి విద్యార్థులు ఒకరికి ఒక్కరూ మాట్లాడుకునేలా కూడా మీరు అనుమతించవచ్చు, ఒకరి పురోగతిని మరొకరు తెలుసుకోవడాని గురుంచి బోధించండీ మరియు సహకార అభ్యాస వ్యూహాలను పరిచయం చేయండి. విద్యార్థులు ఆన్ లైన్ తరగతులలో ధైర్యంగా ఉండటానికి మరియు ఉదాసీనంగా కాకుండా కెమెరాలను ఆన్ చేసి పాల్గొనడానికి ఇది సహాయపడుతుంది.