టీచింగ్ వృత్తి భవిష్యత్తు నాకు ప్రకాశవంతంగా కనిపిస్తోంది

 

విభా కాగ్జికి హార్డర్డ్ బిజినెస్ స్కూలు నుంచి ఎమ్బిఎ డిగ్రీ ఉంది. అలానే 2018 ఉమన్ ఎకనామిక్ ఫోరంలో ‘వుమన్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డును గెలుచుకున్నారు. విభా ReachIvyని రూపొందించారు.

1) ‘‘చదువు కోసం కంప్యూటర్’’ అనే భావనను మీరు ఎలా అర్ధం చేసుకుంటారు?

చదువు ద్వారా సామాజిక సమానత్వం అనేది విధంగా టెక్నాలజీ అనేది దీనికి ఉత్ప్రేకంగా పనిచేస్తందని నేను విశ్వసిస్తాను. 200-500 పేజీల సమాచారం ఉండే సంప్రదాయ టెక్ట్స్ బుక్‌లు ఉంటే, ఒక కంప్యూటర్లో మిలియన్ కొలదీ టెక్ట్స్ పుస్తకాలుంటాయచి మరియు ఒకసరికొత్త ప్రపంచంలోని ద్వారాలను తెరుస్తుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ఇది అభ్యసన మరియు ఎదుగుదలను వేగవంతం చేస్తుంది.

“ఒక గ్రామీణ ప్రాంతాల్లో చదువు కోసం కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, అత్యుత్తమ నాణ్యత కలిగిన విద్య కొరకు విద్యార్ధులు మైళ్ల దూరంగా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు మరియు ఏ గ్రేడ్ కంటెంట్ మరియు టీచర్లను విద్యార్థులు ఇళ్లు/స్కూళ్లకు తీసుకొని రావొచ్చు. ”

2) బట్టీ పట్టడం- దీని గురించి ఏమి చేయాలి?

ప్రాచీన చైనీస్ తత్త్వవేత్త కన్ఫ్యూషియస్ ఇలా అన్నారు “నేను వింటే మర్చిపోతాను, నేను చూస్తే గుర్తుంచుకుంటాను మరియు నేను చేస్తే నాకు గుర్తుంటుంది”.

బట్టీ పట్టే అభ్యసన విధానం ఎందుకు మారాలనే దానిని ఇది వివరిస్తుంది. మనం స్కూల్లో నేర్చుకున్న పైథాగరస్ సిద్ధాంతం వాస్తవంగా ఎంతమందికి గుర్తుంది? చాలా తక్కువమంది!

పిల్లవాడు తాను నేర్చుకునే విషయాలను అనుభూతి చెందడం, చూడటం మరియు చేయడం కొరకు సంస్థలు అనుభూతి చెందే అభ్యసన, థియరీని అనువర్తించడం, క్లాసులో పాల్పంచుకోవడం, ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు మరియు పరిక్షేతర కార్యక్రమాకు పాఠశాలలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.

అయితే, ఇవన్నీ కూడా రాత్రికి రాత్రి మారవు అనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను అయితే మనం సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

3) అభ్యసనతో విద్యార్థుల సంబంధాన్ని టీచర్లు ఏవిధంగా మెరుగుపరచగలరు?

“విద్యార్దులతో సంబంధాన్ని మెరుగుపరచడం కొరకు టీచర్లు క్లాస్రూమ్ అనుభవాన్ని, ఒకవైపు నాలెడ్జ్‌ని బదిలీ చేసేవిధంగా కాకుండా టూ వే ఇంటరాక్టివ్ సెషన్గామార్చాలి. ”

టీచర్లు సబ్జెక్ట్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాలి. మనకు సబ్జెక్ట్‌ని బోధించే టీచర్ ఆ సబ్జెక్ట్‌ని ఆసక్తికరంగా చెప్పడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్‌పై ప్రేమ పుడుతుంది. మార్కులను కేవలం అంకెలుగా మాత్రమే పరిగణించాలి మరియు పిల్లవాడి నైపుణ్యాల సంపూర్ణ అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి. చివరిగా, టీచర్లకు తమకు ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోరాదు మరియు ప్రతివిద్యార్ధినిసమానంగా చూడాలి, ఎలాంటి పక్షపాతం లేకుండా అతడి/ఆమె శ్రద్ధను పంచుకోవాలి.

4) టీచర్‌కు ఉండాల్సిన మూడు ముఖ్యమైన నైపుణ్యాలు ఏమిటి?

1. ఇంటరాక్టివ్ క్లాస్రూమ్ సెషన్, సబ్జెక్ట్‌పై నైపుణ్యం మరియు సక్రమంగా కమ్యూనికేట్ చేయడం.
2. నేర్చుకోవడానికి మరియు టెక్ట్స్ పుస్తకాలు బోధించేదానికంటే మరింత ఎక్కువ బోధించడానికి ఇష్టపడటం నాలెడ్జ్‌ని నిరంతరం పెంచుకోవడం.
3. సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా పిల్లలను ప్రోత్సహించే సామర్ధ్యం, బలమైన అంత: వ్యక్తిగత నైపుణ్యాలు మరియు విద్యార్ధి నుంచి నమ్మకం మరియు గౌరం పొందే సామర్ధ్యం.

5) భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

గతంలో టీచర్లు కేవలం టెస్ట్ బుక్‌లో ఉండే విషయాలను మాత్రమే చెప్పారు ఇప్పుడు ఇంటరాక్టివ్‌గా ఉండే విద్యారూపంలోనికి వ్యవస్థ మారింది. టీచింగ్ వృత్తి భవిష్యత్తు నాకు ప్రకాశవంతంగా కనిపిస్తోంది- ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగాలు రెండూ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

6) విద్యార్ధుల్లో పెరుగుతున్న అవసరాలను మీరు ఏవిధంగా పరిష్కరిస్తారు.

ReachIvy.com అనేది విద్యార్ధుల మెదడులో ఉండే చెత్తను తొలగించి, వారి ప్రొఫైల్‌కు తగిన కెరీర్‌పై దృష్టి సారించేందుకు దోహదపడుతుంది.