ఆన్లైన్ ఫిక్షన్ నుంచి వాస్తవాలను వేరు చేయడానికి మూడు పద్ధతులు

 

కోలిన్స్ డిక్షనరీ 2017లో వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ని అధికారికంగా ప్రకటించింది. ఏదేని ఒక విషయం అనవసరమైన వత్తిడిని, భయాన్ని, గందరగోళాన్ని సృష్టించగల సామర్థ్యంతో ఉన్నట్లయితే దానిని ‘ఫేక్ న్యూస్’గా పరిగణించింది. [1]

కొన్ని సందర్భాల్లో తమ పాత వార్తలకు కొత్తగా తప్పుదోవ పట్టించే చిత్రాలను, వీడియోలను లేదా నమ్మశక్యం కాని శీర్షికలను జోడించి లైవ్ బ్రేకింగ్ న్యూస్‌గా సామాజిక మాధ్యమంలోనూ, వాట్సప్‌లోనూ ప్రచారంలో పెడుతుంటారు.

పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపించే ఈ రకమైన అభూత కల్పనలను వాస్తవాల నుంచి వేరుచేయడం తల్లిదండ్రులకు, ముఖ్యంగా కౌమార దశ పిల్లలున్నవారికి అసాధ్యంగా మారుతుంది.

ఇక్కడ ఫేక్ న్యూస్ నుంచి ‘ఫేక్’ని గుర్తించడానికి అనువైన చెక్ లిస్ట్ ఉంది.

1) పక్షపాత రచయిత

ప్రత్యేకించి ఒక సంస్థ లేదా వ్యక్తులపై మొగ్గు కనిపిస్తోందంటే, ఆ రచయిత సమదృష్టితో లేరనడానికి పెద్ద గుర్తు. నిజాయితీ దృష్టి కోణం లోపించడంతో, ఒక ప్రత్యేకమైన పాక్షిక అభిప్రాయంపైనే అతి శ్రద్ధ వ్యక్తమవుతుంది. ఇది వ్యక్తి ఆలోచనలను తేలికగా ప్రభావితం చేసేస్తుంది. మరీ ముఖ్యంగా తమ రచనకు సమర్థనగా పక్షపాత చిత్రాలు, వీడియోలు జోడించినప్పుడు బాగా ప్రభావితపరుస్తాయి.

2) అతి నాటకీయత

నల్ల ధనాన్ని అరికట్టడానికి కొత్త కరెన్సీ నోట్లలో జిపిఎస్ చిప్
- ఇది తప్పుడు వార్తగా ఆర్బిఐ ధ్రువీకరించింది. [2]

కేవలం గంట వ్యవధిలోనే రాష్ట్రపతి కోవింద్ 30 లక్షల కొత్త ఫాలోవర్స్‌ని గడించారు.
- ప్రతి భారత రాష్ట్రపతి ఒకే ట్విటర్ ఖాతాని ఉపయోగించుకుంటారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వచ్చిన ఫాలోవర్స్ రాష్ట్రపతి కోవింద్‌కి సంక్రమించారు. [3]

2030లో అంగారక గ్రహం మీదకు పంపడానికి హర్యానాకి చెందిన జస్లీన్ కౌర్‌ని నాసా ఎంపిక చేసింది.
- పరిశోధకురాలు మరియు పిహెచ్డి విద్యార్థిని అయిన జస్లీన్ తాను ఇంకా ‘ఔత్సాహిక వ్యోమగామి’నే అని చెప్పింది. [4]

ఏదైనాగానీ అతిగా లేదా అతిశయోక్తిగా అనిపిస్తే అది ఫేక్ న్యూస్ కావచ్చు. ఏవో ఒకటి రెండు వాక్యాలైతే ఫర్వాలేదు కానీ, మొత్తం వ్యాసం ధ్రువపడని విషయాలతో ఉన్నట్లయితే, సందేహించక తప్పదు.

3) కేవలం ఒకటే ఆధారం

సమాచారాన్ని పలు విధాలుగా ధ్రువీకరించుకోవడానికి ఆన్లైన్లో అలాంటిదే మరో వార్త లేదా వ్యాసం మీకు లభించనట్లయితే అది ఫేక్ న్యూస్ అవుతుంది. ప్రధాన ప్రచురణకర్తలెవరూ దానిని ప్రచురించలేదంటే, బహుశా ప్రజాభిప్రాయాన్ని మార్చడంకోసం ఒక వ్యక్తి లేదా బృందం తెలివిగా చేసిన పన్నాగంగా భావించాలి.

డిజిటల్ సొంత సవాళ్లతో వస్తున్నప్పుడు పెంపకమనేది చాలా కష్టం. ఏదేమైనా, పిసిని పొందడం మరియు దానిని సక్రమంగా వినియోగించడం తెలిసినట్లయితే, మీరు డిజిటల్ మంచి డిజిటల్ తల్లిదండ్రులైనట్లే! సంతోషదాయక డిజిటల్ పెంపకం!