మీ బిడ్డ చదువుకోవడానికి మూడు సమర్దవంతమైన మార్గాలు

 

చదివే విషయానికి సంబంధించి ప్రతి పిల్లవాడి శైలి భిన్నంగా ఉంటుంది, కొంతమంది విద్యార్ధులు సబ్జెక్ట్‌పై తమకు ఉండే ఇష్టం వల్ల వారు కష్టపడి చదువుతారు. కొంతమంది అలా చదవరు. తల్లిదండ్రులుగా, మీరు మీ బిడ్డకు అత్యుత్తమైన దానిని మాత్రమే కోరుకుంటారు, తమ భావి జీవితానికి అభ్యసన దోహదపడే విధంగాఒక దీర్ఘకాలిక మరియు సానుకూల సంబంధాన్ని ఏర్పరుచుకోవాలని భావిస్తారు.

పరీక్షలు మరింత ఒత్తిడి పూర్వక వ్యవహారంంగా మారడం వల్ల, దిగువ రుజువు చేయబడ్డ మరియు సమర్ధవంతమైన విద్యా విధానాలు మీ బిడ్డ మరింత ఆత్మవిశ్వాసంతో మరియు సమర్ధవంతంగా సిద్ధం అయ్యేందుకు దోహదపడుతుంది:

1. ప్రాక్టీస్ టెస్టింగ్

చదవడానికి సంబందించిన అత్యంత సాధారణ రూపం, ఎందుకంటే ఇది మీ బిడ్డకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రశ్నాపత్రాలను మళ్లీ మళ్లీ సాల్వ్ చేయడం వల్ల మీ బిడ్డ సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి మరియు ప్రతిసారి మీ బిడ్డ మరింత మెరుగ్గా చదివేందుకు అవసరమైన స్ఫూర్తిని అందిస్తుంది. అలానే, మీ బిడ్డ మళ్లీ నేర్చుకోవాల్సిన ఛాప్టర్లు గుర్తించడానికి దోహదపడుతుంది.

టీచర్లు గూగుల్ ఫోరమ్‌లు ద్వారా క్విజ్‌లను అందించవచ్చు, అలానే విద్యార్ధులు సబ్జెక్ట్ నిర్ధిష్ట వెబ్సైట్ల నుంచి ప్రాక్టీస్ టెస్టులను పొందవచ్చు.

2. ప్రాక్టీస్‌ని విభజించడం

పెద్దమొత్తంలో సబ్జెక్ట్ మెటీరియల్‌ని ఎక్కువ కాలం చదవకుండా, నియతానుసారంగా బ్రేక్‌లు తీసుకోవడం కొరకు చిన్నచిన్న ఛాప్టర్లుగా విభజించడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తాము నేర్చుకున్న కొత్త సమాచారాన్ని శోషించుకోవడానికి వారు మెదడుకు తగినంత సమయం ఇస్తారు. ఉదాహరణకు, మీ బిడ్డ పూర్తిగా సిలబస్‌ని ఒకేసారి పూర్తి చేయడంకంటే, ప్రతి గంటకు చిన్నపాటి బ్రేకుతో సరదాగా ఒక రోజులో మొత్తం జాగ్రఫీ పోర్షన్ పూర్తి చేయగలడు. బ్రేక్‌లు స్ఫూర్తిని అందించే TED టాక్‌లు లేదా ఎడ్యుకేషనల్ స్పోర్సెల్ గేమ్‌లు వలే ఉండవచ్చు.

ఒక షెడ్యూల్‌ని ఏర్పాటు చేయడం, బ్రేకుల కొరకు పట్టే సమాయాన్ని లెక్కించడం అనేది ఇక్కడ కీలకం.

3. శోధించడాన్ని విస్తరించడం

ప్రతి సిద్ధాంత వెనక ‘‘ఎందుకు’’అని కనుగొనే ప్రక్రియ వలే దీనిని నిర్వచించవచ్చు. గూగుల్ స్కాలర్ వంటి కంప్యూటర్ ఆధారిత టూల్స్ మీ బిడ్డ ప్రారంభించడానికి మరియు సబ్జెక్ట్ విషయాలను మరింత లోతుగా తెలుసుకోవడానికి దోహదపడతాయి. ‘‘ఎందుకు’’ అని తెలుసుకోవడం ద్వారా మీ బిడ్డ తరగతి గదిలో బోధించిన విషయాలను వాస్తవ ప్రపంచంలో ఏవిధంగా అనువర్తించబడతాయని తెలుసుకుంటారు.

పిల్లలు తమ స్వంత వేగంతో ఈ విషయాలను తెలుసుకోవడంతోపాటుగా మరింత మెరుగ్గా భావనలు అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది.

మీ బిడ్డ బట్టీ పట్టి చదవడానికి ప్రత్యామ్నాయాలున్నాయి - ఒక కంప్యూటర్ మరియు మీ సపోర్ట్‌తో దీనిని సాధించవచ్చు.