ఆన్‌లైన్ అభ్యాసం కొరకు మీ నూతన సంవత్సర తీర్మానంలో చేర్చవలసిన విషయాలు

 

గత సంవత్సర కాలంగా, ప్రపంచం మొత్తం మారిపోయింది. ఈ రోజు, స్కూలింగ్, కంప్యూటర్ తెర పై జరుగుతున్నది. 2021 సంవత్సరంలో, పి సి అభ్యాసం విషయంలో మనము కొన్ని బాధ్యతాయుతమైన తీర్మానాలు చేయాలి.

పి సి విద్య కొరకు మీ కొత్త సంవత్సరం తీర్మానంలో ఈ క్రిందివి తప్పక చేర్చాలి.

ఇంటర్నెట్ భద్రతను నిర్వహించండీ

మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా మీ వ్యక్తిగత మరియు సున్నితమైన సమాచారాన్ని ఇంటర్నెట్ లో పొందుపరచకుడదని మీరు నిర్ధారించుకోవాలి. మీ తల్లిదండ్రులకు తప్ప, మీ పాస్వర్డ్ ని ఇతరులతో పంచుకోరాదు. మీరు పబ్లిక్ కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నప్పుడు, ఉపయోగించిన ఖాతాల నుండి లాగ్అవుట్ చేశారని నిర్ధారించుకోవాలి.

మీ స్క్రీన్ టైమ్ గురించి జాగ్రత్త వహించండి

వినోదం మరియు విద్య ప్రయోజనాల కొరకు మీరు ఇంటర్నెట్ సమయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఆన్ లైన్ లో గడుపుతున్న సమయం గురించి జాగ్రత్తగా ఉండండి. నిరంతరంగా ఆన్ లైన్లో గంటల సమయం గడపకండి.

ఆన్ లైన్ తరగతుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి

2021 లో, పిసి అభ్యాసాన్ని మీ ప్రయోజనం కొరకు ఉపయోగించండి. మీ ఆసక్తిని మరియు నైపుణ్యాలను ప్రోత్సహించి, మీ సామర్ధ్యాలను పెంచే, కొత్త నైపుణ్యాలను నేర్చుకునే వీలు కల్పించే తరగతులలో చేరండి మరియు మీ సమయాన్ని మీ అదుపులో ఉంచుకోండి.

ఆన్ లైన్ లో ఇతరులతో మంచిగా వ్యవహరించండి

ద్వేషపూరిత ప్రసంగం మరియు నీచమైన వ్యాఖ్యలు ఈ రోజులలో ఇంటర్నెట్ పై ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలలో పాల్గొనకండి మరియు ప్రతి ఒక్కరికి 2021 ని సానుకూల సంవత్సరం అయ్యేలా చూడండి. ఉత్తేజాన్నిచ్చే మరియు ప్ర్తోత్సహించే ట్వీట్లు, పోస్టులు, మరియు వ్యాఖ్యలతో ఇంటర్నెట్ ను సురక్షితమైనదిగా చేయండి.   

మిగిలిన సంవత్సరం మొత్తం ఈ తీర్మానాలకు కట్టుబడి ఉండాలని నిర్ధారించుకోండి మరియు ఇంటర్నెట్ ను అభ్యాసం కొరకు బాధ్యతాయుతంగా ఉపయోగించండి.