మీరు ఫాలో అవ్వాల్సిన ముగ్గురు చిన్నారి యూట్యూబర్‌లు

 

మీకు ఆసక్తికలిగించే ఏదైనావిషయం గురించి మీరు యూట్యూబ్ లో కంటెంట్ ని రూపొందించవచ్చు.

- తెలియని వ్యక్తి

మీరు యూట్యూబ్ ని ఇష్టపడతారా? మీరు సంగీతం వినడానికి, ఫన్నీ వీడియోలు చూడటానికి, చదువు లేదా అసైన్ మెంట్ లు పూర్తిచేయడానికి వెళ్లే ప్రదేశం ఇది.

కెమెరా వెనుక ఉండ వ్యక్తి ఈ శ్రమ అంత పడి, ఇంటి వద్ద ఉండే కంప్యూటర్ పవర్ తో లక్షలాది మందికి స్ఫూర్తిని అందిస్తుంటాడు. ఒక య్యూట్యూబర్ తన సరళమైన ఆలోచనలను అమల్లోకి తీసుకొని రావడం ద్వారా తనదైన ముద్ర వేస్తారు, మీ కొరకు కొంత స్ఫూర్తిదాయక సమాచారం ఇదిగో:

  • అమర్ తో నేర్చుకోవడం

భారతదేశానికి చెందిన అమర్ తొగాటి, అత్యంత పిన్నవాడైన మరియు అత్యంత ప్రజాదరణ కలిగిన యూట్యూబర్ ల్లో ఒకడు, అతడు జాగ్రఫీ పాఠాలను ఎంతో వినోదాత్మకంగా, ఆకట్టుకునేవిధంగా చెబుతాడు, చదవడానికికంటే మీరు ముచ్చటిస్తున్నట్లుగా భావించేలా చేస్తుంది. అతడు తన 10 సంవత్సరాల వయస్సులో అంటే 2016లో తన యూట్యూబ్ ఛానల్ ‘‘లెర్న్ విత్ అమర్’’ ప్రారంభించాడు.

ప్రస్తుత అతడి సబ్ స్క్రైబర్ లసంఖ్య  – 281,021

  • కైరాస్ స్కోప్ టాయ్ రివ్యూలు

కైరాస్కోప్ టాయ్ రివ్యూస్ అనేది ఒక ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఛానల్, దీనిని 2016లో ఏడు సంవత్సరాల వయస్సున్న కైరా అనే బాలిక ప్రారంభించింది. ఆమె ఛానల్ లో బొమ్మలకు సంబంధించిన అనేక రివ్యూలతోపాటుగా, చిన్న కథలు, స్పూర్తిదాయక అంశాలు కొన్ని సరదా కుటుంబ క్షణాలు ఉంటాయి- ప్రాథమికంగా ఇది మీకు ‘ఎడ్యుటైన్ మెంట్’ ప్యాకేజీలాంటిది.

ప్రస్తుత అతడి సబ్ స్క్రైబర్ లసంఖ్య  – 11,622 

  • టెక్ రివ్యూ రోనిత్ సింగ్

రోనిత్ వయస్సు కేవలం 14 సంవత్సరాలు మరియు అతడు భారతదేశానికిచెందిన అత్యంత పిన్నవయస్సు కలిగిన టెక్ యూట్యూబర్, అతడు తన ఛానల్ ని 2015లో ప్రారంభించాడు. అతడు తన వద్ద ఉండే వస్తువులను విప్పదీసి, సమీక్షిస్తాడు మరియు పరికరాలతో హ్యాండ్ ఆన్ రివ్యూలను చేస్తాడు, ఇది అన్ని  సాంకేతిక వస్తువులపై ప్రతిఒక్కరికి ఒక ప్రత్యేక భావన కలిగిస్తుంది.

ప్రస్తుత అతడి సబ్ స్క్రైబర్ లసంఖ్య  – 2637

మీలాంటి ఈ పిల్లలకు సంబంధించిన  కథలను మీరు ఇప్పుడు చదివారు, ఇలాంటి మీరు కూడా చేయాలనే ఉత్సాహం మరియు స్ఫూర్తి మీకు కలిగాయా?

గమనిక: ఇంటర్నెట్ ఐస్ బర్గ్ లో యూట్యూబ్ అనేది ఒక చిన్న కొన మాత్రమే. కంప్యూటర్ మీకు ఇష్టమైన బొమ్మ, మీ లైబ్రరీ మరియు ఒక్క క్లిక్ తో వినోదాన్ని అందించే ఉపకరణం కావొచ్చు. ఇంటి వద్ద కంప్యూటర్ ఉండటం వల్ల మీరుఉత్పాదకంగా ఉండేందుకు మరియు మీ లైబ్రరీని దాటి నాలెడ్జ్ ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది.