మీ బిడ్డ ప్రేమించే మూడు వర్చువల్ ఫీల్డ్ ట్రిప్పులు

 

పిల్లలు ఉత్సాహంగా పాల్పంచుకునే తరగతి గది అంటే- ఎక్కువ మంది విద్యార్థులు వినడం మరియు వారికి బోధించే సబ్జెక్ట్ విషయాలకు సంబంధించి ప్రశ్నలు అడగడాన్ని మించి టీచర్‌కు సంతోషాన్ని కలిగించేది మరొకటి ఉండదు. వాస్తవానికి, లంచ్ తరువాత లేదా చివరి పీరియడ్ల్లో మొత్తం క్లాసు కూడా చురుగ్గా పాల్పంచుకునేలా చేయడం చాలా కష్టంగా ఉంటుంది.

వర్చువల్ ఫీల్డ్ ట్రిప్పుల్లో ప్రవేశించడం.

కంప్యూటర్ ద్వారా, మీ విద్యార్ధులకు వారు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని ప్రదేశాలను క్లాస్‌రూమ్‌లోనే చూపించవచ్చు. ఈ కార్యక్రమాలు మీ క్లాసును ఉత్సాహవంతంగా మార్చడమే కాకుండా, అనేక ప్రశ్నలు అడగడానికి దోహదపడుతుంది, దీని వల్ల కవర్ చేసిన భావనలను తేలికగా గుర్తు చేసుకోవచ్చు. బట్టీ పట్టడం ద్వారా ఒక్కొక్క ఛాప్టర్‌ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.

మీ వద్ద ఉన్న కంప్యూటర్ని ఉపయోగించి మీరు ప్రారంభించగల మూడు పాపులర్ వర్చువల్ ఫీల్డ్ ట్రిప్పులు.

1) డిస్కవరీ ఎడ్యుకేషన్

సబ్జెక్ట్, గ్రేడ్ మరియు థీమ్‌గా విభజించబడ్డ- డిస్కవరీ ఎడ్యుకేషన్‌లో మీ విద్యార్థుల కొరకు వీక్లీ కార్యక్రమాలుంటాయి. ఈ థీమ్‌ల్లో ఎర్త్ మరియు స్పేస్ సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ మరియు ఇంకా ఎన్నింటిపైనే తాజా మరియు హై ఎండ్ ఫుటేజీ లభిస్తుంది. ఉదాహరణకు, ద ట్రండా వర్చువల్ అనుభవం అనేది అత్యంత అందమైన మరియు ఆసక్తికరమైన రీతిలో వారి క్లాసురూమ్‌లో నిజ ప్రపంచాన్ని తీసుకొని రావడం ద్వారా వార్షిక పోలార్ బేర్ వలసను చూపిస్తుంది.

 

2) గూగుల్ ఎర్త్

మీ విద్యార్ధులకు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలను చూపించడానికి మరియు బిల్ట్ ఇన్ లెసన్ ప్లాన్లను రూపొందించడానికి విద్యావేత్తలకు స్వర్గధామం అయిన, గూగుల్ ఎర్త్‌ని ఉపయోగించండి . వాస్తవానికి మొత్తం ప్రపంచం కూడా మీ పిసి బ్రౌజర్లో ఉంటుంది. అంటిగువాలోని ఫ్లవర్ మోజాయిక్లు, గ్వాటెమాలా నుంచి ఫ్లోరెన్స్, ఇటలీలో ఫైర్వర్క్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా మీ పిల్లలు చూడాలని కోరుకునే దేనినైనా అన్వేషించండి.

 

3) జూమ్ ఎర్త్

జూమ్ ఎర్త్ యొక్క గ్లోబల్ లైవ్ శాటిలైట్ ఫీడ్ తో మీ విద్యార్థులు ప్రపంచం మొత్తం చూడవచ్చు. “లొకేట్ మీ” అనే ఫీచర్ ఉంటుంది, స్థానిక చరిత్రకు నేపథ్యం జోడించడానికి, సిటీ నిర్ధిష్ట క్లైమేట్ లేదా సాధారణంగా సొసైటీని జోడించడానికి ఇది దోహదపడుతుంది. క్లాస్‌ని వారు నచ్చిన వేగంతో అన్వేషించనివ్వండి, తరువాత ఒకరినొకరు నేర్చుకున్న విషయాలను పంచుకోవడానికి గ్రూపు చర్చలు నిర్వహించండి.

మొదట, ఇది మీ సిలబస్‌కు వెలుపల ఉన్నట్లుగా అనిపిస్తుంది, అయితే సరైన లెసన్ ప్లానింగ్‌తో మీ విద్యార్ధులు మరింత ఎక్కువ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు!