క్లౌడ్ స్టోరేజీ టీచర్లు ప్రయోజనం పొందగల మూడు మార్గాలు

 

 

క్లౌడ్ స్టోరేజీ అంటే ఏమిటి?

క్లౌడ్ స్టోరేజీ అనేది ఆన్లైన్ స్థలం, మీ ముఖ్యమైన డేటాను స్టోరు చేయడానికి ఉపయోగించే స్థలం ఇది. ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు లేదా యుఎస్బి ఫ్లాస్డ్రైవ్లు వంటి భౌతిక స్టోరేజీపై మీరు మీ ఫైళ్లను బ్యాకప్ చేస్తారు, మీరు కోరుకునే ప్రతిదానిని నిల్వ చేయడానికి క్లౌడ్ స్టోరేజీ అనేది ఒక సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. ఆన్లైన్ స్టోరేజీ పరిష్కారాలు అనేవి సాధారణంగా వర్చువల్ సర్వర్ల యొక్క అతిపెద్ద నెట్‌వర్క్‌తో, మీ ఫైళ్లను నిర్వహించే మరియు వర్చువల్ స్టోరేజీ స్థలాన్ని ఆర్గనైజ్ చేసే టూల్స్‌తో వస్తుంది. 

ఒక టీచర్‌గా, క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించడం ద్వారా నేను ఏవిధంగా ప్రయోజనం పొందగలను?

1. విద్యార్ధులకు అభ్యసన వనరులకు 24/7 ప్రాప్యతను అందిస్తుంది

మీరు ఎలాంటి క్లౌడ్ స్టోరేజీ ప్రొవైడర్‌ని ఎంచుకున్నప్పటికీ, మీ విద్యార్ధులు ఎక్కడైనా, ఎప్పుడైనా అభ్యసన వనరులు (లెసన్ సారాంశాలు, వెబ్సైట్లు, వీడియోలు, క్విజ్లు, గేమ్, అసైన్మెంట్లు మరియు ఇంకా ఎన్నింటినో) యాక్సెస్ చేసుకోవచ్చు. కేవలం నోట్స్ మాత్రమే తీసుకోకుండా విద్యార్థులు వాస్తవంగా క్లాస్ వినేందుకు ఇది అనుమతిస్తుంది.

2. విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడం

గ్రూపు ప్రాజెక్ట్‌ను సమీక్షించే విషయానికి వస్తే, ఎవరు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారనే దానిని చూడటానికి అదేవిధంగా ప్రతి విద్యార్ధి బలాలు మరియు బలహీనతలు గుర్తించడానికి దోహదపడుతుంది. ఇదేవిధంగా, ఎస్సేలు మరియు ప్రజంటేషన్లు వంటి వ్యక్తిగత అసైన్మెంట్ల కొరకు, మీ విద్యార్ధికి మీరు అవసరమైనప్పుడు అదనపు పిసి వనరులు అందించవచ్చు.

3. వేగవంతంగా టెస్ట్ ఫలితాలు

టెస్ట్‌లు చాలా తరుచుగాను మరియు ఫలితాలను మరింత వేగంగా పంచుకోవచ్చు. ( వాస్తవానికి, ఒకవేళ ఆటోమేటెడ్ అయితే వెంటనే) పంచుకోవచ్చు, తద్వారా తాము ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని విద్యార్ధులు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు, అలానే తుది పరీక్షలు రాయడానికి ముందు ఏ విషయాలను మెరుగుపరచుకోవాలనేది కూడా తెలుసుకుంటారు. ఇంత వేగంగా ఫలితాలను చూడటం ద్వారా మొత్తం క్లాస్ ఉత్సాహవంతంగా మారడంతోపాటుగా మరింత మెరుగ్గా స్ఫూర్తిని పొందుతుంది.

నేను ఏ క్లౌడ్ స్టోరేజీ ఆప్షన్ని ఉపయోగించవచ్చు?

మీరు ధర (చాలా సర్వీసులు ఉచితంగా అందించబడతాయి), సెక్యూరిటీ, గోప్యతాసెట్టింగ్లు మరియు వాటిని ఎంత సులభంగా ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మీ మదిలో పెట్టుకోవలి. ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోవడానికి అదేవిధంగా మీ క్లాసు మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గోల్స్‌కు అనుగుణంగా ఆవశ్యకతలను కస్టమైజ్ చేసుకోవడానికి కొంత సమయాన్ని ఉపయోగించండి.

మీకు అమెజాన్ డ్రైవ్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి కొన్ని ఆప్షన్లున్నాయి - అయితే, మీ స్వంత వీకీ స్పేసెస్ క్లాస్‌రూమ్‌ని రూపొందించడం అనేది మీ అత్యంత సరళమైన ఆప్షన్.