పిల్లలు ఇష్టపడే మూడు మేకర్ ప్లేస్ ప్రాజెక్ట్‌లు

 

మార్కర్‌స్పేస్‌లో విద్యార్థులు వివిధ రకాల టూల్స్ మరియు మెటీరియల్స్ ఉపయోగించి ప్రయోగాలు సృష్టించవచ్చు మరియు అన్వేషించవచ్చు. [1]ఈ స్పేస్‌లో తాము స్కూలులో నేర్చుకున్న థియరీలను మాత్రమే అనువర్తించడమే కాకుండా, కొత్త విషయాలను సైతం నేర్చుకునేందుకు దోహదపడుతుంది. పిల్లలుగా మార్కర్ స్పేస్‌లో ఒక నిర్ధిష్ట కరిక్యులం అనుసరించకుండా, వారు తయారుచేయడం ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పించబడుతుంది.

ఈ మూడు మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్‌లు మీ బిడ్డ  మార్కర్ స్పేస్‌లో చేరినప్పుడు వారు ఏవిధంగా నేర్చుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఒక అవగాహన కలిగిస్తాయి. ఈ ప్రాజెక్టులు అవగాహన పరంగానే మాత్రమే కాకుండా, అవి గొప్ప వినోదాన్ని సైతం అందిస్తాయి.

1. 4 వీల్ బెలూన్ కారు

ప్రాజెక్ట్ పిల్లలకు వినోదం మరియు అవగాహన రెండూ కలిగిస్తుంది. విద్యార్థి టెక్ట్స్ పుస్తకాల్లో చదివే మూమెంటమ్, ఫోర్స్, ఫ్రిక్షన్ మరియు వేగం అనే భౌతిక శాస్త్ర పదజాలం బెలూన్‌లు, స్ట్రా, బాటిల్స్ మరియు టేపు వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అది మాత్రమే కారకుండా, పిల్లలు ఇంటిలో ఉండే పాత వస్తువులను తమ ప్రాజెక్ట్‌కు తిరిగి ఉపయోగించుకోవడం వల్ల, వారు తమ నిర్ణయాలపై పర్యావరణ పన్రభావం గురించి కూడా అర్థం చేసుకోగలుగుతారు.

2. ఆర్గనైజర్‌గా లెగో

లెగో అనేది ఒక వినోదాత్మకమైన మరియు వైవిధ్య భరితమైన మార్కర్ స్పేస్ మెటీరియల్, దీనిని అనేక విషయాలను రూపొందించడానికి ఉపయోగిస్తారు. మీ బిడ్డ స్టేషనరీ, కాయిన్స్, మార్బెల్స్, ఛార్జింగ్ కబేుల్స్ మొదలైన వాటి కొరకు ఆర్గనైజర్‌గా రూపొందించవచ్చు,వివిధ రకాలైనన సైజుల్లో కోసి,వాటిని కలపడం ద్వారా హాలో స్పేస్‌లో వాటిని నిల్వ చేయవచ్చు. దీని వల్ల పిల్లలు నిజజీవితంలోని ఆకారాలు, కొలతలు మరియు స్థలాలు వంటి జ్యామితీయ భావనల గురించి మరింత తెలుసుకునేందుకు దోహదపడుతుంది.

3. సంప్రదాయ గ్రీటింగ్ కార్డు

అనుభవం వల్ల పిల్లలు సమగ్రంగా నేర్చుకోవడానికి మరియు స్కూలులో బోధించిన భౌతిక శాస్త్ర పాఠాలను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. కండిక్టివ్ గ్రీటింగ్ కార్డు తయారు చేయడం అనేది ఒక అద్భుమైన మార్గం, దీనిలో పిల్లలు పవర్ సమర్థత, ఎలక్ట్రికల్ యూనిట్‌లు మరియు ఎలక్ట్రికల్ ఓల్టేజి వంటి సిద్ధాంతాలను తల్లిదండ్రులు లేదా సూపర్‌వైజర్‌ల పర్యవేక్షణలో నేర్చుకోవడం మరియు విజువలైజ్ చేయడానికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్ట్ విద్యార్థులు ఎలక్ట్రికల్ సప్లైల గురించి అవగాహన కలిగి ఉండటంతోపాటుగా ప్రత్యేక సందర్భాల్లో సృజనాత్మకతను అందిస్తుంది.

ప్రతి మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్ మీ బిడ్డ నేర్చుకోవడానికి కొత్తదాన్ని అందిస్తుంది. దీని వల్ల ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేశామననే భావన కలగుతుంది. ఇంకా,పిల్లవాడు తగినఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు మరియు నేర్చుకోవడం కొరకు తరువాత ప్రాజెక్ట్‌ని తీసుకునేందుకు స్ఫూర్తి లభిస్తుంది. మార్కర్ స్పేస్‌లు అనేవి భవిష్యత్తుకు లైబ్రరీలు, ఇవి తయారీ భావనను మీ బిడ్దలో రూపొందిస్తాయి, ఇది మీ బిడ్డ సాంకేతికంగా ముందుకు సాగుతున్న ఈ ప్రపంచంలో సరైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సహాయపడుతుంది.

మీ బిడ్డ మార్కర్‌స్పేస్ ప్రాజెక్ట్‌ని ప్రయత్నించాడా? మీ సృజనాత్మకతను ట్విట్టర్‌లో  #DellAarambh ఉపయోగించి పంచుకోండి.