ఒక టీచర్‌ని గొప్పగా తీర్చిదిద్దేవి ఏమిటి?

 

‘‘ఇతర అన్ని రకాలైన వృత్తులను సృష్టించే ఏకైక వృత్తి బోధన.’’

– తెలియని మూలం [1]

 

ఒక టీచర్ ని గొప్పగా తీర్చిదిద్దేది ఏమిటి? టీచర్ నిరంతరంగా మరియు వారి అత్యుత్తమ సామర్ధ్యంతో తన బిడ్డలో ఉండే విద్యానైపుణ్యాన్ని వెలికి తీసే వ్యక్తి అని తల్లిదండ్రులు పేర్కొంటారు. మరోవైపు, రోజువారీ అభ్యసనలో వినోదాన్ని జోడించి, ఎంత సంక్లిష్టమైన భావనలు అయినా అర్ధం చేసుకొని, గుర్తుంచుకోవడంలో వాస్తవంగా సహాయపడే టీచర్ ని గొప్ప టీచర్ అని విద్యార్ధులు పేర్కొంటారు.

 

అయితే ఒక టీచర్ ని గొప్పగా తీర్చిదిద్దేవి ఏమిటి?

 

1. వారికి గోల్స్ ఉంటాయి.

మీరు గోల్ ని సెట్ చేసినప్పుడు, మీకు దీర్ఘకాలిక విజన్ ఉంటుంది. స్ఫూర్తి మరియు చర్య సహజంగానే అనుసరిస్తాయి. అత్యధిక ఆకాంక్షలను సెట్ చేయడం ద్వారా మీకు మీరు ఒక ఎడ్జ్ ని మరియు వాస్తవిక దిశను కల్పించుకుంటారు.

 

2. ప్రతి క్లాస్ కొరకు వారు సిద్ధం అవుతారు

యాక్షన్ ప్లాన్ లేకుండా గోల్ ఏమిటి? కేవలం ఒక కల మాత్రమే. అందువల్లనే లెసన్ ప్లానింగ్ అనేది బోధనలో అత్యంత  కీలకమైన భాగం. ఇది వాస్తవ ప్రదర్శనకు ముందు డ్రెస్ రిహార్సల్స్ లాంటిది. ఇదిగో మీ కొరకు ప్రారంభ బిందువు: లెసన్ ప్లాన్ ల కొరకు మీకు అత్యావశ్యకమైన 5 పాయింట్ ల చెక్ లిస్ట్

 

3. వారు వింటారు

దీనిని మనంత తరచుగా నిర్లక్ష్యం చేస్తాం. వారు కేవలం శబ్ధాలను వింటారు, అయితే వాస్తవంగా అర్ధాన్ని వినరు. విద్యార్ధులతో సంభాషించడంలో నిమగ్నం కావడం మరియు వారిని ఏ ప్రశ్నలు అడగాలనే దానిపూ ఆసక్తి చూపించడం వంటి విషయాలను శ్రద్ధ పెట్టడం ద్వారా తమ విద్యార్ధులతో చక్కటి సంబమ:ధాన్ని ఏర్పరుచుకునే టీచర్ ల క్లాసులో విద్యార్ధులు మరింత మెరుగ్గా నిమగ్నం అవుతారని సంవత్సరాల తరబడి అధ్యయనం తెలియజేస్తోంది. [2]

 

4. వారు తమ బోధనను నిజ జీవితానికి అనుసంధానం చేస్తారు

ఇలాంటి విషయాల్లో కంప్యూటర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక కంప్యూటర్ వాస్తవానికి జీవితానికి సరిపోయే అనుభవాన్ని అందిస్తుంది, ప్రజంటేషన్ లు, వీడియోలు, ఇన్ ఫోగ్రాఫ్ లు, ఎడ్యుకేషనల్ గేమ్ లు వంటి తక్షణం లభ్యం అయ్యే అనేక రకాలైన విద్యా వనరుల ద్వారా ఇది సాధ్యమవుతుంది.

 

5. వారు జీవితకాల అభ్యాసకులు

మీ టీచింగ్ కెరీర్ లో మీరు ఎక్కడ ఉన్నారు అనేదానితో సంబంధం లేకుండా, మీరు నిరంతరం చదువుతూ మరియు సబ్జెక్ట్ విషయాల్లో అప్ టూ డేట్ గా ఉండాలి. వాస్తవానికి, మీరు ఒక అడుగు ముందుకు వేసి, విషయాలపై  విభిన్న అభిప్రాయాన్ని కలిగించడం కొరకు మీ సబ్జెక్ట్ ప్రాంతం చుట్టూ లేదా ఏదైనా పూర్తిగా విభిన్నమైన దానిని చదవండి. మీరు మేధోపరంగా ఉద్దీపనం చెందడమే కాకుండా, మీకు వచ్చే అవకాశాలను మీరు ప్రశంసించకుండా ఉండలేరు.

 

ఇదంతా కూడా #DigitalLearning లో ముడిపడి ఉంటుంది, మీ విద్యార్ధులకు మెురుగైన అభ్యసన అందించడానికి కంప్యూటర్ తో సహా అత్యధిక సాంకేతికతను ఉపయోగించుకుంటారు.