టీచర్ టాక్: నా కంప్యూటర్ లేకుండా నేను టీచింగ్‌ని ఊహించలేను

 

జాస్మిన్ సింధూ
పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి ఐటి ఇంజినీర్ అయిన జాస్మిన్, పంజాబ్‌లో టాప్ స్కూల్స్‌లో ఒకటైన ఒక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు, మోహాలీలో కంప్యూటర్ సైన్సును బోధిస్తారు. ఆమె క్లాసులు ఐబి, ఐజిసిఎస్ఈ మరియు సిబిఎస్ఈ బోర్డుల్లో సెకండరీ స్కూలు విద్యార్థుల కొరకు ప్రీ ప్రోగ్రామింగ్ మరియు ప్రోగ్రామింగ్ రెండింటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తారు.

1) బోధనకు సంబంధించి మీకు స్ఫూర్తిని ఇచ్చేది ఏమిటి?
సబ్జెక్ట్‌ని ప్రొఫెషనల్‌గా తీసుకోవడానికి గాడ్జెట్లపై నాకు ఉండే మక్కువే స్ఫూర్తిని ఇచ్చింది, అందువల్ల నేను రోబోటిక్స్ బోధించడం ద్వారా నా కెరీర్‌ని ప్రారంభించాను. నేను నా స్వంత గాడ్జెట్ అయిన డెల్ ల్యాప్‌టాప్‌పై ప్రారంభించాను.

2) చదువు కొరకు కంప్యూటర్- ఈ భావనను మీరు ఎలా అర్ధం చేసుకుంటారు?
ప్రతిదీ కూడా ఒకే సర్వర్‌పై లభిస్తుంది, ఇది టీచర్ గొప్పగా బోధించడానికి దోహదపడుతుంది. మనం పరిశోధించాల్సిన లేదా నేర్చుకోవాల్సిన విషయాలు ఆన్లైన్లో లభ్యం అవుతాయి. మనం వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఒక కంప్యూటర్ అవసరం అవుతుంది.

3) బోధనలో మీరు కంప్యూటర్ని ఎలా ఉపయోగిస్తారో మాకు చెప్పండి
రోబోటిక్స్ మరియు సెన్సార్ల కొరకు యూట్యూబ్ వీడియోలు ఉపయోగిస్తాను. విజువల్ మీడియా ఎల్లప్పుడూ చెరిగిపోని విధంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి దోహదపడుతుంది. అందువల్ల నా టీచింగ్‌లో నేను చిత్రాలు మరియు వీడియోలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను.

4) ఖచ్చితమైన లెసన్ ప్లాన్ రూపొందించడానికి మీకు ఖచ్చితంగా అవసరమైన మూడు విషయాలు ఏమిటి?
నా డెల్ ల్యాప్‌టాప్, ఆసక్తికరమైన టాపిక్ మరియు శోధించే మైండ్.

5) క్లాసును ఉత్సాహవంతంగా మార్చడానికి ఒక టీచర్ ఏమి చేయాలి?
క్లాస్ రూమ్ వాతావరణం ఇంటరాక్టివ్‌గా మరియు శోధించే విధంగా ఉండాలి?

6) భారతదేశంలో బోధనావృత్తిలో ఎటువంటి మార్పులు రావచ్చు అని భావిస్తున్నారు?
ఇది మరిముఖ్యంగా, మన దేశాలో ఎంతో పురాతనమైన మరియు గౌరవప్రదమైన వృత్తి. దీనిలో ఇంకా సృజించని ఎన్నో కోణాలున్నాయి. అయితే స్మార్ట్ క్లాసులు ఖచ్చితంగా భవిష్యత్తు టీచింగ్ ప్రోగ్రామింగ్‌లో భాగం కానున్నాయి.

7) మీ కెరీర్‌ని పెంపొందించుకోవడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
నిరంతరం మారుతున్న టెక్నాలజీ విషయంలో నేను నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను.

8) ఒక మామూలు ప్రశ్న ఏమిటంటే, మీకు సెలవు ఉన్న రోజుల్లో ఏమి చేస్తారు?
నేను లైఫ్‌స్టైల్ బ్లాగర్ని మరియు నా టైమ్‌ని ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆన్లైన్లో గడుపుతాను.

9) మీ క్లాసులో ఒక విద్యార్ధి అడిగిన అత్యంత హాస్యపూర్వకమైన ప్రశ్న ఏమిటి?
నేను నా క్లాస్‌రూమ్‌కు కంప్యూటర్ని మొదటిసారిగా తీసుకెళ్లినప్పుడు, ఒక విద్యార్ధి ఇలా అడిగాడు: ‘‘మీరు మాకు సినిమాలు చూపిస్తారా?’’ వీడియోల ద్వారా నా కాన్సెప్ట్‌లను నేను వివరించడం ప్రారంభించినట్లయితే, నా విద్యార్థులు నేర్చుకోగలుగుతారని అర్థం చేసుకున్నాను.

10) మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మీరు ఏమి చేస్తున్నారు?
నేను సైంటిఫిక్ డెవలప్మెంట్ల పట్ల పూర్తి ఆసక్తిగా ఉంటాను, వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తాను.

11) భారతదేశంలో పెరుగుతున్న అవసరాలను మీరు ఏవిధంగా పరిష్కరిస్తారు?
ప్రతి సగటు భారతీయ విద్యార్ధి చాలా స్మార్ట్‌గా మరియు శోధించే లక్షణాలను కలిగి ఉంటారు. వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మరియు మెరుగుపరుచుకోవడానికి సహాయపడాల్సి ఉంది. అదేవిధంగా, వారి అలవాట్లుకు మద్దతు ఇవ్వడం మరియు సంభావ్య కెరీర్ అవకాశంగా దానిని ఎలా మార్చుకోవాలనే దానిపై మార్గదర్శనం చేయాలి.

12) చదువుకు సంబంధించి ఆరంభ్- పిసి అనే డెల్ కార్యక్రమం గురించి మీరు ఏమనుంటున్నారు? దీనిలో మీరు భాగం కావాలని అనుకుంటున్నారా?
ఇది గొప్ప కార్యక్రమం అని అనుకుంటున్నాను, దీని ద్వారా అనేకమంది ప్రయోజనం పొందవచ్చు. నేను దీనిలో భాగం కావాలని అనుకుంటున్నాను.