కంఠస్థం చేయడం కాకుండా, నేర్చుకోవడానికి సరైన పద్ధతి


భారతయ విద్యా వ్యవస్థలో విద్యార్థులు కంఠస్థం చేస్తూ నేర్చుకోవడం అనేది సర్వ సాధారణం. ఇది విద్యార్థులు  చదివింది గుర్తు తెచ్చుకోవడానికి మరియు జ్ఞాపకం పెట్టుకోవడంలో సహాయపడటానికి పునరావృతం చేయడం పై ఆధారపడే ఒక ధారణ పద్దతి. అయితే, ఈ విధమైన అభ్యాసం అర్ధం చేసుకోవడానికి బదులుగా భావనలను గుర్తుపెట్టుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.

అత్యవసర సమస్య

భారతీయ విద్యా వ్యవస్థ నిర్వచనాలు, భావనలు, సూత్రాలు మరియు వాస్తవాలను గుర్తుంచుకోవడం పై దృష్టి పెడుతుంది, కేవలం 14% భారతీయ తరగతి గదులు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర బోధనా సామగ్రిని ఉపయోగిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో ఉపాధి పై ప్రభావం చూపుతుంది, భారతీయ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ లలో 25% కంటే తక్కువ మంది మాత్రమే ఉద్యోగం చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.1

వాస్తవం ఏమిటంటే, ఒక విద్యార్థి ఒక భావనను కంఠస్థం చేసినప్పుడు కాకుండా, కేవలం అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే నిజ జీవితంలో దానిని అన్వయించగలడు. నేటి ‘డిజిటల్ ఇండియన్స్’ కి ఎక్కువగా కావలసిన మూడు నైపుణ్యాలు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, మరియు క్లిష్టమైన సమస్య పరిష్కారం మరియు ఇవి ఉద్యోగంలో సహాయకరంగా ఉంటాయి.

 

 

పరిష్కారం ఏమిటి?

కంఠస్థ పద్దతి ద్వారా నేర్చుకోవడం మానివేయటం. ఈ మేరకు, ప్రతి సంవత్సరము జూన్ 10 న కంఠస్థం చేయడం కాకుండా, అభ్యాసానికి సరైన మార్గాన్ని ప్రోత్సహించడానికి యాంటీ-రోట్ డే ని జరుపుకుంటాము. నేటి సాంకేతిక-ఆధారిత ప్రపంచంలో, పిసి విద్య ద్వారా అభ్యాసం యొక్క సరైన మార్గాన్ని బోధించడం సాధ్యమవుతుంది. ఈ క్రింది వాటి ద్వారా ఇది చేయవచ్చు:

 

  • ఈ-పుస్తకాలు
    ప్రస్తుత పాఠ్యపుస్తకాలు మరియు నోట్సుల పరిమాణం విద్యార్థులను భయపెట్టగలదు, కాబట్టి చిన్నవి, సంక్షిప్తమైనవి మరియు ఇంటరాక్టివ్ ఈ-పుస్తకాలను మరియు పిడిఎఫ్ లను ఇవ్వడం ముఖ్యము.  

  • ఇంటరాక్టివ్ మాధ్యమము
    ఆడియో, వీడియో మరియు యానిమేషన్ వంటివి విద్యార్థుల దృష్టిని నిమగ్నం చేయగలవు మరియు    నిలుపగలవు, ఒక భావన వారితో చాలా కాలం వరకు ఉండేలా ఇవి నిర్ధారిస్తాయి.

  • ప్రాజెక్టులు మరియు ప్రెజెంటేషన్ లు
    వ్యక్తిగత ప్రెజెంటేషన్ లు, విద్యార్థులు ఒక భావనను ఎంతవరకు అర్ధం చేస్తుకున్నారో ప్రదర్శించడానికి సహాయపడతాయి, అలాగే ఇవి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తాయి.

  • సహవిద్యార్థుల బోధన
    గూగుల్ డాక్యుమెంట్ లు మరియు వర్చువల్ చర్చలు వంటి ఆన్ లైన్ ఉపకరణాల ద్వారా, విద్యార్థులు ఒకరికి ఒకరు సహకరించుకొనవచ్చు, సృష్టించవచ్చు మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవచ్చు.

  • సందేహాలను తీర్చే సెషన్లు
    క్విజ్ లు మరియు ఫీడ్ బ్యాక్ పత్రాల  ద్వారా, విద్యార్థి ఒక భావనను ఎంత వరకు అర్ధం చేసుకున్నాడో కొలవవచ్చు, మరియు తదుపరి సందేహాలను నివృత్తి చేయవచ్చు.

  • అతిధి లెక్చరర్లు
    ఆన్ లైన్ భోధనలో భౌతిక పరిమితులు ఉండవు, దీని వలన దాదాపుగా ప్రపంచం యొక్క వివిధ భాగాల నుండి అతిధి లెక్చరర్లు విద్యార్థులకు బోధించగలరు.

 

మా ఆన్లైన్ బోధన వెబినేర్స్ ద్వారా, నిమగ్నం చేసే మరియు ఇంటరాక్టివ్ అభ్యాసానికి మీరు ఈ మార్పు జరిగేలా చేయగలరు.