మీ పిల్లవాడికి హైబ్రిడ్ చదువు మెరుగ్గా ఎలా పని చేసేలా చేయవచ్చో అనె దాని పై చిట్కాలు

హైబ్రిడ్ అభ్యాసం, పిల్లలకు చదువు చెప్పడానికి, పూర్తిగా కేవలం ఆన్లైన్ వ్యవస్థలను మాత్రమే ఉపయోగిస్తుంది. మహమ్మారి కారణంగా ఈ రోజుల్లో అన్నీ సూళ్లలో ప్రస్తుతం ఇది సాధారణంగా మారింది. హైబ్రిడ్ విద్య కొనసాగబోతున్నది కాబట్టి, దీనిని తమ పిల్లలకు మరింత అర్ధవంతంగా మరియు సరదాగా ఎలా మార్చాలో, తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  1. నియమిత అధ్యయన-స్థలం: వర్క్-ఫ్రమ్-హోమ్ పరిస్థితులలో పెద్దలచే ఉపయోగించబడే రిమోట్ కార్యాలయ ప్రదేశాలలాగే, పిల్లలకు కూడా తమ తరగతులకు మరియు ఇతర రోజువారీ కార్యకలాపాల కోసం విడిగా స్థలం కావాలి.
  2. స్వీయ-మార్గదర్శక అభ్యాసం: తరగతులు జరుగుతున్నప్పుడు, నిరంతరంగా సలహాలు, సూచనలు ఇవ్వడాన్ని నివారించాలి. ఈ విధంగా బోధించబడుతున్న అంశాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించడంలో పిల్లలపై మరింత బాధ్యత ఉంటుంది. ఇది చిన్న వయసులోనే వారిని స్వతంత్ర అభ్యాసకులుగా మారుస్తుంది.
  3. ఇంటరాక్టివ్ సాధనాలను ఉపయోగించండి: వైట్ బోర్డులు, లైవ్-చాట్ మరియు రిమోట్ అభ్యాస సమయంలో నిరంతర ఫీడ్ బ్యాక్ వంటి సాధనాలు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య మెరుగైన సమాచార మార్పిడి మరియు ఎంగేజ్మెంట్ పెంపొందించడంలో సహాయపడతాయి
  4. తరచు విరామాలను చేర్చండి: నిరంతర స్క్రీన్-సమయం హానికరమైనదిగా నిరూపించబడవచ్చు. దీనిని నివారించడానికి, స్క్రీన్-సమయాన్ని పరిమితం చేసే, పజిల్స్ సాధించడం మరియు ఆన్లైన్ తరగతుల మధ్యలో ఆడియో పుస్తకాలను వినడం వంటి అర్ధవంతమైన కార్యకలాపాలను చేపట్టాలి.
  5. సమగ్రమైన అభ్యాసం: చదువు సమగ్రంగా మరియు పూర్తిగా సరదాగా ఉండాలి. మొత్తం మీద పిల్లవాడి యొక్క శ్రద్ధ, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడంలో సహాయపడే పి సి ఆధారిత అభ్యాసం మరియు ఇంటరాక్టివ్ శారీరక కార్యకకలపాల ఆరోగ్యమైన కలయికగా ఉండాలి.

మీ పిల్లవాడి కోసం పి సి అభ్యాసాన్ని ఎలా ప్రయోజనకరం చేయగలరు అనేదాని గురించి మరింత తెలుసుకునేందుకు మా వెబినార్ లో చేరండి - https://www.dellaarambh.com/webinars/