మరింత ఉత్పాదక విద్యార్ధిగా మారాలంటే ఏమి చేయాలి?

 

 

పరీక్షలు అనివార్యమైనవి. మీపై ఉండే ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే మీలో నుంచి అన్ని ముఖ్యమైన విషయాలు వెలుపలికి వస్తాయి. ఒత్తిడిని తగ్గించుకునే చిట్కాలు మరియు జాగ్రత్తగా ప్లానింగ్ చేయడం ద్వారా మీకు తగినంత సమయం మీ చేతుల్లో ఉంటుంది. ఇదిగో ఎలానో చూడండి:

1. చేయాల్సిన పనుల జాబితా మీ స్నేహితుడు

మీరు చదవాల్సిన మరియు అలానే సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ల ప్రతి టాపిక్ జాగ్రత్తగా లిస్ట్ చేయడం ద్వారా వాటి గురించి మీరు మర్చిపోతాం అనే బాధపడాల్సిన విషయమే ఉండదు. పూర్తయిన మరియు పూర్తికాని పనులకు సంబంధించిన సవిస్తరమైన చిత్రాన్ని పొందడం ద్వారా మీరు ఫోకస్‌గా ఉండటానికి మరియు మీ సమయాన్ని మీరు ఏవిధంగా పెట్టుబడి పెడుతున్నారనే దానిని ట్రాక్ చేయడానికి దోహదపడుతుంది.

మీరు చేయాల్సిన పనుల జాబితాకు సంబంధించిన కంప్యూటర్ వనరులు:
Todoist
Google Keep

2. నోట్స్ తీసుకునేటప్పుడు సానుకూలంగా ఉండండి

మీ నోట్స్నిసరిగ్గా కంపైల్ చేసుకున్నట్లయితే దాదాపుగా మీ సగం పని పూర్తవుతుంది. అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ముందు లేదా ఒక పరీక్షకు సిద్ధం కావడానికి ముందు ‘‘సమాచారం ఓవర్‌లోడ్’ని అధిగమించడానికి ఇది సహాయపడుతుంది. కొన్ని టూల్స్ మీకు అవసరమైన టెక్ట్స్, డయాగ్రమ్‌లు, వెబ్‌పేజీలు, వీడియోలు మరియు ఇంకా ఆడియో క్లిప్‌లు అన్నింటిని కూడా ఒకే ప్రదేశంలో పొందేందుకు సహాయపడతాయి.

నోట్స్ తీసుకోవడానికి పిసి వనరులు:
Evernote
One Note

3. మీ గోల్స్ స్పష్టంగా ఉంచుకోండి.

మూడ్ బోర్డులు అనేవి మీ గోల్స్ యొక్క పిక్టోరల్ ప్రాతినిధ్యం, మీకు స్ఫూర్తిని అందించే ప్రతిదీ దీనిలో జోడించండి, తద్వారా మీ కలలు సాకారం చేసుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని మీరు పొందుతారు. మీ గోల్స్ (చదువుపరంగా మరియు మరోవిధంగా) విజువలైజ్ చేసుకోవడం ద్వారా మీరు కోరుకునే దానిని అత్యుత్తమంగా చేయడానికి అవసరమైన స్ఫూర్తిని పొందడానికి సహాయపడుతుంది.

మీ మూడ్ బోర్డ్ తయారు చేయడానికి కంప్యూటర్ వనరులు:
Go Moodboard
Canva

4. మీ ‘‘గంటలు’’ తెలుసుకోండి

టైమ్ ట్రాకింగ్ వెబ్సైట్లు గడిపిన సమయం గురించి క్లారిటీని అందిస్తాయి, సమయాన్ని హరించే కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి మరియు మరింత మెరుగ్గా ప్రాధాన్యత కల్పించుకోవడానికి దోహదపడుతుంది. అందువల్ల, మీరు అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండేవారు అయినా లేదా తెల్లవారుజామునే లేచేవారు అయినా, మీరు దానికి అనుగుణంగా అత్యంత ఫోకస్‌గా మీ స్టడీ షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.

మీకు సహాయపడగల పిసి వనరులు:
Toggl
Time Camp

5. మిమ్మల్ని నడిపించే వ్యక్తుల మధ్య ఉండండి

పట్టుదల అనేది ఒక ప్రకృతి అంశం. చదవడానికి సంబంధించి సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తుల సాంగత్యంలో ఉండటం మరియు వారితో కలిసి సిద్ధం కావడం వల్ల, మీకు తగినంత స్ఫూర్తి లభిస్తుంది.

క్లాస్‌రూమ్‌లో ప్రొడక్టివ్‌గా ఉండటమే కాకుండా, ఇంటి వద్ద కూడా ప్రొడక్టివ్‌గా ఉండటం ముఖ్యం. మీకు ఎల్లప్పుడూ హోమ్ వర్క్ ఉంటుంది, మీ హోమ్ వర్క్ మరింత సమర్ధవంతంగా చేయడానికి మరియు దానిని ఆస్వాదించడం కొరకు ఈ ఏడు కంప్యూటర్ వనరులు దానిలో పొసగేట్లుగా చూడండి.