అసైన్మెంట్లు మరియు టెస్ట్‌లకు దిద్దేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటి

 

 

టీచర్లు కాస్తంత వేగంగా పని పూర్తి చేయాలని అనుకునే విషయం ఒకటి ఉంటుంది అదే పేపర్లను దిద్ది, మార్కులు వేయడం. ప్రతి టర్మ్‌లో పరీక్షలు, క్లాస్ టెస్ట్‌లు మరియు రెగ్యులర్ అసైన్మెంట్లు ఉండటం వల్ల మీరు పేపర్లు సరదాగా దిద్దడానికి దోహదపడే సరైన టూల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ మార్గదర్శకాలను మదిలో పెట్టుకోండి, మరింత సమర్ధవంతంగా పేపర్లు దిద్దడం మరియు మార్కులు వేయడం గమనించండి.

1. మీ ఆన్సర్ బుక్‌ని సిద్ధంగా ఉంచుకోండి

సమాధానాలను వేగంగా యాక్సెస్ చేసుకోవడం కొరకు సరళమైన వర్డ్ డాక్యుమెంట్ లేదా ఎక్సెల్ షీటు ఉపయగోంచి, సమాధానాలను ప్రశ్నాసమాధానాల రూపంలో పొందుపరుచుకోండి. సమాధానాలను అన్ని సంభావ్య ప్రత్యామ్నాయాలను శోధించండి, తద్వారా సాధ్యమైనంత వేగంగా మార్కులు వేయడం కొరకు మీరు మీ ఆన్సర్ బుక్‌ని రిఫర్ చేయవచ్చు.

2. ప్రతి పేపర్ కాకుండా ప్రతి సెక్షన్‌ని ఒకేసారి మార్క్ చేయండి.

ఈ విధానం మార్కింగ్ ప్రక్రియను సులభతరం చేయడం మరియు వేగవంతం చేస్తుంది. అదనంగా, మీరు మీ మొత్తం క్లాసులో బలహీనంగా ఉన్న టాపిక్స్‌ని గుర్తించగలుగుతుంది. ఒకేసమయంలో ఒక సెక్షన్‌కు మార్కులు ఇవ్వడం ద్వారా, ఒక పద్ధతి ప్రకారంగా మార్కులు కూడటానికి మీకు అవకాశం ఏర్పడుతుంది.

3. హ్యాండ్‌అవుట్ వలే కలెక్టివ్ ఫీడ్‌బ్యాక్ అందించండి.

బలహీనంగా ఉన్న టాపిక్‌లకు సంబంధించి మీరు లిస్ట్‌ని రూపొందించిన తరువాత, తేలికగా ఉపయోగించే కంప్యూటర్ వనరుల ద్వారా హ్యాండ్‌అవుట్ వలే ఒక కలెక్టివ్ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. క్లాస్ టెస్టులు, ప్రిలిమనరీలు మరియు అసైన్మెంట్ల ఫీడ్‌బ్యాక్ కొరకు ఇది ఎంతో ఉపయోగమైనది, మీ విద్యార్ధులు వాస్తవంగా ఎక్కడ ఉన్నారు, వారు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏవిషయాల్లో మెరుగ్గా ఉన్నారు అని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.

4. కంప్యూటర్ గ్రేడింగ్ టూల్స్ ప్రయత్నించండి.

టెస్ట్‌లు మరియు అసైన్మెంట్లను ఆన్లైన్ గ్రేడింగ్ చేయడానికి మరియు లెక్కించదగ్గ అభ్యసన టార్గెట్లు సెట్ చేయడానికి Jumpro క్లాస్రూమ్ ఎడిషన్ (ఇది వ్యక్తిగత టీచర్లకు ఉచితం)కు సైన్అప్ చేయండి) ఈ టూల్ ఉపయోగించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, అన్ని విషయాలు కూడా ఒకే ప్రదేశంలో ఉంటాయి కనుక ఇది చాలా విలువైనది.

5. కంప్యూటర్ టెస్టింగ్ మరియు అసైన్మెంట్లతో ప్రయోగం

తక్షణ ఫలితాలు అందించడానికి, Google Classroom లేదా మీరు స్వంతంగా సృష్టించిన Wikispace classroom ఉపయోగించి కంప్యూటర్‌పై టెస్ట్ నిర్వహించండి లేదా అసైన్‌మెంట్‌ని ఇవ్వండి.

కంప్యూటర్ మీరు బోధించే రీతిని మారుస్తుంది, వనరులను మరింత తేలికగా యాక్సెస్ చేసుకునేందుకు దోహదపడుతుంది మరియు ప్రతిసారి మీ క్లాస్ కొరకు విద్యార్ధులు ఎదురు చూసేవిధంగా లెసన్ ప్లాన్లను రూపొందించేందుకు దోహదపడుతుంది.