డిజిటల్ పేరెటింగ్ కొరకు అత్యావశ్యకమైన చెక్‌లిస్ట్

 

పేరెంటింగ్:

ఇది ఒక ఉద్యోగంలాంటిది- ఇది ఫుల్ టైమ్, 24/7 పనిచేయాల్సిన ఉంటుంది.

మీరు కోరుకున్నా, కోరుకోకపోయినా, మీ పాత్రలో చాలా ‘‘సాంకేతికత’’ ఇమిడి ఉంటుంది.

ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, మీరు డిజిటల్ పేరెటింగ్ ప్రో ఎలా కాగలరు?

 

1. అది మీతోనే ప్రారంభం అవుతుంది.

ఒకవేళ మీకు ఏదైనా అర్ధం కానిది ఉన్నట్లయితే- పరిశోధించండి. మీ అంతట మీకు అవగాహన పెంపొందించుకోవడానికి, ఇతర తల్లిదండ్రులు, మీ పిల్లల టీచర్లు, సహోద్యోగులు, పొరుగువారు మరియు మీ నెట్ వర్క్ లో ఉండే ప్రతిఒక్కరితో మాట్లాడండి. మీరు ఎప్పుడూ మీ బిడ్డ పిసి వనరులు చూడటానికి ముందే వాటిని తనిఖీ చేయడం అనేది తరువాత దశ.

 

2. మీరు మీ చిన్నారికి రోల్ మోడల్ వలే నిలుస్తారు.

మీరు వారి మొదటి సూపర్ హీరో. మీరు ఏమి చేసినా, ఒక ఉదాహరణగా నిలవండి. ఒకవేళ మీ బిడ్డ టివిని ఎక్కువగా చూసినా లేదా పరికరాలపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్న విషయాన్ని పట్టించుకోనట్లయితే- మీ బిడ్డ అది ఫర్వాలేదు అని భావిస్తాడు. ఒకవేళ మీ బిడ్డ సరైన సంతులనాన్ని చూడటంతోపాటుగా సరైన భంగిమని కలిగి ఉన్నట్లయితే, మీ బిడ్డ మీ అడుగుజాడలను అనుసరిస్తారు.

 

3.  సాయం చేయడానికి పేరెంటల్ నియంత్రణ అవసరం.

పిసిపై మీ బిడ్డ కొరకు విభిన్న యూజర్ ప్రొఫైల్ సెట్ చేయడంతో ప్రారంభించండి మరియు తరువాత నెమ్మదిగా ప్రతి వెబ్ సైట్ కు నావిగేట్ చేయండి. Google మరియు YouTube లు ప్రధానమైనవి, ఇటువంటి కంట్రోల్స్ ని మీరు సెట్ చేసినట్లయితే, మీరు కాస్తంత ఉపశమనం పొందవచ్చు.

 

4. మళ్లీ గొప్పగా చేసే నిబంధనలను రూపొందించండి.

నియంత్రణకు ఎవరు ఇష్టపడరు? మీరు మీ బిడ్డ స్వంత నిబంధనలను రూపొందించుకునేలా చేసినట్లయితే- వాటిని అధిగమించడం అనేది ప్రశ్న కాదు. కూర్చుని, వాటిని రాయండి. మీ కంప్యూటర్ కు బలమైన పాస్ వర్డ్ ఏర్పాటు చేసి, దానిని వారితో పంచుకోండి, అలానే బాగా శోధించిన వెబ్ సైట్ ల బుక్ మార్క్ లు పంచుకోండి, కారణాన్నివివరించి కంప్యూటర్ ని రోజుకు గంట లేదా రెండు గంటలు మించి ఉపయోగించకుండా చూడండి.

 

5. సామాజికంగా ఉండటం మంచిదే.

వాస్తవానికి, ఇది గొప్పది.

అయితే, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డకు ఎలాంటి సీక్రెట్ అకౌంట్ లు లేకుండా జాగ్రత్త వహించండి.

మరోవైపు, మీ బిడ్డలకు వారి స్వంత స్థలాన్ని మీరు అందించాల్సి ఉంటుంది- వారి కంటెంట్ మరియు పోస్ట్ లపై వారి వ్యాఖ్యలను ఎక్కువగా విశ్లేషించవద్దు.

మీరు మరియు మీ చిన్నారి ఒకరినొకరు నుంచి నేర్చుకోవాలి. మీ అనుభవాలను పంచుకోండి మరియు మీతో కమ్యూనికేట్ చేసేలా మీ చిన్నారిని ప్రోత్సహించండి. చివరికి, టెక్నాలజీని ఉపయగోంచడం మరియు ఇతరులతో కలిసి సరదాగా సాగడం మంచిగా ఉంటుంది.