2018లో ప్రతి డిజిటల్ తల్లి-తండ్రి చేయాల్సిన మూడు పనులు

 

ఒక తరం ముందు గనుక చూసుకుంటే, ఎవరో కొద్ది మంది మాత్రమే కంప్యూటర్ వాడేవారు. మరి, ఈ రోజున, స్క్రీన్ వంక చూడకుండా రోజు గడవదు. అది మీ ఫోన్ కావచ్చు, టాబ్లెట్ లేదా పిసి ఏదైనా సరే. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.

2018లో ప్రతి ఒక్క డిజిటల్ తల్లి-తండ్రి ఈ మూడు పనులు చేయాలి.

1) ఉమ్మడిగా నిర్ణయం తీసుకోండి

సామాజిక మాధ్యమంతో గందరగోళానికి గురవుతున్నారా? లేక మీరు చదివిన వార్తలను ఫిల్టర్ చేయాలనుకుంటున్నారా? మీ చిన్నారితో కలుపుగోలుగా ఉండడం ద్వారా బంధాన్ని మెరుగుపరచుకోవడం మరియు అదే సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం మేలు చేస్తుంది. ఆ క్రమంలో, పిసిని వాడుకోవడాన్ని మీ పిల్లలు సర్వసాధారణ కుటుంబ చర్యగా భావిస్తారు మరియు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే సందేహాలు తీర్చడానికి వెనకాడకండి.

2) కలుపుగోలుగా ఉండండి

పిసిని ఉమ్మడిగా వాడుకోవడానికిగాను కలుపుగోలుగా ఉండాలి. మీరు తమపై నిఘా వేసి ఉంచడాన్ని పిల్లలు ఇష్టపడకపోవచ్చు. కానీ, వారితో తాజా సంస్కృతి మార్పుల గురించి, వీడియో క్లిప్లు, ప్రముఖుల వార్తలు, సినిమాలు మరియు స్నేహితుల విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడితే వారు కలగలిసి పోతారు.

3) ఆధునీకరణ, ఆధునీకరణ మరియు ఆధునీకరణ!

మీ చిన్నారి ఫిజిక్స్పై వారం రోజులు కష్టపడి ప్రెజెంటేషన్ రూపొందిస్తే, చివరలో సేవ్ చేసుకునే సమయంలో, పిసి క్రాష్ అయిపోయిందనుకోండి, ఎలా ఉంటుందో ఊహించండి.

మీ పిల్లలు దేవివల్లనైనా బాగా నిరాశకు గురవడం మరియు నీరుగారిపోవడం జరుగుతోందా?

దీనికి చక్కటి పరిష్కారం ఏమిటంటే, ఎప్పటికప్పుడు మీ పిసిని మరియు అభ్యాస వనరులను ఆధునీకరించుకుంటూ ఉండండి. ఎంతయినా చికిత్స కంటే నివారణోపాయమే మేలు కదా!

మీరు ఆలస్యంగా పరుగు మొదలెడితే, చిట్టచివరగానే ముగిస్తారు. మీ పిల్లలకోసం పిసి ప్రయాణం ఆరంభించేటప్పుడే వారికి ఏది మంచిది మరియు ఏది అక్కర్లేదు అనేది మనసులో గుర్తుంచుకోండి. అది పిసి కావచ్చు, ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్ లేదా అభ్యాస వనరులు ఏదయినాగానీ. ఇతర తల్లిదండ్రులతో మాట్లాడండి. పేరెంట్-టీచర్ సమావేశాలలో టీచర్లతో లోతుగా చర్చించండి. విద్యాభ్యాసానికి పిసి రంగంలోని తాజా పరిణామాలపై అవగాహన కల్పించుకోండి.

సంతోషదాయక డిజిటల్ పెంపకం!