కోడ్ చేయడమెలాగో నేర్చించగల మూడు వెబ్సైట్లు

‘‘నేను పదేళ్ల వయసున్న ఫ్రెంచ్ విద్యార్థిని అయినట్లయితే, ఇంగ్లిష్ నేర్చుకోవడంకంటే కోడింగ్ నేర్చుకోవడమే చాలా ముఖ్యమని భావిస్తాను. ఇంగ్లిష్ నేర్చుకోవద్దని నేను చెప్పడం లేదు. ఇది ప్రపంచంలో 70 లక్షల మందికి మీరెవరో మీ గురించి చెప్పుకోవడానికి వీలు కల్పించే భాష. నా ఉద్దేశంలో ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ కోడింగ్ అనేది చాలా అవసరం’’. – టిమ్ కుక్, ఆపిల్ కార్పొ సిఈఓ. [1]

కోడర్ అనేది రోబో కాదు. అలాగని సైబోర్గ్ లేదా ఎక్కడో మారుమూల ‘కృత్రిమం’గా పనిచేసేది కాదు. అతను లేదా ఆమె మీ పక్కనే కూర్చునే మంచి స్నేహితులు లేదా చక్కగా ఆలోచించే మీ పొరుగు వ్యక్తి మరియు ప్రపంచం అర్థం చేసుకునేలా కోడ్ రాయగలవారు. మీరు ఎలా ఆరంభించాలో ఇక్కడ చూద్దాం :

మూలం నుంచి ఆరంభం

కోడింగ్ అభ్యసనంలో 4.5 కోట్ల మందికి పైగా Codecademyని అనుసరిస్తున్నారు. ఇది ప్రతి స్థాయిలోనూ ఇంటర్ఫేస్గా మరియు మార్గదర్శిగా ఉంటుంది. కేవలం తదుపరి పెద్ద యాప్ తయారీకి మిమ్మల్ని తయారు చేయడంగా కాక, ప్రతి కోర్స్ని మీ మనసుకు హత్తుకునేలా, భిన్నంగా ఆలోచించగలిగే చేస్తుంది. ఇతర అంశాలనుకూడా నేర్చుకునేలా మీకు సాయపడుతుంది.

మీకు నైపుణ్యం వచ్చేవరకు వాడండి

కొత్తవి నేర్చుకోవడమనేది ఉత్తేజకరంగానూ, కొంత బెంబేలెత్తించే విధంగానూ ఉంటుంది, కోడింగ్ సైతం భిన్నమైనదేమీ కాదు. దీనిలో శోధించడానికి చాలా ఉంది. మీరు రోజుకొక గంట కోడ్ వారి ప్రపంచ ప్రఖ్యాత ‘అవర్ టు కోడ్’కి గనుక కేటాయించగలిగితే, సరదాలతో కూడిన వారి గేమ్స్తో ఆడుకుంటూ అభ్యసించవచ్చు. క్లాసిక్ మైక్రోసాఫ్ట్ నుంచి మీ స్వంత గేమ్&zwnjని తయారు చేయడం - మీ కొరకు ప్రతిదీ ఉంది.

మీ సొంత సృష్టిని కోడ్ చేయండి

Scratch – ఇదొక మీడియా లాబ్ వెంచర్. మీ సొంత కథలు, ఆటలు, యానిమేషన్లు వగైరాలతో వెబ్సైట్ రూపకల్పనకు సాయపడుతుంది. మీరు మరిన్ని అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ యొక్క మౌలిక అంశాలను నేర్చుకుని సరైన ఆదేశాలను పాటిస్తూ మీరే రూపొందించుకోవచ్చు. అదనంగా, ఆన్లైన్లో ఉన్న కోడర్ల కమ్యూనిటీతో ప్రాక్టికల్ సలహాలను మరియు ప్రాజెక్టులపై అభిప్రాయాలను పంచుకోవచ్చు, కూడా.

సరైన పిసి ఉన్నట్లయితే ఎవరైనా కోడింగ్ నేర్చుకోవచ్చు. కొన్ని గంటల్లోనే మౌలిక అంశాలను గ్రహించగలరు. కొన్ని వారాలకే ప్రాథమిక వెబ్సైట్లను మరియు యాప్లను రూపొందించుకోవచ్చు. సాంకేతిక ప్రపంచంలో తదుపరి యువ సాధకుడిగా తయారవడానికి మీరు ప్రయత్నించవచ్చు!