మీరు చేరాల్సిన అవసరం ఉన్న మూడు ఆఫ్టర్ స్కూలు క్లబ్‌లు

 

స్కూలుకు సంబంధించి సలహా ఇవ్వమని మీ సీనియర్లను అడిగినట్లయితే, చదువును మరింత సీరియస్‌గా తీసుకోవాలని, అలానే స్థిరంగా ఒక ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీలో పాల్పంచుకోవాలని సలహా ఇస్తారు. మీరు పాల్గొనడం ద్వారా, కాలేజీ అడ్మిషన్ల సమయంలో మిమ్మల్ని ఆల్‌రౌండ్ స్టూడెంట్‌గా భావించడమే కాకుండా, ఈ రెండు ప్రపంచాల్లో మీ గురించి అత్యుత్తమంగా మిమ్మల్ని మీరు చాటుకోవడానికి దోహదపడుతుంది.

ఒకవేళ మీ స్కూలులో లేనట్లయితే ప్రారంభించడానికి లేదా మీరు చేరదగ్గ మూడు ఆఫ్టర్ స్కూలు క్లబ్‌లు.

 

1) కోడింగ్: ఆన్లైన్లోని ప్రతిదానికి పునాది

భారతదేశానికి వెలుపల, 15 సంవత్సరాల రావడానికి ముందే ప్రతి ముగ్గురు విద్యార్ధుల్లో ఒకరు కోడింగ్ చేయడం నేర్చుకుంటున్నారు. భారతదేశంలో ప్రతి 10మందిలో ఒకరు మాత్రమే కోడింగ్ నేర్చుకుంటున్నారు.[1] Scratch, Code మరియు Codecademy వంటి వెబ్సైట్ల సాయంతో స్కూలు తరువాత మీరు ప్రాథమికాంశాలను నేర్చుకోవడం ద్వారా మీరు అందరికంటే ముందు ఉండవచ్చు. మీ గ్రూపు ఎంత చిన్నదైనప్పటికీ మీకు వైఫై కనెక్షన్‌తో కూడిన కంప్యూటర్ ఉన్నట్లయితే, మీరు ప్రారంభించవచ్చు.

 

2) కళలు: మీలో ఉండే సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి

“ప్రతి పిల్లవాడిలో ఒక కళాకారుడు ఉంటాడు, అయితే, మీరు ఎదిగినప్పుడు ఆ కళాకారుడిని అలానే ఉంచడం అనేది సమస్య” – ప్లాబో పికాసో

ఒకవేళ ఆయిల్ పెయింటింగ్ లేదా మీ చేతితో స్కేచ్ గీయడం చేతకానట్లయితే, ఆర్ట్ క్లబ్లో డిజిటల్‌గా ఆర్ట్ గీయడానికి మీ చేతిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీరు ప్రారంభించడం కొరకు Sketch, YouiDraw మరియు Pixilart వంటి కొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫారాలు ఉపయోగించవచ్చు- మీ కంప్యూటర్ మీకు ఇంకా ఎన్నింటినో అందిస్తుంది. ఆర్ట్ క్లబ్‌కు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్లడంతోపాటుగా, అదేపనులు పూర్తి చేసిన భావన కలుగుతుంది.

 

3) సంగీతం: మరింత సహనంగా ఉండేవిధంగా మీ మెదడును తీర్చిదిద్దండి

మీ సహనంగా ఉండటం అనేది అదృష్టం, మీ చదువు, ఆటలు, మీ సామాజిక జీవితం అలానే ఇంటి వద్ద ఇలా అన్ని విషయాల్లో ఇది సహాయపడుతుంది. పాటలు రాయడం, ఒక సంగీత పరికరాన్ని వాయించడం లేదా పడటం ఇలా మీలోని సంగీత సామర్ధ్యాన్ని సాధన చేయడం ద్వారా- మీ కళలో నిష్ణాతులు కావడం కొరకు మీరు ఎన్ని ఎక్కువ సమయం గడుపుతారో, అంత ఎక్కువ సహనశీలిగా మారతారు. మీ ఆప్టర్ స్కూలు క్లబ్లో YouTube ట్యూటోరియల్స్ ఇంకా LMMS వంటి వాటిని చూడటం ద్వారా మీకు నచ్చిన సంగీత పరికరాన్ని వాయించడం నేర్చుకోవచ్చు.

ఈ కార్యకలాపాల్లో ఏదో ఒకటి మీ కెరీర్ అవుతుందని ఎవరు చెప్పగలరు?

 

గమనిక: అత్యుత్తమ విద్యా సంవత్సరం కొరకు ఇంటి వద్ద మరియు స్కూలు వద్ద మీ కంప్యూటర్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోండి.