మీ బిడ్డ నేర్చుకోవడానికి ఇష్టపడే వెబ్సైట్లు: వయస్సులవారీగా గైడ్

 

మీరు కంప్యూటర్ ని కొనుగోలు చేశారు మరియు ఇది మీ బిడ్డ అభ్యసనకు ఏవిధంగా సహాయపడుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ ఆధారిత అభ్యసన ఏవిధంగా ప్రారంభించవచ్చు? ఇదిగో ఈ వయస్సుల వారీ గైడ్ మీ బిడ్డ కంప్యూటర్ ఉపయోగించడాన్ని మొదలు పెట్టడానికి దోహదపడుతుంది.

 

5 -7 సంవత్సరాలు

వినోదం మరియు అభ్యసన మధ్య ఖచ్చితమైన సంతులనం ఉండే గేమ్ లు, పిల్లల కొరకు అభ్యసన గేమ్ లు మీ బిడ్డ స్కూలు నుంచి వచ్చిన తరువాత కంప్యూటర్ , అభ్యసనలో లగ్నం కావడానికి దోహదపడతాయి ఈ గేమ్ లు పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత కేవలం ఆడటమే కాకుండా దాని నుంచి నేర్చుకోవాలని కోరుకుంటారు, ఇది చదువుకునేటప్పుడు ఒక దీర్ఘకాలికమైన మరియు సానుకూల సంబంధాలను ఏర్పరుస్తుంది. అన్ని గేమ్ లు కూడా వయస్సులవారీగా విభజించబడి ఉంటాయి, అలానే అన్ని గేమ్ లను కూడా ఆకారాదిక్రమంలో చూడవచ్చు.

8-10 సంవత్సరాలు

Uptoten యొక్క తేలికగా నావిగేట్ చేయగల మరియు కలర్ ఫుల్ యానిమేషన్ లు విద్యార్థుల్లో ఈ వెబ్ సైట్ ని ప్రముఖంగా చేశాయి, మరిముఖ్యంగా షార్ట్ టూ ద పాయింట్ వీడియోలు ఎంతో బాగుంటాయి. వీడియోల్లో ఉపయోగించే భాష స్నేహపూర్వకంగాను మరియు భరోసా కల్పించేవిధంగా ఉంటుంది, విద్యార్థులతో ఒక స్నేహితుడు భావనల గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది, ఇది వారిలో ఒక చెరిగిపోని మరియు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుంది.  దీనిలో ఇంటరాక్టటివ్ కలరింగ్ షీట్లు మరియు గేమ్ లు కూడా ఉంటాయి. ఇది టాపిక్ ను సరళీకృతం చేస్తుంది.

10 -12 సంవత్సరాలు

ఈ దశలో పిల్లకు ఒకాబులరీ, అర్థమెటిక్ వంటి ప్రాథమిక అంశాలపై నాలెడ్జ్ ఉంటుంది, వీరు స్కూలులో బోధించిన విషయాల గురించి మరింత లోతుగా అన్వేషించాలని కోరుకుంటారు. అలాంటి సమయాల్లో Wonderpolis ఎంతగానో సహాయపడుతుంది. వారు తెలుసుకోవాలని కోరుకునే ఒక పదం గురించి చూడవచ్చు. కొత్త లేదా నిజ జీవితంలో అనువర్తించడానికి అవసరమైన వాటిని నేర్చుకోవడం కొరకు వెబ్ సైట్ పై ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే విషయాన్ని అన్వేషించవచ్చు.

12 సంవత్సరాలు & ఆ పైన

మీ బిడ్డ రివిజన్ చేయడం కొరకు తన కంప్యూటర్ బ్రౌజర్ పై ఒక సైట్ బుక్ మార్క్ చేసుకోవాల్సి వస్తే అది Brainscapeగా ఉండాలి. దీనిలో నిపుణుల ద్వారా తయారు చేసిన టాపిక్ ఆధారిత ఫ్లాష్ కార్డులు చదువుకున్న విషయాన్ని మరింత మెరుగ్గా గుర్తుంచుకునేందుకు దోహదపడుతుంది. మీ విద్యార్ధులు పరీక్షలకు ముందు తాము ఎక్కడ ఉన్నాం మరియు మెరుగుపడటం కొరకు ఏమి చేయాలనే విషయాలను పరీక్షలకు ముందు తెలుసుకోవడానికి తమ నాలెడ్జ్ ని పరీక్షించుకోవచ్చు. అన్నింటిని మించి, సమాధానాలు  రైట్ కావడం వల్ల మీ బిడ్డలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇది మీ బిడ్డలో పరీక్షలకు సంబంధించి ఆతురతను తగ్గిస్తుంది.

చిన్నపాటి అన్వేషణ ద్వారా మీ బిడ్డకు అవసరమైన ఎన్నింటినో మీరు అందించవచ్చు, అయితే చెక్ లిస్ట్ ని దృష్టిలో పెట్టుకోండి, తద్వారా మీరు మీ బిడ్డకు అత్యుత్తమైనది అందిస్తారు. :)