మీ బిడ్డ స్వతంత్ర అభ్యాసకుడు కావడానికి కంప్యూటర్ సహాయపడటానికి మూడు మార్గాలు

 

రోజూ స్కూలుకు వెళ్లి రావడం

రోజంతా క్లాసులు

ఎక్స్ ట్రా కరిక్యులం కార్యక్రమాలు

ట్యూషన్లు

గ్రూపు ప్రాజెక్టులు

హోం వర్క్

మధ్యలో కాసేపు ఆడుకోవడానికి సమయం

తరువాత చివరగా స్వతంత్ర అధ్యయనం.

స్కూలు వారంలో సాధారణంగా ఒక విద్యార్ధి షెడ్యూలు ఇలానే ఉంటుంది.

స్వతంత్రంగా చదువుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అయితే, రోజంతా స్కూలులో రకరకాల పనులు చేసి అలసిపోవడం, చదువుకునే కార్యక్రమాన్ని చివరి పెట్టుకోవడం వల్ల దీనికి చాలా తక్కువ సమయం లభిస్తుంది.

మీ విద్యార్ధులకు సహాయపడటం కొరకు మీరు ఏమి చేస్తారు?

1) వారికి ఏది ఆసక్తి కలిగిస్తుందో తెలుసుకోండి

క్లాసు చివరల్లో, మీరు బోధించిన దానిలో వారికి బాగా నచ్చిన విషయం ఏమిటో అడిగి తెలుసుకోండి.
కొత్తగా పుట్టిన ఆసక్తిని మరింత బలోపేతం చేయడం కొరకు ఆ నిర్ధిష్ట అంశంపై పరిశోధించడం కొరకు హోం వర్క్ ఇవ్వండి. ఇది అన్ని వయస్సుల వారికి, అలానే అన్ని సబ్జెక్ట్‌లకు బాగా పనిచేస్తుంది. సబ్జెక్ట్ విషయాలను మరింత లోతుగా శోధించి, తదుపరి క్లాస్‌లో ప్రజంట్ చేయడానికి Wikipedia, Quora మరియు Google Scholar వంటి వాటిని మరింత ఎక్కువగా ఉపయోగించేలా మీ విద్యార్ధులను ప్రోత్సహించండి !

2) DIY ప్రాజెక్ట్‌లను చేర్చడం

Instructables విస్త్రృత శ్రేణి ప్రాజెక్ట్‌లను అందిస్తుంది. విద్యార్ధులు భావనలు తెలుసుకోవడానికి మరియు తరగతి గదిలో మీరు బోధించిన ప్రతివిషయాన్ని కూడా నిజ జీవితంలో అనుసంధానం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడం కొరకు, విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను వ్యాసం, ప్రజంటేషన్ లేదా చిన్నపాటి వీడియో ద్వారా పంచుకోమని అడగండి, తద్వారా వారు నేర్చుకున్న విషయాలను మీరు ట్రాక్ చేయగలుగుతారు. స్వతంత్ర అధ్యయనం మరియుు హోమ్ వర్క్‌లు అంతర్గతంగా అనుసంధానం చేయబడిన విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. రోటీన్‌కి భిన్నంగా హోమ్‌వర్క్‌లో విద్యార్ధులను నిమగ్నం చేయడం ద్వారా వారికి సబ్జెక్ట్‌పై ఆసక్తి మరియు ఇష్టం కలుగుతాయి.

3) మైండ్ మ్యాపింగ్‌ని ప్రోత్సహించడం

మైండ్ మ్యాపింగ్ అనేది కోర్ థియరీ లేదా ఒక ఆలోచనతో ప్రారంభమై, విభిన్న భావనలు మరియు ఆలోచనలతో శాఖీయంగా విస్తరిస్తుంది. తరగతి గదిలో బోధించిన సంక్లిష్టమైన సమాచారాన్ని ఇంటికి వెళ్లిన తరువాత విద్యార్థులు అర్ధం చేసుకొని, దానిని ఆకళింపు చేసుకోవడానికి ఈ విద్యావిధానం వారికి దోహదపడుతుంది. తేలికగా ఉపయోగించే డిజిటల్ మైండ్ మ్యాప్‌లను సృష్టించడం కొరకు, మీ విద్యార్ధులు ఇంటి వద్ద MindMeister మరియు Mindmapleతో ప్రయోగాలను చేసి, వారి మ్యాప్‌లను స్కూలులో స్నేహితులతో పంచుకునేందుకు ప్రోత్సహించండి. మీ విద్యార్ధులు నిజంగా ఉత్సాహం కలిగించడం కొరకు మీ మొత్తం యాక్టివిటిని మీరు పోటీగా మల్చవచ్చు.

ఒక ఛాప్టర్ తరువాత మరో ఛాప్టర్ బట్టీ పట్టడం అనేది మన అభ్యసన సంస్కృతిలో భాగమైంది, మనందరం కలిసి దీనిని మార్చగలం.